బోగిలను వదిలి వెళ్లిన విశాఖ ఎక్స్‌ప్రెస్

విశాఖ ఎక్స్‌ప్రెస్ విశాఖ నుండి విజయవాడ వైపు వెళ్ళుతుండగా ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది.ఈ రైలు భువనేశ్వర్ నుంచి సికింద్రాబాద్‌కు నిత్యం రాకపోకలు సాగిస్తోంది.

news18-telugu
Updated: August 20, 2019, 11:22 AM IST
బోగిలను వదిలి వెళ్లిన విశాఖ ఎక్స్‌ప్రెస్
నమూనా చిత్రం
news18-telugu
Updated: August 20, 2019, 11:22 AM IST
సోమవారం సాయంత్రం అతిపెద్ద ప్రమాదం తప్పింది.  విశాఖ ఎక్స్‌ప్రెస్ రైలు ఇంజిన్ బోగిలను వదిలి వెళ్లిపోయింది. తునికి సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. బోగీలను వదలిని ఇంజన్ సుమారు 5కి.మీ. వెళ్లిపోయింది. దీంతో రైలులో ఉన్న ప్రయాణికులు భయాందోళనలకు గురయ్యారు. వెంటనే చైన్ లాగి బోగీలను నిలిపివేశారు. దీంతో పెద్ర ప్రమాదం తప్పిందని ఊపిరి పీల్చుకున్నారు. రైల్వే అధికారులకు ఫోన్ చేసి ఫిర్యాదు చేశారు. అప్రమత్తమైన అధికారులు ఇంజన్ వెనుకకు తీసుకొచ్చి వచ్చి భోగిలను బిగించి అవసరమైన మరమ్మతులు చేశారు. విశాఖ ఎక్స్‌ప్రెస్ విశాఖ నుండి విజయవాడ వైపు వెళ్ళుతుండగా ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. అనంతరం తుని రైల్వే స్టేషన్ నుంచి ట్రైన్ బయలుదేరింది.ఈ ప్రమాదం కారణంగా విశాఖ ఎక్స్‌ప్రెస్ రైలు ఆలస్యంగా నడిచింది. విశాఖ ఎక్స్‌ప్రెస్ రైలు భువనేశ్వర్ నుంచి సికింద్రాబాద్ వరకు ప్రయాణిస్తుంది. నిత్యం వేలాది మంది ప్రయాణికులు ఈ రైలులో జర్నీ చేస్తూ ఉంటారు.First published: August 20, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...