వందలాది ప్రాణాలు నిలిపిన యువకుల సమయస్ఫూర్తి

ప్రమాదం జరగకుండా రైలు ప్రయాణికులను కాపాడిన ఆ యువకులను ప్రయాణికులు, రైల్వే సిబ్బంది, గ్రామస్తులంతా అభినందించారు.

news18-telugu
Updated: October 29, 2018, 9:13 PM IST
వందలాది ప్రాణాలు నిలిపిన యువకుల సమయస్ఫూర్తి
చిత్తూరు జిల్లా వేదుల్ల చెరువు వద్ద తెగిన రైలు పట్టా, గమనించి రైలును ఆపిన యువకుడు
news18-telugu
Updated: October 29, 2018, 9:13 PM IST
నారాయణాద్రి ఎక్స్ ప్రెస్ కి తృటిలో పెనుప్రమాదం తప్పింది. చిత్తూరు జిల్లా వేదల్ల చెరువు గ్రామం ప్రక్కన రైల్వే ట్రాక్ పట్టా విరిగిపోయింది. వేదుల్ల చెరువు గ్రామానికి చెందిన మల్లికార్జున్, అదే గ్రామం ఎస్టీ కాలనీకి చెందిన మచ్చ అంకయ్య వ్యవసాయ పనులకు వెళుతూ ట్రాక్ పట్టా విరిగిన విషయాన్ని గమనించారు. దూరంనుంచి రైలు కూత వినపడింది. ఈ యువకుల్లో ఒకతను రెడ్ టీషర్ట్ వేసుకున్నాడు. ఆ రెడ్ టీషర్ట్‌ని వంటి మీద నుంచి తీసి ఇద్దరు యువకులు ఆ టీషర్ట్‌ని ఊపుతూ రైలుకి ఎదురుగా ట్రాక్ మీద పరిగెత్తారు. ఇది గమనించిన రైలు డ్రైవర్ పట్టా విరిగివున్న ప్రదేశానికి కొంతదూరంలో ట్రైన్‌ని ఆపేశాడు. జరిగిన సంఘటనను అదే గ్రామానికి చెందిన రైల్వే గాంగ్‌మెన్‌కి తెలియజేశారు. అప్పటికే డ్యూటీలో ఉన్న అతను జరిగిన విషయాన్ని తోటి సిబ్బందికి, అధికారులకు తెలియజేశాడు. రైలు సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని మరమ్మతులు చేశారు. అప్పటి వరకు ఆగి ఉన్న నారాయణాద్రి రైలును పంపేశారు. రైలు వెళ్లిన తరువాత పూర్తి స్థాయిలో మరమ్మతులు చేశారు. ప్రమాదం జరగకుండా రైలు ప్రయాణికులను కాపాడిన ఆ యువకులను ప్రయాణికులు, రైల్వే సిబ్బంది, గ్రామస్తులంతా అభినందించారు.


First published: October 29, 2018
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...