Home /News /andhra-pradesh /

TRIBAL STUDENTS PROBLEMS IN VISAKHA AGENCY THERE IS SOLAR SYSTEM BUT NOT WORKING NGS VPS

Tribal Students Problems:  సోలార్ ఉన్నా చలినీళ్లతోనే విద్యార్థుల స్నానాలు.. ఎందుకంటే?..?

సోలార్ ఉన్నా చలికి వణుకుతున్న విద్యార్థులు

సోలార్ ఉన్నా చలికి వణుకుతున్న విద్యార్థులు

Tribal Students Problems: అసలే చలికాలం.. ఇక ఏజెన్సీ ప్రాంతంలో అయితే ఎముకలు కొరికే చలి ఉంది. అందులోనూ తెల్లవారు చలినీళ్లతో స్నానం చేయాలని గజగజ వణుకు తప్పదు.. కానీ గిరిజన విద్యార్థులకు ఆ పరిస్థితి తప్పడం లేదు.. సోలర్ ఉన్నా.. చలినీళ్లు ఎందుకు పోసుకుంటున్నారు..?

ఇంకా చదవండి ...
  Visakhapatnam Tribal Students Problems:  విశాఖపట్నం జిల్లా (Visakhapatnam District) లోని గిరిజన సంక్షేమ ఆశ్రమ ఉన్నత పాఠశాల్లో విద్యార్థులకు అవస్థలు తప్పడం లేదు. అక్కడ ఉన్న వేలాది మంది విద్యార్థులు నిత్యం చల్లటి నీటితోనే స్నానాలు చేయాల్సి వస్తోంది. వసతి గృహాల్లో గతంలో ఏర్పాటుచేసిన సోలార్‌ వాటర్‌ హీటర్‌ యూనిట్లు పనిచేయకపోవడమే ఇందుకు కారణమని తెలుస్తోంది. మరమ్మతు పనులు ప్రతిపాదనలకే పరిమితమయ్యాయి. సౌర విద్యుత్తు యూనిట్లు రెండు మూడు సంవత్సరాల క్రితం మూలనపడగా.. వినియోగంలోకి తీసుకురావడానికి అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టడం లేదని ఎస్‌ఎఫ్‌ఐ అనుబంధ గిరిజన విద్యార్థి (Tribal Students) సంఘం నాయకులు ఆరోపిస్తున్నారు. ఏజెన్సీలోని గిరిజన సంక్షేమ శాఖ ఆశ్రమ ఉన్నత పాఠశాలల్లో సోలార్‌ వాటర్‌ హీటర్‌ యూనిట్ల పనిచేయకపోవడం, విద్యార్థులు గజగజ వణికించే చలిలో చన్నీటితో స్నానాలు చేయాల్సి వస్తోంది. 

  అసలే చలికాలం.  అందులోనూ ఏజెన్సీ ప్రాంతం... నవంబరు నుంచి జనవరి వరకు ఎముకలు కొరికేంత చలి ఉంటుంది. కొన్నిచోట్ల కనిష్ఠ ఉష్ణోగ్రతలు ‘జీరో’ డిగ్రీలకు పడిపోతుంటాయి. పగటిపూట సైతం ఉన్ని దుస్తులు ధరించాల్సిన పరిస్థితి. రాత్రిపూట ఇళ్లల్లో కుంపట్లు పెట్టుకుని చలిబారి నుంచి ఉపశమనం పొందాలి.

  ఇదీ చదవండి : చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్ పదవి కోసం ఫైట్.. వాట్సప్ లో వైరల్ పోస్టులు

  అత్యంత శీతల వాతావరణంలో వేడి నీళ్లు కాకుండా మామూలు నీటితో స్నానం చేస్తే ఎలా వుంటుందో ఊహించడానికే భయం వేస్తోంది. ఏజెన్సీలోని 11 మండలాల్లో 120 గిరిజన సంక్షేమ శాఖ ఆశ్రమ పాఠశాలలు ఉన్నాయి. మూడో తరగతి నుంచి పదో తరగతి వరకు బోధన జరిగే ఈ పాఠశాలల్లో దాదాపు 37 వేల మంది గిరిజన విద్యార్థులు ఉన్నారు. భౌగోళిక పరిస్థితుల కారణంగా శీతాకాలంలో ఇక్కడి వాతావరణం అత్యంత శీతలంగా ఉంటుంది.

  ఇదీ చదవండి : తిరుమల మరో ఘనత.. వరల్డ్ బుక్ అఫ్ రికార్డ్స్ లో చోటు

  ఆశ్రమ పాఠశాలల్లో విద్యార్థులు చలికాలంలో చల్లటి నీటితో స్నానాలు చేయాల్సి వచ్చేది. దీంతో చాలామంది రెండు, మూడు రోజులకోసారి స్నానాలు చేస్తూ, చర్మ సంబంధ వ్యాధుల బారినపడేవారు. ఈ సమస్య ఉన్నతాధికారుల దృష్టికి రావడంతో సోలార్‌ వాటర్‌ హీటర్‌ యూనిట్లను మంజూరుచేశారు. చలి అధికంగా వుండే ప్రాంతాల్లోని సుమారు 100 పాఠశాలల్లో వీటిని ఏర్పాటు చేయించారు. ఒక్కో పాఠశాలకు  4.5 లక్షల చొప్పున సుమారు  4.5 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు.

  ఇదీ చదవండి : లక్క బొమ్మల గురించి మరిచిపోవాల్సిందేనా..? సమస్య ఏంటో తెలుసా..?

  సోలార్‌ వాటర్‌ హీటర్‌ పరికరాల సరఫరా, బిగింపు పనులను నెడ్‌క్యాప్‌కు అప్పగించారు. దీంతో విద్యార్థులు చలికాలంలో సైతం రోజూ స్నానాలు ఆచరించేవారు. సోలార్‌ యూనిట్లకు ఏటా వేసవిలో నిర్వహణ పనులు చేయాలి. కానీ మూడేళ్ల నుంచి నిర్వహణ పనులు చేయకపోవడంతో ఒక్కటొక్కటిగా మరమ్మతులకు గురవుతూ మూలన పడుతున్నాయి.

  ఇదీ చదవండి : ఎన్నాళ్లీ డోలీ కష్టాలు.. రోడ్లు ఎందుకు వేయరు అంటూ ఆవేదన

  ఏజెన్సీలో సుమారు 100 ఆశ్రమ పాఠశాలల్లో సోలార్‌ వాటర్‌ హీటర్లు వుండగా, క్షేత్రస్థాయిలో సేకరించిన వివరాల ప్రకారం ప్రస్తుతం వీటిలో 28 మాత్రమే పనిచేస్తున్నాయి. మిగిలిన 72 పాఠశాలల్లో మూలనపడ్డాయి. కానీ గిరిజన సంక్షేమ శాఖ అధికారులు ఇందుకు పూర్తి భిన్నంగా చెబుతున్నారు. 13 పాఠశాలల్లో మాత్రమే సోలార్‌ వాటర్‌ హీటర్లు వినియోగంలో లేవని అంటున్నారు.

  ఇదీ చదవండి : పుష్పక విమానం డైరెక్టర్‌ దామోదర గురించి ఆ విషయం తెలిస్తే షాక్ అవుతారు.. ఇది ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్

  2019లో ఎన్నికల హడావిడి, ప్రభుత్వం మారడంతో వీటి గురించి పట్టించుకోలేదని, గత ఏడాది, ఈ సంవత్సరం కొవిడ్‌ కారణంగా మరమ్మతులు చేయలేదని అధికారులు చెబుతున్నారు. గత మూడేళ్లుగా నిర్వహణ పనులు చేపట్టకపోవడంతో వాటర్‌ హీటర్లు మరమ్మతులకు గురయ్యాయి. దీంతో శీతాకాలంలో చన్నీళ్లతో స్నానాలు చేయడానికి గిరిజన విద్యార్థులు..ముఖ్యంగా 3, 4, 5 తరగతులకు చెందిన చిన్నపిల్లలు ఇబ్బంది పడుతున్నారు.
  Published by:Nagesh Paina
  First published:

  Tags: Andhra Pradesh, AP News, Visakhapatnam, Vizag

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు