విశాఖ ఏజెన్సీలో మావోయిస్టులకు గిరిజనుల కౌంటర్

స్థానిక ప్రజలే ఎప్పుడు లేని విధం గా ఈ స్థూపాల్ని అమర్చడం - మావోల అకృత్యాలపై గిరిజనుల ఆక్రోశానికి అద్దం పట్టాయి.

news18-telugu
Updated: July 29, 2019, 7:57 AM IST
విశాఖ ఏజెన్సీలో మావోయిస్టులకు గిరిజనుల కౌంటర్
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
విశాఖ మన్యంలో మావోయిస్టుల వారోత్సవాల నేపథ్యంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో నల్లమలలో గ్రే హౌండ్స్ బలగాలతో జల్లెడ పడుతూనే.. మరోవైపు కొత్త వ్యూహానికి దారితీసారు. ప్రతి సారి మావోయిస్టుల వారోత్సవాలో -మరణించిన కామ్రేడ్ల్ పేరు మీద - ఎర్ర ఎర్రా ని స్థూపాలు ఏర్పాటు చేస్తాయి. ఇప్పుడు వీటికి కౌంటర్ గా గిరిజనులు తెల్లని శాంతి స్థూపాలు ఏర్పాటు చేశారు.


ఈ స్థూపాల్లో - మావోల చేతిలో చంపబడిన అమాయక గిరిజనుల పేర్లు రాశారు. మావోయిస్టులని ఎదిరించి వాళ్ళ చేతిలో అమరులైన గిరిజనులకు జోహార్లు అని పేర్కొన్నారు. ఎటువంటి రవాణా సదుపాయాలు లేని మారుమూల ప్రాంతమైన కోరుకొండలో.. గిరిజనులు అధికంగా వచ్చే సంతలో ఈ శాంతి స్థూపాల్ని ఏర్పాటు చేయడం ఇప్పుడు ఏజెన్సీలో చర్చనీయాంశంగా మారింది.

స్వయాన స్థానిక ప్రజలే ఎప్పుడు లేని విధం గా ఈ స్థూపాల్ని అమర్చడం - మావోల అకృత్యాలపై గిరిజనుల ఆక్రోశానికి అద్దం పట్టాయి. మావోల పై గిరిజనులకున్న వ్యతిరేకతకి, తిరుగుబాటుకి నిదర్శనంగా అనిపిస్తున్నాయి. మరి ఈ ఘటన తరువాత అయిన , మావోయిస్టుల ధోరణిలో మార్పు వస్తుందా, మావోల నరమేథం ఆగుతుందా? గిరిజనులు ప్రశాంతంగా జీవించ గలుగుతారా..? అంటే వేచి చూడాల్సిందే.
Published by: Sulthana Begum Shaik
First published: July 29, 2019, 7:57 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading