Home /News /andhra-pradesh /

TROLLS ON UPASANA KONIDELA BECAUSE OF HER SOCIAL MEDIA POST SOME HINDUS WARNING HER WHAT HAPPENED NGS

Upasana Konidela: వివాదంలో ఉపాసన కొణిదెల.. ఆమె పోస్టు పై నెటిజన్లు ఆగ్రహం.. ఏం జరిగిందంటే?

వివాదంలో ఉపాసనా కొణిదెల

వివాదంలో ఉపాసనా కొణిదెల

Upasana Konidela: మెగాస్టార్ చిరంజీవి కోడలు.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సతీమణి ఉపాసన.. ఓ వివాదంలో చిక్కుకున్నారు. ఆమె సోషల్ మీడియా వేదికగా ట్రోల్స్ పెరిగాయి.. ఇదేం పని అని హిందువులు మండిపడుతున్నారు. ఇంతకీ ఆ పోస్టు ఎందుకు అంత వివాదాస్పదమైంది అంటే..?

ఇంకా చదవండి ...
    Trolls on Upasana Konedela: మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) కోడలు, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) సతీమణి ఉపాసన (Upasana) నిత్యం సోషల్ మీడియా (Social Media) లో చాలా యాక్టివ్ గా ఉంటారు. ఆమె పలు అంశాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తుంటారు.. ఆరోగ్యపరమైన జాగ్రత్తలతో పాటు, సామాజిక అంశాలపైనా ప్రజలను చైతన్యం చేస్తుంటారు. అలాగే సామాజిక సేవలో తరచూ పాల్గొనే ఆమె.. ఆ విషయాలను అభిమానులతో సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకుంటూ ఉంటారు.  సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉండే ఆమె.. తాజాగా ఓ వివాదంలో ఇరుకున్నారు. అది కూడా హిందువులు (Hindus) కొందరు ఆమెపై విరుచుకుపడుతూ కామెంట్లు చేస్తున్నారు. తమ మనోభావాలు దెబ్బతీశారంటూ ఉపాసన పై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియా వేదిక ద్వారా ఇంతకాలం తనకంటూ మంచి పేరు తెచ్చుకున్న ఉపాసనాపై నెటిజన్లు అంతగా ఆగ్రహం వ్యక్తం చేయడానికి గల కారణం ఏంటి.

    జనవరి 26 భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలుపుతూ ఉపాసన చేసిన పోస్టే ఈ దుమారానికి కారణం అవుతోంది.. ఇంతకీ ఉపాసనా చేసిన పోస్ట్ ఏంటంటే..? ఓ పెద్ద గుడి గోపురంపై దేవుడి విగ్రహాల మధ్యలో కొందరు సామాన్య ప్రజలు నిలుచున్నట్లుగా ఫోటో ఎడిట్ చేశారు. గుడిగోపురం పై సూక్ష్మ రూపంలో కొందరు ప్రజలు నిలుచుని ఉన్న ఆ ఫొటోలో “తానూ, తన భర్త రామ్ చరణ్ కూడా ఉన్నామని, ఎక్కడ ఉన్నామో కొనుక్కోండి” అంటూ ఉపాసన తన ఫాలోయర్స్ ని కోరారు. 

    అక్కడితోనే ఆగని ఆమె.. ఆ ఫోటో తనకు ఎంతగానో నచ్చిందని.. అలా ఎడిట్ చేసిన ఆర్టిస్ట్ ఎవరో తనకు నేరుగా మెసేజ్ చేస్తే అభినందించాలని ఉందంటూ ఉపాసనా రాసుకొచ్చారు. ఆమె పోస్ట్ చేసిన కొన్ని క్షణాల్లోనే వైరల్ అయ్యింది.. ఇంత వరకు ఆమె పోస్టులకు పాజిటివ్ కామెంట్స్ చేసేవారంతా ఇప్పుడు నెగిటివ్ కామెంట్స్ తో విరుచుకుపడుతున్నారు.

    మీరు ఎంత గొప్పవారైన కావొచ్చు కానీ ఇలా దేవుడి గోపురాన్ని అడ్డు పెట్టుకుని ప్రచారం చేసుకోవడం మంచి పద్ధతి కాదంటూ వారు హితవు పలుకుతున్నారు. హిందువుల మనోభావాలు దెబ్బతీసారంటూ విమర్శలు చేస్తున్నారు. “ఫోటోని అలా తీర్చి దిద్దిన ఆర్టిస్ట్ ను మెచ్చుకోవడం కంటే.. అసలు వేల సంవత్సరాల క్రితం ఆ గోపురాన్ని నిర్మించిన కళాకారులను స్మరించుకోండి అంటూ” చురకలు అంటిస్తున్నారు. గణతంత్ర దినోత్సవం నాడు మీరు ఇచ్చిన సందేశం ఏంటి.. ఆఫొటోని షేర్ చేసి భారతీయులకు ఈ అవమానం ఎందుకు” అంటూ మరొకరు కామెంట్ చేశారు. వెంటనే పోస్ట్ ను డిలీట్ చేయాలంటూ నెటిజన్లు, మెగా అభిమానులు సైతం డిమాండ్ చేస్తున్నారు. ఆ పోస్ట్ ను ఎడిట్ చేసిన ఆర్టిస్ట్ తెలిస్తే.. చెప్పండి..ఇద్దరికి హిందువులు సరైన బహుమానం ఇస్తారు అంటూ కొందరు ఘాటుగా విమర్శిస్తున్నారు.

    (Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
    Published by:Nagabushan Paina
    First published:

    Tags: Andhra Pradesh, AP News, Social Media, Upasana konidela

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు