Home /News /andhra-pradesh /

TRAFFIC POLICE FOCUSED ON VIZAG TRAFFIC PROBLEMS WILL THING NEW RULES IMPLEMENT NGS VSP

Traffic New Rules: ట్రాఫిక్ నియంత్రణపై పూర్తి ఫోకస్.. ప్రమాదాలను అరికట్టేందుకు సరికొత్త ఆంక్షలు.. ఇవే

ప్రమాదాలు అరికట్టేందుకు ట్రాఫిక్ రూల్స్

ప్రమాదాలు అరికట్టేందుకు ట్రాఫిక్ రూల్స్

Traffic New Rules: విశాఖ మహా నగరాన్ని రోడ్డు ప్రమాదాలు భయపెడుతున్నాయి. ఇటీవల ప్రమాదల సంఖ్య పెరుగుతోంది. దీంతో పాటు ట్రాఫిక్ సమస్యలతో వాహనదాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వీటన్నింటికీ చెక్ పెడుతూ.. పోలీసులు సరికొత్త ప్రయోగంపై ఫోకస్ చేస్తున్నారు. అది ఏంటంటే..?

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Visakhapatnam, India
    Anand Mohan Pudipeddi, Visakhapatnam, News18. Traffic New Rules: భారత దేశంలో జరిగే రోడ్డు ప్రమాదాల్లో (Road Accidents) ప్రతి గంటకు సగటున 50 మంది మృత్యువాత పడుతుంటారు. ఇటీవల దేశవ్యాప్తంగా జరిగిన వివిధ రోడ్డు ప్రమాదాల్లో నాలుగున్నర లక్షల మందికిపైగా మరణించారని లెక్కలు చెబుతున్నాయి. అందులోనూ అత్యధికంగా సాయంత్రం ఆరు నుంచి తొమ్మిది గంటల మధ్య జరిగిన ప్రమాదాల్లో ఎక్కువ డెత్ రేట్ ఉంటోంది. దేశంలోనే కాదు.. శరవేగంగా అభివృద్ధి చెందుతున్న విశాఖలో రోడ్డు ప్రమాదాలు నిత్యం టెర్రర్ పుట్టిస్తున్నాయి. కాబోయే రాజధానిగా గుర్తింపు పొందిన విశాఖ మహానగరం (visakhapatnam) నరకానికి కేరాఫ్ గా భయపెుతోంది. ఇక్కడే మరో ఆసక్తికర విషయం వెలుగులోకి వస్తోంది. మహా నగరంలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో అత్యధికం సాయంత్రం ఆరు నుంచి రాత్రి తొమ్మిది గంటల మధ్య జరుగుతున్నట్టు పోలీసుల అధ్యయనంలో తేలింది. ఆ మూడు గంటల పాటు ప్రమాదాలు ఎక్కువ అవుతుండడానికి కారణం ఏంటి..? ప్రతి నెల జరుగుతున్న రోడ్డు ప్రమాదాలను గమనిస్తే.. ఆ సమయంలోనే ఎక్కువగా ప్రమాదాల బారిన పడుతున్నవారు ఉన్నారు అంటున్నారు పోలీసులు. అయితే ఈ ప్రమాదాలకు ప్రధాన కారణం.. ట్రాఫిక్ రూల్స్ పాటించకపోవడం.. అందులో అతివేగానికి తోడు.. సిగ్నల్ జంపింగ్స్ కూడా కారణం. అలాగే ఇంకా ఎన్నో రకాల ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘనతోనే ప్రమాదాలు జరుగుతున్నాయని పోలీసుల అధికారులు గుర్తించారు. దీంతో ఇక్కడ ట్రాఫిక్ నియంత్రణకు విశాఖ సిటీ పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ప్రమాదాలను నివారించేందుకు జాతీయ రహదారిపై ఆంక్షలు అమలు చేయాలని నిర్ణయించారు. ఉదయం 7 నుంచి 10 గంటల వరకూ అలాగే సాయంత్రం 4 నుంచి 8 గంటల వరకు భారీ వాహనాలను జాతీయ రహదారిపై నిషేధించారు. దీంతో నగరంలో వివిధ ప్రాంతాలకు డ్యూటీలకు వెళ్ళే ఉద్యోగులు, వ్యాపారులు, విధ్యార్ధులుకు సాయంత్రం వచ్చే వారికి ట్రాఫిక్ అంతరాయం, ప్రమాదం జరగకుండా వుంటుందని సిటీ పోలీసులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇదీ చదవండి : కొడాలి నానికి లైన్ చెప్పిన జూనియర్ ఎన్టీఆర్ .. మరి మాజీ మంత్రి స్పందిస్తారా..? ముఖ్యంగా నగరంలో భారీ వాహనాలను 7నుంచి 10.. 4నుంచి 8 వరకు నిషేదించడంతో ట్రాఫిక్ అంతరాయం లేకుండా గమ్యానికి సకాలంలో చేరుతున్నామని ద్విచక్ర వాహనచోదకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఉదయం డ్యూటీకి వెళ్ళాలంటే జాతీయ రహదారిపై పద్మవ్యూంలా వుండేదని.. ఇప్పుడు అటువంటి సమస్యలేదని అంటున్నారు. ఇదీ చదవండి : సీఎం జగన్ సంచలన నిర్ణయం.. చంద్రబాబుకు ఆహ్వానం..! ఆపరేషన్ 175కి రేపు తొలి అడుగు ట్రాఫిక్ నియంత్రణపై పోలీసుల డేగ కన్ను వేశారు. సిటీపరిధి లోని రోడ్ ప్రమాదాలను నివారించేందుకు ట్రాఫిక్ పోలీసులు సిసి కెమేరిల ద్వారా పర్యవేక్షించి ఆంక్షలు విస్మరించేవారిపై కఠినచర్యలు తీసుకుంటున్నారు. ఇదీ చదవండి: ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ పేరు మార్పుపై తారక్ సంచలన ట్వీట్.. ఏమన్నారంటే? లంకెలపాలేం నుంచి ఆనందపురం వరకు 38 సిగ్నల్స్ దగ్గర సీసీ కెమేరాలు పనిచేస్తున్నాయని, వాటిని నగరంలోని కమాండ్ కంట్రోల్ పర్యవేక్షిస్తుందని అధికారులు చెబుతున్నారు. సిగ్నల్స్ క్రాస్ , ఒవర్ టేక్, అత్యంత వేగంగా డ్రైవింగ్ చేసిన, సిసి టివీ డేగకన్ను వేస్తుందన్నారు. ఎక్కడ ట్రాఫిక్ ఆంక్షలును అతిక్రమించిన వెంటనే చర్యలు తప్పవని, అందుకే ట్రాఫిక్ రూల్స్ పాటించి, ప్రమాదాలను నివారించడంలో సహకరించాలని విశాఖ సిటీ పోలీసు విజ్ఞప్తి చేస్తున్నారు.
    Published by:Nagabushan Paina
    First published:

    Tags: Andhra Pradesh, AP News, AP Police, Visakhapatnam

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు