
టీటీడీ బర్డ్ ఆస్పత్రిలో దారుణం... రోగికి ‘O’పాజిటివ్‌కు బదులు ‘B’నెగిటివ్ రక్తం
వైద్యుల నిర్లక్ష్యం కారణంగా సదరు రోగి కిడ్నీ బాధితుడిగా మారాడు. తప్పు గ్రహించి స్విమ్స్ లో డయాలసిస్ చేయించి చేతుల దులిపేసుకున్నారు డాక్టర్లు.
టీటీడీ బర్ద్ ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యం బయటపడింది. ఆపరేషన్ సమయంలో ఓ రోగికి ఓ పాజిటివ్ రక్తానికి బదులు బి నెగిటివ్ ఎక్కించారు డాక్టర్లు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వైద్యుల నిర్లక్ష్యం కారణంగా సదరు రోగి కిడ్నీ బాధితుడిగా మారాడు. తప్పు గ్రహించి స్విమ్స్ లో డయాలసిస్ చేయించి చేతుల దులిపేసుకున్నారు డాక్టర్లు. దీంతో తనకు పూర్తి సమాచారం ఇవ్వాలంటూ RTI యాక్టు ద్వారా బర్ద్ యాజమాన్యాన్ని కోరాడు బాధితుడు. టీటీడీ సంస్థలు ఆర్టీఐ పరిధిలోకి రావంటూ సమాధాన మిచ్చాడు. తన ఆరోగ్యాన్ని నాశనం చేసిన వైద్యులపై చర్యలతో పాటు 5 కోట్ల రూపాయలు నష్టపరిహారం చెల్లించాలంటూ బాధితుడు న్యాయపోరాటానికి సిద్ధమవుతున్నాడు.
Published by:Sulthana Begum Shaik
First published:October 28, 2019, 12:30 IST