TROLLING ON VIJAYAWADA MAYOR RAYANA BHAGYA LAXMI FOR RRR MOVIE TICKETS ON SOCIAL MEDIA FULL DETAILS HERE PRN GNT
RRR Tickets: ఆర్ఆర్ఆర్ టికెట్స్ కావాలా..? ఐతే ఈ కోడ్ ఎంటర్ చేయండి.. వైసీపీ నేతపై ట్రోలింగ్..
Photo: Twitter
తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశం మొత్తం ఇప్పుడు ఆర్ఆర్ఆర్ సినిమా (RRR Movie)పైనే చర్చ జరుగుతోంది. సినిమా టికెట్ల కోసం ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు. భారీ ధరలకు బ్లాక్ లో అమ్ముతున్నారన్న ఆరోపణలు కూడా వస్తున్నాయి.
తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశం మొత్తం ఇప్పుడు ఆర్ఆర్ఆర్ సినిమా (RRR Movie)పైనే చర్చ జరుగుతోంది. సినిమా టికెట్ల కోసం ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు. భారీ ధరలకు బ్లాక్ లో అమ్ముతున్నారన్న ఆరోపణలు కూడా వస్తున్నాయి. ముఖ్యంగా ఏపీలో ఆర్ఆర్ఆర్ టికెట్ల కోసం సినీ అభిమానులు థియేటర్ల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఆన్ లైన్లో కూడా దొరకని పరిస్థితి. ఈ నేపథ్యంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారుల ద్వారా కూడా టికెట్ల కోసం ట్రై చేస్తున్నవారున్నారు. ఇదే సమయంలో ఓ వైసీపీ నేతపై మాత్రం సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్ నడుస్తోంది. ఆర్ఆర్ఆర్ సినిమా టికెట్లు కావాలా.. అయితే విజయవాడ మేయర్ ను సంప్రదించండి అంటూ నెటిజన్లు సోషల్ మీడియా లో ట్రోల్స్ చేస్తున్నారు. అంతే కాకుండా విజయవాడ (Vijayawada) మేయర్ అనే ప్రోమో కోడ్ ను ఉపయోగించి టికెట్ ధరలో తగ్గింపు పొందండి అని ట్రోల్స్ జరుగుతున్నాయి.
అసలు దీనింతటికి రాధేశ్యాం సినిమాకు రిలీజ్ టైమ్ లో విజయవాడలోని సినిమా థియేటర్ల యజమానులకు మేయర్ రాయన భాగ్యలక్ష్మి లేఖ రాసిన సంగతి తెలిసిందే. ప్రతి సినిమా రిలీజ్ కు షోకి వంద టికెట్ల చొప్పున పంపాలంటూ ఆమె లేఖ రాశారు. ఆ లేఖని ఆధారంగా చేసుకొని ట్విట్టర్, ఫేస్ బుక్ లో ట్రోలింగ్ చేస్తున్నారు.
కొందరైతే విజయవాడ మేయర్ ప్రోమో కోడ్ ఎంటర్ చేస్తే ఎర్రర్ చూపిస్తోందని.. యాక్సెప్ట్ చేయడం లేదంటూ సెటైర్లు వేస్తున్నారు. అంతేకాదు ఈ సినిమాకు ఎన్ని టికెట్లు వచ్చాయో చెప్పాలని ట్వీట్లు చేస్తున్నారు. కొంతమంది ఒక్కో టికెట్ ఎంతకు ఇస్తారో చెప్పాలని కోరుతున్నారు. ప్రస్తుతం ఈ ట్వీట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఆర్ఆర్ఆర్ టికెట్ల కోసం మంత్రులు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులకు కూడా ఫోన్లు వెళ్తున్నాయట. ఈ టికెట్ల కోసం జూ.ఎన్టీఆర్ (NTR), రాంచరణ్ (Ram Charan) అభిమానులే కాక సినీ ప్రియులు సైతం టికెట్లకోసం ఎమ్మెల్యే లు, రాజకీయ నాయకులపై ఒత్తిడి తెస్తున్నారు. ఇక అధికారులైతే తలలు పట్టుకునే పరిస్థితి. పోలీసులు, అధికారులు కూడా థియేటర్ యజమానులకు సిఫార్సులు పంపిస్తుండటంతో ఉన్న టికెట్ల కంటే.. రికమండేషన్లకే ఎక్కువవుతున్నాయంటున్నారు. ఆన్ లైన్లో కూడా రిలీజ్ రోజుకి టికెట్లు దొరకని పరిస్థితి. ఇప్పటికే ఫస్ట్ డేకి సంబంధించిన టికెట్లన్నీ అమ్ముడైపోయాయి.
మొదటి రోజే సినిమాను చూడాలని టికెట్ల కోసం ఎమ్మెల్యేలు, నేతలకు నియోజకవర్గాల నుంచి ఫోన్లు ఎక్కువయ్యాయి. తమ నియోజకవర్గ నేతల నుంచి ఫోన్లు వస్తే టికెట్లు అడుగుతారేమోనని లిఫ్ట్ చేయని పరిస్థితి ఉంది. సాధారణ షోలకు సంగతి పక్కన బెడితే.. ప్రీమియర్లు, బెనిఫిట్ షోల పేరుతో టికెట్లను భారీ ధరకు విక్రయిస్తున్నారు. అర్ధరాత్రి నుంచే షో లు ఉండొచ్చన్న ప్రచారం కూడా జరుగుతోంది. ఇప్పటికే ఏపీ ప్రభుత్వం అదనపు షోలతో పాటు టికెట్ ధరపై రూ.75 పెంచుకునేందుకు అనుమతులిచ్చింది. దీంతో ఆర్ఆర్ఆర్ టికెట్ ధరలు ఆకాశాన్నంటుతున్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.