TTD ANNOUNCES E AUCTION OF WATCHES DONATED BY PILGRIMS TO TIRUMALA VENKATESWARA SWAMY BA
తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త... ఈ -వేలంలో వాచీల విక్రయం...
తిరుమల శ్రీవారు
తిరుమల శ్రీవారి ఆలయంతో పాటు ఇతర అనుబంధ ఆలయాలలో హుండీ ద్వారా భక్తులు కానుకగా సమర్పించిన వాచీలను ఫిబ్రవరి 10 నుంచి 12వ తేదీ వరకు ఈ-వేలం వేయనున్నారు.
తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త. తిరుమల శ్రీవారి ఆలయంతో పాటు ఇతర అనుబంధ ఆలయాలలో హుండీ ద్వారా భక్తులు కానుకగా సమర్పించిన వాచీలను ఫిబ్రవరి 10 నుంచి 12వ తేదీ వరకు రాష్ట్ర ప్రభుత్వ కొనుగోలు పోర్టల్ ద్వారా ఈ- వేలం వేయనున్నారు. ఇందులో క్యాషియో, టైమెక్స్, ఆల్విన్, టైమ్స్, సొనాటా, టిస్సాట్, ఫాస్ట్‌ట్రాక్ తదితర కంపెనీల వాచీలున్నాయి. ఇందులో క్రొత్తవి/ఉపయోగించిన/పాక్షికంగా దెబ్బతిన్న వాచీలు మొత్తం -128 లాట్లు (ఇ.ఎ.నెం.20847, 20848, 20849, 20850, 20851 మరియు 20852 నెంబర్లు) ఈ-వేలంలో ఉంచారు. ఇతర వివరాలకు తిరుపతిలోని టీటీడీ మార్కెటింగ్ కార్యాలయాన్ని 0877-2264429 నంబరులో ఆఫీసు వేళల్లో, టీటీడీ వెబ్సైట్ www.tirumala.org లేదా రాష్ట్ర ప్రభుత్వ పోర్టల్ www.konugolu.ap.gov.in ను సంప్రదించవచ్చని టీటీడీ ఓ ప్రకటనలో తెలిపింది.
తిరుమల తిరుపతి
ప్రపంచంలోనే అత్యంత ధనిక హైందవ దేవస్థానం అయిన తిరుమల తిరుపతి శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయానికి భక్తులు లక్షలాదిగా తరలివస్తుంటారు. వారంతా తమకు తోచినంత హుండీలో కానుకలు వేస్తుంటారు. కొందరు కలిగిన వారు ఎక్కువ మొత్తంలో నిధులను ఇతర కార్యక్రమాలకు వితరణ చేస్తుంటారు. అలాగే, కొందరు నిలువుదోపిడీలు మొక్కుకున్న వారు కూడా ఉంటారు. ఇలా నిలువు దోపిడీ మొక్కుకునే భక్తులు ఆ సమయంలో తమ ఒంటి మీద ఉన్న నగలు, ఆభరణాలతో పాటు ఇలాంటి వాచీలు, సెల్ ఫోన్లను కూడా శ్రీవారి హుండీలో వేస్తుంటారు. అలా హుండీల ద్వారా సేకరించిన వస్తువులను సేకరించి అప్పుడప్పుడు టీటీడీ ఈ-వేలం వేస్తూ ఉంటుంది. కేవలం వస్తువులే కాకుండా అప్పుడప్పుడు తలనీలాలను కూడా వేలం వేస్తారు. దీనికి పెద్ద ఎత్తున అంతర్జాతీయ స్థాయిలో టెండర్లు దాఖలు చేస్తారు.
వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమల ముస్తాబు
మరోవైపు తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాద వితరణలో రాయితీ విధానానికి తిరుమల తిరుపతి దేవస్థానం ఇటీవల మంగళం పాడింది. ప్రస్తుతం వివిధ రకాల ద్వారా దర్శనం చేసుకునే యాత్రికులకు ఉచితంగా రాయితీలపై లడ్డూలను అందజేస్తున్నారు. సేవా టికెట్లు, బ్రేక్ దర్శనం టికెట్ల ద్వారా దర్శనం చేసుకునే వారికి రెండు లడ్డూలను ఉచితంగా ఇస్తున్నారు. ఇకపై ప్రతి భక్తునికి ప్రసాదం కింద 175 గ్రాములుగల ఒక లడ్డూని మాత్రమే టీటీడీ అందించనుంది. సేవా టికెట్లు, ఆర్జిత సేవల టికెట్లలో శ్రీవారిని దర్శించుకునే యాత్రికులకు ఇకపై ఒకలడ్డూను మాత్రమే ఇవ్వనున్నారు. అదనంగా భక్తులు ఎక్కువ లడ్డూలు కావాలనుకుంటే లడ్డూ కాంప్లెక్లు్ల్లోని ఎల్పీటీ కౌంటర్లలో తీసుకోవచ్చు.
Published by:Ashok Kumar Bonepalli
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.