Home /News /andhra-pradesh /

TRANSGENDER COMMIT SUICIDE OVER A YOUNG MAN REFUSES HER LOVE PROPOSAL IN KADAPA HSN

ఓ యువకుడికి ట్రాన్స్‌జెండర్‌ లవ్ ప్రపోజల్.. అతడి రెస్పాన్స్ తో చివరకు ఏం జరిగిందంటే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఓ యువకుడిని శ్రీలేఖ అనే ట్రాన్స్‌జెండర్‌ ఇష్టపడింది. కొంతకాలంగా అతడిని ప్రేమిస్తోంది. ప్రేమ విషయం అతడితో చెప్పేందుకు ధైర్యం చాలక చాలా కాలం పాటు వేచిచూసింది. ఎట్టకేలకు కొద్ది రోజుల క్రితం తన ప్రేమ గురించి ఆ యువకుడికి శ్రీలేఖ చెప్పింది. అతడి రెస్పాన్స్ విని..

ఇంకా చదవండి ...
    యువత క్షణికావేశంలో విపరీత నిర్ణయాలు తీసుకుంటోంది. చిన్న చిన్న విషయాలకు ప్రాణాలను తీసుకుంటోంది. ఇంట్లో వాళ్లు మందలించారని ఒకరు, టీవీ రిమోట్ ఇవ్వలేదని మరొకరు, భార్య పుట్టింటికి వెళ్లిందని మరొకరు ఉసురు తీసుకుంటున్న ఘటనలు ఇటీవల చాలా జరుగుతూ ఉన్నాయి. ప్రేమ విఫలమయి కూడా ఆత్మహత్యకు పాల్పడుతున్న వారి సంఖ్య ఇటీవలి కాలంలో పెరుగతూ వస్తోంది. ప్రేమ విఫలమై కొందరు ప్రేమించిన వారిపై పగ తీర్చుకునేందుకు కూడా వెనకాడటం లేదు. మరికొందరు బాధతో ప్రాణాలు తీసుకుంటున్నారు. అచ్చం అలాంటి ఘటనే ఒకటి కడప జిల్లాలో జరిగింది. ఓ ట్రాన్స్ జెండర్ ఓ యువకుడిని ప్రేమించింది. అతడేమో ఆమె ప్రేమ ప్లస్ పెళ్లి ప్రపోజల్ కు నో చెప్పాడు. దీంతో ఆమె ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

    కడప నగరంలోని ఏఎస్ఆర్ నగర్ లో శ్రీలేఖ అనే ట్రాన్స్‌జెండర్‌ నివాసం ఉంటోంది. ఆమెను ప్రసాద్ అనే పేరుతో కూడా గతంలో పిలిచేవారు. ఓ షాపులో పనిచేస్తూ జీవనోపాధి పొందుతోంది. ఈ క్రమంలోనే కడప నగరంలోనే ఉండే ఓ యువకుడిని ఆమె ఇష్టపడింది. కొంతకాలంగా అతడిని ప్రేమిస్తోంది. ప్రేమ విషయం అతడితో చెప్పేందుకు ధైర్యం చాలక చాలా కాలం పాటు వేచిచూసింది. ఎట్టకేలకు కొద్ది రోజుల క్రితం తన ప్రేమ గురించి ఆ యువకుడికి శ్రీలేఖ చెప్పింది. అయితే అతడు ఆమె ప్రేమను తిరస్కరించాడు.

    ’నేను నిన్ను ప్రేమిస్తున్నాను. పెళ్లి కూడా చేసుకోవాలనుకుంటున్నాను. మీకిష్టం అయితే జీవితాంతం మీతో కలిసి ఉంటా‘ అంటూ ఆమె చెప్పిన ప్రేమ ప్రపోజల్ ను ఆ యువకుడు తిరస్కరించాడు. దీంతో ఆమె మనస్తాపం చెందింది. ప్రాణంగా ప్రేమించిన వ్యక్తి తిరస్కరించడంతో తీవ్రంగా దు:ఖించింది. గురువారం రాత్రి తన గదిలోనే పురుగుల మందు తాగింది. అపస్మారక స్థితిలో ఉన్న ఆమెను స్థానికులు ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూనే శుక్రవారం ఆమె మరణించింది. ప్రేమ వ్యవహారం వల్లే శ్రీలేఖ మరణించిందని తెలిసి కుటుంబ సభ్యులు కలత చెందారు. ఈ ఘటనపై స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుుని దర్యాప్తు చేస్తున్నారు.
    Published by:Hasaan Kandula
    First published:

    Tags: Crime news, Crime story, Love cheating, Lovers suicide

    తదుపరి వార్తలు