Power Crisis: మళ్లీ తప్పని కరెంటు కోతలు..! ఏపీలో విద్యుత్ సంక్షోభానికి కారణం ఇదే..

ప్రతీకాత్మక చిత్రం

Power Cuts in Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లో మళ్లీ కరెంటు కోతలు తప్పేలా లేవు. చాలా ఏళ్ల నుంచి అధికారికంగా విద్యుత్‌ కోతలు (Power Cuts) లేవని చెప్పాలి.. కొన్ని సాంకేతిక కారణాలు చెప్పి అప్పుడప్పుడు విద్యుత్ సరఫరా నిలిచిపోతున్నా.. నిర్ణీత సమయంలో ప్రతిరోజూ విద్యుత్ సరఫరా నిలిపివేయడం లేదు. కానీ తాజా సంక్షోభం నేపథ్యంలో మళ్లీ విద్యుత్ కోతలు షురూ అవుతున్నాయి.

 • Share this:
  Electricity Crisis in Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లో మళ్లీ అధికారికంగా విద్యుత్‌ కోతల (Power Cuts) భయం పెరుగుతోంది. చాలా ఏళ్ల నుంచి సాంకేతిక కారణాల వల్ల మూడు నుంచి నాలుగు గంటల అంతరాయం తప్పితే...ప్రతిరోజూ నిర్ణీత సమయంలో కోతలు విధించిన దాఖలాలు లేవు. ఇప్పుడు మళ్లీ పాత రోజులు గుర్తుకువచ్చేలా విద్యుత్‌ కోతలు విధించడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. అయితే ఈ విద్యుత్ సంక్షోభంపై (Electricity Crisis)అనేక అనుమానాలు పెరుగుతున్న నేపథ్యంలో.. తాజాగా ఏపీ ట్రాన్స్ కో (AP Transco)అధికారులు క్లారిటి ఇస్తున్నారు. రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభానికి కారణాలు ఇవే అంటూ వివరిస్తున్నారు. రాష్ట్రంలో బొగ్గు కొరత (Coal Crises)ఉన్నప్పటికీ విద్యుత్‌ డిమాండ్‌ (Electricity Demond) తట్టుకునేలా డిస్కమ్‌లు పనిచేస్తున్నాయని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (Andhra Pradesh Government)ప్రకటించింది. ఏపీ జెన్‌కో వ్యవస్థాపిత సామర్థ్యం 5,010 మెగావాట్లు అయినప్పటికీ బొగ్గు కొరత కారణంగా 2,500 మెగావాట్లు మాత్రమే ఉత్పత్తి అవుతోందని వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్ లోని థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాలకు రోజుకు 70 వేల టన్నుల బొగ్గు అవసరం అవుతుందని, అయితే ప్రస్తుతం కొరత కారణంగా సెప్టెంబరులో 24 వేల టన్నులు మాత్రమే సరఫరా అయ్యిందని జెన్కో వెల్లడించింది. దేశంలో నెలకొన్న బొగ్గు కొరత కారణంగా ఏపీలో విద్యుత్‌ సంక్షోభం తలెత్తిందని ట్రాన్స్‌కో పేర్కొంది.

  నిరంతరాయ సరఫరా కోసం పీక్ డిమాండ్ ఉన్న సమయంలో ఒక్కో యూనిట్ కు 15 నుంచి 20 రూపాయలు వెచ్చించి కొనుగోలు చేయాల్సి వచ్చిందని తెలిపింది. బొగ్గు కొరత కారణంగా తక్కువ స్థాయిలో విద్యుత్ అంతరాయాలతో సరఫరా చేయగలుగుతున్నామని స్పష్టం చేసింది. ఏపీలో స్థాపిత విద్యుత్ ఉత్పత్తి సామర్ధ్యం 18,533 మెగావాట్లు అయినప్పటికీ సరిపడినంత విద్యుత్ ఉత్పత్తి కావటం లేదని పేర్కొంది. ఇందులో 8,075 మెగావాట్ల సౌర, పవన విద్యుత్ ప్లాంట్లు ఉన్నా బేస్ లోడుకు సరిపడినంత విద్యుత్ ఉత్పత్తి కావటం లేదని స్పష్టం చేసింది.

  ఇదీ చదవండి: అమ్మో ఘాటెక్కిన ఉల్లి.. కట్ చేయకుండానే కన్నీరు.. వారం రోజుల్లో ఎంత పెరిగిందంటే..?

  ఏపీలో 185 మిలియన్ యూనిట్ల విద్యుత్                                                                            రాష్ట్రంలో 908 గ్యాస్ ఆధారిత ప్లాంట్ల నుంచి వస్తున్న విద్యుత్ కేవలం 100 మెగావాట్లు మాత్రమేనని ప్రకటించింది. ప్రస్తుతం ఏపీలో 185 మిలియన్ యూనిట్ల విద్యుత్ డిమాండ్ ఉందని.. పీక్ డిమాండ్ మేరకు 9,064 మెగావాట్ల విద్యుత్ అవసరం అవుతోందని వెల్లడించింది. బొగ్గు కొరత కారణంగా వీటీపీఎస్ తో పాటు రాయలసీమ థర్మల్ పవర్ స్టేషన్ లోని యూనిట్లను నిలిపివేయాల్సి వచ్చిందని ప్రభుత్వం తెలిపింది.

  ఇదీ చదవండి: తేనె, ఆయుర్వేద ఔషధాల ముసుగులో గంజాయి.. సులువుగా రవాణా.. విదేశాలకూ తరలింపు

  విద్యుత్ సంక్షోభంతో కొత్త కష్టాలు                                                                                         ముఖ్యంగా కృష్ణపట్నం థర్మల్ పవర్ ప్లాంట్ తో పాటు కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తున్న ఎన్టీపీసీ కూడా సామర్ధ్యం కంటే తక్కువ విద్యుత్‌నే ఉత్పత్తి చేస్తున్నాయని ట్రాన్స్ కో పేర్కొంది. ప్రస్తుతం ప్రభుత్వ అభ్యర్థనతో సరఫరా 40 వేల మెట్రిక్ టన్నులకు పెరిగిందని ప్రభుత్వం వెల్లడించింది. కారణం ఏదైనా ఏపీలో విద్యుత్ సంక్షోభం సామాన్య ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తోంది. ఇటు చూస్తే రాష్ట్రంలో నెలకొన్న వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో ఎండలు మండిపోతున్నాయి. విపరీతమైన ఉక్కపోత. దాంతో విద్యుత్‌ వినియోగం భారీగా పెరిగిపోయింది. అటు చూస్తే....కరోనా నుంచి కోలుకున్న పారిశ్రామిక, వ్యాపార రంగాలు ఇప్పుడిప్పుడే పుంజుకుంటున్నాయి. పూర్తిస్థాయిలో పనిచేస్తున్నాయి. ఇప్పుడు ఉరుముల్లేని పిడుగులా వాటికి కూడా విద్యుత్‌ కోతలు అమలు చేస్తే.. మళ్లీ సంక్షోభం తప్పదని ఆయా వర్గాలు వాపోతున్నాయి.
  Published by:Nagesh Paina
  First published: