TRAIN ACCIDENT MOCK DRILL HEALD AT KONDAPURAM STATIN IN ANANTAPUR DISTRICT OF ANDHRA PRADESH NK
Train Accident: అనంతపురం జిల్లాలో భారీ రైలు ప్రమాదం... అసలేం జరిగిందంటే...
(ప్రతీకాత్మక చిత్రం)
Train Accident: దేశంలో రైలు ప్రమాదాలు చాలా వరకూ తగ్గాయి. కరోనా వచ్చాక... ప్యాసింజర్లు నడవకపోవడంతో... ప్రమాదాలు మరింత తగ్గాయి. అనంతపురం జిల్లాలో ఏం జరిగిందో తెలుసుకుందాం.
Train Accident: ఆంధ్రప్రదేశ్... అనంతపురం జిల్లాలో భారీ రైలు ప్రమాదం జరిగిందనీ... ఉదయం 10 గంటలకు గుంతకల్లు డివిజన్ పరిధిలోని కొండాపురం రైల్వేస్టేషన్లో దుర్ఘటన జరిగిందని... కంట్రోల్ రూమ్‌కి మెసేజ్ వచ్చింది. అది చూడగానే... అక్కడున్న రైల్వే అధికారులు అలర్ట్ అయ్యారు. ఏడీఆర్ఎం సూర్యనారాయణ స్టేషన్‌లోని మిగతా అధికారులకు సమాచారం అందించారు. 10వ బెటాలియన్ NDRF జవాన్లు రంగంలోకి దిగారు. ఘటన జరిగిన కొండాపురం రైల్వేస్టేషన్ చేరుకున్నారు. అక్కడ రైలు పట్టాలపై చెల్లా చెదురుగా పడివున్న ప్రయాణికులను రక్షించి... దగ్గర్లోని ఆస్పత్రికి తరలించారు. అసలు ప్రమాదం ఎలా జరిగింది... ఎక్కడ తేడా వచ్చింది అనే అంశాలపై అధికారులు ఆరా తీస్తున్నారు.
ఇదంతా నిజం కాదు. మాక్ డ్రిల్. ఆల్రెడీ ఇలాంటి ప్రమాదం జరిగితే... అధికారులు, ఉద్యోగులు ఎలా స్పందించాలి... ఏం చెయ్యాలి అనే అంశాలపై కొండాపురం రైల్వేస్టేషన్లో మంగళవారం మాక్‌డ్రిల్ చేశారు. అందులో రెండు బోగీలు... గుద్దుకొని... ఒకదానిపై ఒకటి ఎక్కినట్లుగా సీన్ క్రియేట్ చేశారు. అప్పుడు బోగీల్లోని ప్రయాణికుల పరిస్థితి ఏంటి... అనేది కళ్లకు కట్టేలా... బోగీల్లో కొందరినీ, బయట పట్టాలపై కొందరిని ఉంచి... వాళ్లందరినీ ఆస్పత్రికి ఎలా తీసుకెళ్తారో... అందుకు ఏయే మార్గాలున్నాయో... అన్నీ ఈ డ్రిల్ ద్వారా చూపించారు.
మొదట ఇది చూసిన వారు నిజంగానే ప్రమాదం జరిగిందేమో అనుకున్నారు. ఆ తర్వాత మాక్ డ్రిల్ అని తెలిసి ఊపిరి పీల్చుకున్నారు. "రైలు ప్రమాదాలు జరిగినప్పుడు వెంటనే ఎలాంటి చర్యలు తీసుకోవాలనే అంశాలపై ప్రతి మూడు నెలలకోసారి మాక్‌డ్రిల్ నిర్వహిస్తాం. తద్వారా ఉద్యోగులు, అధికారులు అందరూ అలర్ట్‌గా ఉంటారు" అని ఏడీఆర్ఎం సూర్యనారాయణ తెలిపారు. మాక్ డ్రిల్ చూసిన ప్రయాణికులు ఒకింత ఆశ్చర్యం వ్యక్తం చేశారు. రైలు ప్రమాదం జరిగితే... ఇన్ని రకాల చర్యలు, హడావుడి ఉంటుందా అని అనుకున్నారు. మొత్తానికి మంగళవారం స్థానికంగా ఇదో ఇంట్రస్టింగ్ టాపిక్ అయ్యింది.
Published by:Krishna Kumar N
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.