Train Accident: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో ఓ రైలు ప్రమాదం (Train Accident) పెను విషాదం నింపింది. ఇటీవల ఏపీలో రోడ్డు ప్రమాదాలు (Road Accidents).. ఇలాంటి ప్రమాదాలు పెరగుతున్నాయి. అయితే ఈ ప్రమాదాలకు కొందరి నిర్లక్ష్యమే కారణం అవుతోంది. అయినా అందరిలో మార్పు రావడం లేదు.. నిర్లక్ష్యం కారణంగా ప్రాణాలను కోల్పోవలసి వస్తోంది. తాజాగా శ్రీకాకుళం (Srikakulam) -విజయనగరం జిల్లా (Vizianagaram District)ల సరిహద్దులో ఘోర ప్రమాదం ఐదుగురుని బలి తీసుకుంది. బాతువ సమీపంలో ఈ ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఈ సంఘటనలో ఐదుగురు రైలు ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందగా మరికొందరికి గాయాలయ్యాయి. స్థానికులు.. పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. సికింద్రాబాద్ (Secundrabad) నుంచి గౌహతి వైపు వెళ్తున్న రైలు శ్రీకాకుళం జిల్లా జి.సిగడాం-బాతువ ప్రాంతానికి వచ్చేసరికి రైలులోని బ్రేక్ బైండింగ్ జరిగింది. ఆ సమస్యను గుర్తించి.. రైలు కాసేపు ట్రాక్ పై ఆపిన సిబ్బంది ఆ సమాచారాన్ని రైల్వే ఉన్నతాధికారులకు అందించారు. కాసేపు ట్రైన్ ట్రాక్ పైనే ఆగి ఉండడంతో.. అదే సమయంలో సాధారణ బోగీలో ఉన్న ప్రయాణికులు కొంతమంది గాలి కోసం బయటకు దిగారు. అలా గాలి కోసం దిగడమే వారి పాపం అయ్యింది.. ఏం కాదులే అని ట్రైన్ దిగి ట్రాప్ పై నిలబ్బ నిర్లక్ష్యం వారిని బలి తీసుకునేలా చేసింది.
సరిగ్గా అదే సమయంలో భువనేశ్వర్ నుంచి ముంబయి వైపు వెళ్తున్న కోణార్క్ రైలు అతి వేగంగా వచ్చి అక్కడ ఉన్నవారిని ఢీ కొంది. ట్రైన్ వస్తోంది అనే గుర్తించే లోపే వేగంగా దూసుకొచ్చింది. దీంతో ఐదుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందగా మరి కొంతమందికి గాయాలయ్యాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఇదీ చదవండి తాటి ముంజెలు తినాలి అన్న సరదా అంత పని చేసిందా..? ఊహించని విషాదం
అయితే ఈ ప్రమాదానికి మరేదైనా కారణమా ఉందా అనే అనుమానాలు పెరగుతున్నాయి. ప్రమాదానికి గల కారణాలు పూర్తి స్థాయిలో ఇంకా తెలియాల్సి ఉంది. రైలు సాంకేతిక లోపంతో ఆగిపోలేదని.. ట్రైన్ లో ఉన్న కొందరు చైన్ లాగరని కూడా చెబుతున్నారు. విజయనగరం జిల్లా
చీపురపల్లి దాటిన తరువాత బాతువ, సిగడాం స్టేషన్లలో సహజంగా పాసింజర్ ట్రైన్లు ఆగుతాయి. సరిగ్గా బాతువ గేట్ వచ్చేసరికే ప్రమాదం జరిగినట్టు చెబుతున్నారు. సూపర్ పాస్ట్ ట్రైన్ చైన్ లాగి బాతువలో గాని, సిగడాంలో గానీ అప్పుడప్పుడు కొంతమంది అలా దిగుతుంటారు. ఈ సారి కూడా అలాగే జరిగి ఉంటుందని చెబుతున్నారు. ప్రస్తుత ఘటన మాత్రం శ్రీకాకుళం జిల్లా పరిధిలో జరగగా.. గతంలోనూ విజయనగరం కు సమీపంలోని గొట్లాం స్టేషన్ సమీపంలో ఇలాంటి భారీ ప్రమాదం జరిగింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Accident, Andhra Pradesh, Srikakulam, Train accident