Home /News /andhra-pradesh /

TRANSCO EMPLOYEE BOOKED FOR HARASSING WIDOW IN ANANTAPURAM CITY OF ANDHRA PRADESH FULL DETAILS HERE PRN

Anantapuram Woman: వితంతువుపై కన్నేసిన కీచకుడు.. అతడికే సపోర్ట్ చేసిన తల్లి.. చివరకు ఏమైందంటే..!

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Anantapuram: ఆమెకు పెళ్లైంది. దురదృష్టవశాత్తూ భర్తను కోల్పోయింది. ముగ్గురు ఆడపిల్లల భారాన్ని తనపై వేసుకొని వారిని పోషిస్తోంది. ఆమెపై ఎందరి కళ్లుపడినా తట్టుకుంటూ జీవనపోరాటాన్ని సాగిస్తోంది. ఐతే ఓ కీచకుడు మాత్రం తన కోరిక తీర్చాలని వెంటబడ్డాడు.

ఇంకా చదవండి ...
    ఆమెకు పెళ్లైంది. దురదృష్టవశాత్తూ భర్తను కోల్పోయింది. ముగ్గురు ఆడపిల్లల భారాన్ని తనపై వేసుకొని వారిని పోషిస్తోంది. ఆమెపై ఎందరి కళ్లుపడినా తట్టుకుంటూ జీవనపోరాటాన్ని సాగిస్తోంది. ఐతే ఓ కీచకుడు మాత్రం తన కోరిక తీర్చాలని వెంటబడ్డాడు. కానీ ఆమె ఒప్పుకోలేదు. ఆమె తల్లి కూడా అతగాడి కోరిక తీర్చాలంటూ కూతురిపై ఒత్తిడి తెచ్చింది. అయినా భరించిన ఆమె చివరకు ఆ కీచకుడికి బుద్ధిచెప్పింది. వివరాల్లోకి వెళ్తే.. ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని అనంతపురం (Anantapuram) లోని శారదానగర్ కు చెందిన ఓ మహిళ భర్త ఆరేళ్ల క్రితం మృతి చెందాడు. వారికి ముగ్గురు ఆడపిల్లలు. భర్త అర్ధాంతరంగా చనిపోవడంతో కుటుంబ భారం ఆమెపై పడింది. కుటుంబ పోషణ కోసం అనారోగ్యంతో బాధపడుతున్నవారి ఇళ్లలో పనులు చేస్తోంది. వచ్చిన అరకొర సంపాదనతోనే పిల్లల్ని పెంచుతోంది.

    ఇదిలా ఉంటే మహిళ తల్లి నడిమింక ప్రాంతంలో ఉంటోంది. ఆమెకు ట్రాన్స్ కో కార్యాలయంలో అటెండర్ గా పనిచేస్తున్న అద్బుల్ నబీసాబ్ తో పరిచయం ఉంది. ఆమె ద్వారా మహిళ గురించి అన్ని విషయాలు తెలుసుకున్న అతడు.. ఆమెపై కన్నేశాడు. తన కోరిక తీరిస్తే ఆమెతో పాటు పిల్లల బాగోగులు కూడా చూసుకుంటానని నమ్మించాడు. ఐతే కూతురిపై కన్నేసిన వాడి చెంప పగలగొట్టాల్సిన మహిళ తల్లి.. అతడికే వత్తాసు పలుకుతూ కూతురిపై ఒత్తిడి తెచ్చింది. ఐతే తల్లి ఎంత చెప్పినా మహిళ మాత్రం అందుకు ఒప్పుకోలేదు.

    ఇది చదవండి: భర్తను మద్యానికి బానిసను చేసి భార్యపై అత్యాచారం.. ఆ పై బ్లాక్ మెయిలింగ్.. చివర్లో ఊహించని ట్విస్ట్..


    ఐతే నెల రోజుల క్రితం మహిళ ఇంటికి వెళ్లిన అద్బుల్.. తనతో ఉండేందుకు ఒప్పుకోవాలని బలవంతపెట్టాడు.. అప్పుడు కూడా ఆమె ఘాటుగానే సమాధానం చెప్పి పంపించేసింది. అంతేకాదు కష్టపడి పనిచేసి పిల్లల్ని పోషించుకుంటానని.. నీచమైన పనులు మాత్రం చేసేది లేదని స్పష్టం చేసింది. మరోసారి వస్తే పోలీస్ కంప్లైంట్ ఇస్తానని హెచ్చరించింది. అయినా కూడా ఆ కీచకుడిలో మార్పురాలేదు సరికదా వేధింపులు ఎక్కువయ్యాయి.



    దీంతో బాధితురాలు టూటౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. వెంటనే స్పందించిన సీఐ రాఘవన్.. అద్బు నజీసాబ్ పై కేసు నమోదు చేయాలని ఎస్సైని ఆదేశించారు. విచారణ చెప్పిన పోలీసులు అద్బుల్ పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అంతేకాదు అతడికి సహకరించిన వితంతువు తల్లిపైనా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే గతంలో గుంటూరు జిల్లాలో ఇలాంటి ఘటనే జరిగింది. ఓ వితంతువుతో ఎఫైర్ పెట్టుకున్న ఇద్దరు యువకులు.. ఆమె వేరే వ్యక్తితో క్లోజ్ గా ఉంటుందని అనుమానించి దారుణంగా హత్య చేశారు. ఘటన అప్పట్లో సంచలనం సృష్టించింది.
    Published by:Purna Chandra
    First published:

    Tags: Anantapuram, Andhra Pradesh, Harassment on women

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు