Home /News /andhra-pradesh /

ఐదేళ్లలోపు చిన్నారులకు స్పెషల్ దర్శనం... టీటీడీ మరో కీలక నిర్ణయం

ఐదేళ్లలోపు చిన్నారులకు స్పెషల్ దర్శనం... టీటీడీ మరో కీలక నిర్ణయం

గ్రామ సచివాలయాల్లో కూడా ఆన్‌లైన్‌లో టికెట్లు కొనుగోలు చేసుకోవచ్చని ఈవో అనిల్‌కుమార్‌ సింఘాల్‌ సూచించారు. క్యూలైన్‌లో విధులు నిర్వహించే వారికి పీపీఈ కిట్లు ఇవ్వనున్నారు. బస్సులతో పాటు భక్తుల లగేజీని కూడా పూర్తిగా శానిటైజ్‌ చేస్తామని... ప్రతీ రెండు గంటలకు ఒకసారి లడ్డూ కౌంటర్లను మారుస్తామని తెలిపింది.

నేడు ప్రత్యేక దర్శనానికి భక్తులను అనుమతించింది. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకూ ఏ విధమైన క్యూలైన్లలో వేచి చూడకుండా ఐదేళ్లలోపున్న తమ పిల్లలతో తల్లిదండ్రులు స్వామిని దర్శించుకోవచ్చని అధికారులు తెలిపారు.

    తిరుమలకు నిత్యం భక్తులు వేలల్లో వెళ్తుంటారు. శ్రీవారి దర్శనం కోసం క్యూలైన్లో నిల్చొని పడిగాపులు కాస్తుంటారు. వృద్ధులు, పిల్లలతో వారికి తిరుమల కొండపై కాస్త ఇబ్బంది పడాల్సిందే. అయితే భక్తులు సౌకర్యం దృష్ట్యా టీటీడీ మరో కీలక నిర్ణయం తీసుకుంది. చంటిబిడ్డలున్న తల్లిదండ్రులకు శ్రీవారి ప్రత్యేక దర్శనం   కొన్ని ప్రత్యేక దినాల్లో టీటీడీ ఇప్పటికే కల్పిస్తుంది. అయితే ఇక నుంచి ఏడాది వయసుకు బదులుగా, ఐదేళ్లలోపు వయసున్న పిల్లల తల్లిదండ్రులకు స్పెషల్ దర్శనం లభించనుంది. ఇటీవల టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అధ్యక్షతన సమావేశమైన బోర్డు తీసుకున్న ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

    నేడు ప్రత్యేక దర్శనానికి భక్తులను అనుమతించింది. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకూ ఏ విధమైన క్యూలైన్లలో వేచి చూడకుండా ఐదేళ్లలోపున్న తమ పిల్లలతో  తల్లిదండ్రులు స్వామిని దర్శించుకోవచ్చని అధికారులు తెలిపారు. దీంతో ఈ ఉదయం తిరుమలలో రద్దీ అధికంగా కొనసాగుతోంది. స్వామి దర్శనానికి వేచి చూస్తున్న భక్తులతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని 18 కంపార్టుమెంట్లు నిండివున్నాయి.
    First published:

    Tags: Andhra Pradesh, Tirumala news, Tirumala Temple, Tirumala tirupati devasthanam, Ttd

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు