Home /News /andhra-pradesh /

TROLL IN SOCIAL MEDIA ON AP IAS OFFICERS CMO SPECIAL OFFICER PRAVEEN PRAKASH SITTING ON LEGS BEFORE CM JAGNA NGS

AP IAS: నాడు తెలంగాణలో.. నేడు ఏపీలో.. సీఎంల మోకాళ్ల‌ దగ్గర ఐఏఎస్ లు.. ఇదేం తీరంటూ విమర్శలు

ఏపీలో  అధికారుల తీరుపై విమర్శలు

ఏపీలో అధికారుల తీరుపై విమర్శలు

AP IAS: తెలుగు రాష్టాల్లో ఉన్నతాధికారుల తీరు తీవ్ర విమర్శలకు దారిస్తోంది. గతంలో తెలంగాణలో సీఎం కేసీఆర్ కాళ్ల దగ్గర ఐఏఎస్ కూర్చుంటే..? తాజాగా ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి దగ్గర మోకాళ్లపై కూర్చున్నారు ఉన్నతాధికారి... ప్రస్తుతం ఆ ఫోటో హాట్ టాపిక్ గా మారింది.

ఇంకా చదవండి ...
    AP IAS:  ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో అధికారుల తీరు తీవ్ర విమర్శల పాలవుతోంది. ఇప్పటికే ఐఏఎస్ (IAS), ఐపీఎస్ (IPS) లపై గవర్నర్ కు.. కోర్టుకు పలు ఫిర్యాదులు అందాయి.. విపక్షాలు సైతం పదే పదే ఆరోపణలు చేస్తున్నాయి. అయినా అధికారుల తీరు మారడం లేదు.. నిత్యం ఏదో ఒకరంగా వార్తల్లో నిలుస్తూనే ఉన్నారు. తాజాగా ఆంధ్రప్రదేశ్ లో జరిగిన రిపబ్లిక్ డే వేడుకల (Republic day celebrations) వేళ ఒక ఆసక్తి కర పరిణామం చోటు చేసుకుంది. విజయవాడ (Vijayawada) లో రిపబ్లిక్ డే వేడుకలు జరుగుతున్న సమయంలో ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ (AP Governor Biswa Bushan) జెండా ఆవిష్కరించారు. ఆ ఉత్సవాలకు సీఎం జగన్ మోహన్ రెడ్డి (CM Jagan Mohan Reddy) హాజరయ్యారు. ప్రభుత్వంలోని పలువురు ముఖ్యులు.. రాజకీయ-అధికార ప్రముఖులు రిపబ్లిక్ డే వేడుకలకు హాజరయ్యారు. సీఎం జగన్ అక్కడ కూర్చున్న సమయంలో.. ఆయన కార్యాలయ అధికారులు రావటం... అందించాల్సిన సమచారం ఇవ్వటం జరుగుతూనే ఉంది. అదే సమయంలో సీనియర్ ఐఏఎస్ ప్రవీన్ ప్రకాష్ (Praveen Prakash) వ్యవహారం వివాదాస్పదంగా మారింది..

    సీఎం జగన్ కార్యాలయ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ ను పిలిచారు. ఏదో అంశం పైన ప్రశ్నించారు. దానికి ప్రవీణ్ ప్రకాష్ సమాధానం ఇచ్చే సమయంలో.. సీఎం కూర్చున్న సీటు పక్కనే మోకాలిపైన కూర్చుకున్నారు. అక్కడ కూర్చొనే కాసేపు సీఎం అడిగిన ప్రశ్నాలకు సమాచారం ఇచ్చారు. ఆ సమయంలో తీసిన ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఒక ఐఏఎస్ అధికారి సమీపంలోనే అంత మంది ప్రముఖులు ఉండగా.. ఇలా మోకాళ్ల పైన కూర్చొని సీఎంతో చర్చించటం పైన భిన్నవాదనలు వినిపిస్తున్నాయి. జగన్ కార్యాలయంలో ఇప్పుడు ప్రవీణ్ ప్రకాష్ కీలకంగా వ్యవహరిస్తున్నారు.

    ఇదీ చదవండి ఎన్టీఆర్ జిల్లాకు జై కొట్టిన పురందేశ్వరి.. నందమూరి కుటుంబం మాటేంటి..?

    దీనిపై నెటిజ‌న్లు సెటరిక‌ల్ గా కామెంట్లు చేస్తున్నారు. గతంలో తెలంగాణలోనూ ఇలాంటి ఘటన చోటు చేసుకుంది. గతంలో మాజీ కలెక్టర్ వెంకట్రామిరెడ్డి సీఎం కేసీఆర్ కాళ్లపై పడగా.. అప్పుడు ఆ ఘటన సంచలనంగా మారింది. తాజాగా ఏపీలో జరిగిన ఘటనపైనా పలు రకాల స్పందనలు వినిపిస్తున్నాయి.

    ఇదీ చదవండి: కాణిపాకంలో మరో దారుణం.. స్వామివారి పాత రథ చక్రాలకు నిప్పు పెట్టిన దుండగులు..

    ఇటీవల నూతన సంవత్సర ఆరంభం వేళ ఓ ఐఏఎస్ అధికారి.. మంత్రి కాళ్లు మొక్కి ఆశీస్సులు పొందడం వివాదానికి తీసింది. విజయనగరం జిల్లా జాయింట్ కలెక్టర్ సీహెచ్ కిశోర్ కుమార్.. జనవరి 1న న్యూ ఇయర్ విషెస్ చెప్పడానికి మంత్రి బొత్స సత్యనారాయణను కలిశారు. మంత్రికి బొకే ఇచ్చిన ఆయన.. వంగి కాళ్లకు నమస్కరించారు. ఐఏఎస్ హోదాలో ఉండి ఇలా ప్రజాప్రతినిధి కాళ్లు మొక్కడం ఏంటని ప్రజా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పుడు ప్రవీణ్ ప్రకాశ్ వ్యవహారం హాట్ టాపిక్ అవుతోంది..

    (Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
    Published by:Nagabushan Paina
    First published:

    Tags: Andhra Pradesh, Ap cm jagan, AP News

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు