ఏపీలో ట్రైనీ ఐపీఎస్ అధికారిపై కేంద్రం వేటు...

ట్రైనింగ్ లో ఉన్న ఐపీఎస్ మహేశ్వర్ రెడ్డిపై కేంద్ర హోంశాఖ సస్పెన్షన్ వేటేసింది.

news18-telugu
Updated: December 15, 2019, 7:18 AM IST
ఏపీలో ట్రైనీ ఐపీఎస్ అధికారిపై కేంద్రం వేటు...
ట్రైనీ ఐపీఎస్ అధికారి మహేశ్వర్ రెడ్డి, భావన (File)
  • Share this:
ట్రైనింగ్ లో ఉన్న ఐపీఎస్ మహేశ్వర్ రెడ్డిపై కేంద్ర హోంశాఖ సస్పెన్షన్ వేటేసింది. మహేశ్వర్ రెడ్డి తనను మోసం చేశాడంటూ యువతి భావన ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. దాంతో, తదుపరి ఆదేశాలు వచ్చేవరకు ట్రైనింగ్ నుంచి మహేశ్వర్ రెడ్డిని సస్పెండ్ చేస్తూ కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు ఇచ్చింది. ట్రైనీ ఐపీఎస్ అధికారి మహేశ్వర్ రెడ్డీ తానూ ప్రేమించి పెళ్లి చేసుకున్నామని, అయితే ఐపీఎస్‌కి ఎంపికైన తర్వాత తనను వదిలించుకునేందుకు బెదిరింపులకు దిగాడని బాధితురాలు భావన పోలీసులను ఆశ్రయించింది. విడాకులు ఇవ్వాలంటూ బెదిరించడమే కాకుండా అధిక కట్నం కోసం మరో పెళ్లికి సిద్ధమయ్యాడంటూ ఫిర్యాదు చేసింది. భావన ఫిర్యాదు మేరకు ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన పోలీసులు కేంద్ర హోంశాఖకు సమాచారమిచ్చారు. దాంతో, ఐపీఎస్‌ ట్రైనింగ్‌లో ఉన్న మహేశ్వర్ రెడ్డిని సస్పెండ్ చేస్తూ కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు ఇచ్చింది.

సస్పెన్షన్ నోటీస్


First published: December 14, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>