కలియుగ ప్రత్యక్షదైవం తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనం చేసుకునేందుకు వెళ్లే భక్తులకు ఘాట్రోడ్డులో ఏవో సమస్యలు భయపెడుతూనే ఉన్నాయి. గతంలో ఘాట్రోడ్డులో క్రూరమృగాలైన పులుల సంచారం ఎక్కువగా ఉండేది. కానీ ఇప్పుడు ఏనుగుల (Elephants)మంద భక్తులను భయపెడుతోంది. తిరుమల(Thirumala)కు వెళ్లే మొదటి ఘాట్ రోడ్డు(1stGhat road)కు ఆనుకొని ఉన్న అటవీ (Forest)ప్రాంతం నుంచి పెద్ద సంఖ్యలో ఏనుగులు రోడ్డుపైకి వచ్చాయి. సోమవారం(Monday) సాయంత్రం అటవీ ప్రాంతంలో సంచరిస్తున్న ఏనుగుల గుంపు ఒక్కసారిగా ఘాట్ రోడ్డుపై దర్శనమిచ్చాయి. పెద్ద పెద్దగా ఘీంకారాలు చేసుకుంటూ రోడ్లపైకి రావడంతో భక్తులు, వాహనాల్లో కొండపైకి వెళ్లే ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఎలిఫెంట్ ఆర్చ్(Elephant arch)కు సమీపంలో ఏనుగుల సమూహాన్ని చూసిన వాహనదారులు ఇంజన్లను ఆపివేశారు. దీంతో కొండపైకి వెళ్లే మొదటి ఘాట్రోడ్డులో వాహనాలు భారీగా నిలిచిపోయాయి. కొమార్గంలో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది.
దర్శనానికి దారేది..
తిరుమలకు వెళ్లే మొదటి ఘాట్రోడ్డులో ఏనుగుల గుంపు కారణంగా ట్రాఫిక్ జామ్ అయిన విషయం తెలుసుకున్న టీటీడీ విజిలెన్స్ సిబ్బంది వెంటనే ఫారెస్ట్ అధికారులకు సమాచారం చేరవేశారు. వెంటనే అక్కడ చేరుకున్న అటవీ శాఖ అధికారులు భారీగా సైరన్ మ్రోగించి ఏనుగుల గుంపును అటవీ ప్రాంతంలో పంపే ప్రయత్నం చేశారు. గడిచిన వారం రోజుల్లో ఏనుగుల గుంపు ఇలా ఘాట్రోడ్డుపైకి వచ్చి హల్చల్ చేయడం ఇది రెండోసారి కావడం విశేషం.
కొండపైకి వెళ్లే భక్తులకు కొత్త భయం..
తిరుమల కొండను ఆనుకొని దట్టమైన అటవీప్రాంతం ఉండటంతో పక్కనే ఉన్న అడవిలోంచే ఈ ఏనుగులు ఆహారం కోసం వచ్చినట్లుగా ఫారెస్ట్ అధికారులు భావిస్తున్నారు. పగటి వేళలో అయితే ఏనుగులు, క్రూరమృగాలు వస్తే వాహనదారులు గుర్తించడం సాధ్యపడుతుంది. ఒకవేళ రాత్రి పరిస్థితి ఏమిటని భక్తులు ఆందోళన చెందుతున్నారు.
గజరాజులతో గజగజ..
ఏడవ మైలు దగ్గర ఏనుగుల గుంపు గత వారం రోజులుగా తరచు సంచరిస్తోంది. ఐదు ఏనుగులు కలిగిన ఓ గుంపుగా ఏర్పడి ఘాట్ రోడ్డుకి సమీపంలో నీటి కుంట, వెదురు బొంగుల కోసం వస్తున్నాయని టీటీడీ ఫారెస్ట్ సిబ్బంది చెబుతున్నారు. వాటిని తరిమే ప్రయత్నం చేస్తున్నారు. ఏనుగులు ఘాట్రోడ్డులో హల్చల్ చేస్తున్న వార్త తెలుసుకున్న టీటీడీ అదనపు ఈవో ఏవీ ధర్మారెడ్డి ఘటన స్తలానికి చేరుకున్నారు. ఘాట్ రోడ్డులో ప్రయాణించే సమయంలో భక్తులు అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Elephant attacks, Tirumala