దసరాకు విజయవాడలో ట్రాఫిక్ ఆంక్షలు, ప్రత్యామ్నాయ రూట్లు ఇవే

దసరా శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఈనెల 17వ తేదీ నుంచి ఈనెల 25వ తేదీ వరకు విజయవాడ నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించినట్టు నగర పోలీస్ కమిషనర్ బత్తిన శ్రీనివాసులు తెలిపారు.

news18-telugu
Updated: October 14, 2020, 7:27 PM IST
దసరాకు విజయవాడలో ట్రాఫిక్ ఆంక్షలు, ప్రత్యామ్నాయ రూట్లు ఇవే
విజయవాడ దుర్గమ్మ ఆలయం
  • Share this:
దసరా శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఈనెల 17వ తేదీ నుంచి ఈనెల 25వ తేదీ వరకు విజయవాడ నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించినట్టు నగర పోలీస్ కమిషనర్ బత్తిన శ్రీనివాసులు తెలిపారు. విజయవాడ మీదుగా ఇతర ప్రాంతాలకు వెళ్లే వాహనాలకు సిటీలోకి అనుమతి లేదని సీపీ బత్తిన శ్రీనివాసులు ప్రకటించారు. నగర ప్రజలకు, భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా ట్రాఫిక్ మళ్ళింపులు, పార్కింగ్ ప్రదేశాలను ఏర్పాటు చేశామని తెలిపారు. విశాఖపట్నం - హైదరాబాద్ మధ్య వాహనాలు హనుమాన్ జంక్షన్ నూజివీడు-మైలవరం-జీ కొండూరు - ఇబ్రహీంపట్నం మీదుగా మళ్లిస్తారు. విశాఖపట్నం-చెన్నై మధ్య వాహనాలు హనుమాన్ జంక్షన్-అవనిగడ్డ-రేపల్లె-బాపట్ల-చీరాల మీదుగా మళ్లిస్తారు. గుంటూరు -విశాఖపట్నం మధ్య వాహనాలు బుడంపాడు నుంచి పొన్నూరు-రేపల్లె-అవనిగడ్డ-హనుమాన్ జంక్షన్ మీదుగా మళ్లించనున్నారు.

విజయవాడ - హైదరాబాద్ మధ్య ఆర్టీసీ బస్సులు రాకపోకలను పండిట్ నెహ్రూ బస్ స్టాండ్-చల్లపల్లి బంగ్లా-బుడమేరు వంతెన - పైపుల రోడ్-సితార- గొల్లపూడి వై జంక్షన్ ఇబ్రహీంపట్నం మీదుగా మళ్లించనున్నట్టు సీపీ ప్రకటించారు. విజయవాడ-ఇబ్రహీంపట్నం మధ్య సిటీ బస్సులను ప్రకాశం స్టాట్యూ -లో బ్రిడ్జ్- గద్ద బొమ్మ - కాళేశ్వరరావు మార్కెట్-పంజా సెంటర్-నెహ్రూ చౌక్ చిట్టినగర్- టన్నెల్- సితార- గొల్లపూడి- ఇబ్రహీంపట్నం మీదుగా మళ్లిస్తారు. ఇబ్రహీంపట్నం నుంచి గొల్లపూడి- సితార- సి.వి. ఆర్ ఫ్లై ఓవర్- చిట్టినగర్- నెహ్రూ చాక్- పంజా సెంటర్ - కాళేశ్వరరావు మార్కెట్ లో బ్రిడ్జి-ప్రకాశం స్టాట్యూ - ఏసీఆర్ - సిటీ బస్ స్టాప్ కు అనుమతి ఉంటుంది. అమ్మవారి జన్మ నక్షత్రమైన మూలా నక్షత్రం రోజు 20 వతేదీ రాత్రి నుంచి ఉదయం వరకు ప్రకాశం బ్యారేజ్ మీదకు వాహనాలకు అనుమతి ఉండదు.

దసరా శరన్నవరాత్రుల సందర్భంగా కనకదుర్గమ్మ దర్శనార్థం వచ్చే భక్తుల సౌకర్యార్థం పార్కింగ్ ప్రదేశాలు ఇవే.

ద్విచక్ర వాహన దారుల కొరకు పార్కింగ్ ప్రదేశాలు
1) పద్మావతి ఘాట్, 2) ఇరిగేషన్ పార్కింగ్, 3) గద్ద బొమ్మ, 4) లోటస్ అపార్ట్ మెంట్, 5) ఆర్టీసీ వర్క్ షాప్ రోడ్

కార్ల కొరకు పార్కింగ్ ప్రదేశాలు
1) సీతమ్మవారి పాదాలు, 2) గాంధీజీ మున్సిపల్ హై స్కూల్, 3) టీటీడీ పార్కింగ్

బస్సుల కొరకు పార్కింగ్ ప్రదేశం
1) పున్నమి ఘాట్ వద్ద గల పార్కింగ్ ప్రదేశం

భక్తులు వచ్చే టూరిస్ట్ బస్సులు మార్గం
హైదరాబాద్ నుంచి వచ్చే భక్తులు భవానీపురం లారీ స్టాండ్ వద్ద సర్వీస్ రోడ్ నుంచి పున్నమి హోటల్ వద్ద కుడి వైపు తిరిగి పున్నమి ఘాట్ వద్ద పార్క్ చేయాలి.

విశాఖపట్నం నుంచి వచ్చే భక్తులు రామవరప్పాడు రింగ్ వద్ద ఇన్నర్ రింగ్ రోడ్ పైపుల రోడ్- వై.వి.రావు ఎస్టేట్- సి.వి.ఆర్ ఫ్లై ఓవర్- సితార జంక్షన్- ఆర్టీసీ వర్క్ షాప్ రోడ్- పున్నమి హోటల్ మీదుగా వచ్చి పున్నమి ఘాట్లో పార్క్ చేయాలి

గుంటూరు వైపు నుంచి వచ్చే భక్తులు వారధి- కృష్ణలంక ప్లై ఓవర్- ఆర్టీసీ ఇన్ గేట్- దుర్గా ఫ్లై ఓవర్- స్వాతి జంక్షన్- వేంకటేశ్వర ఫౌండ్రీ వద్ద యూ టర్న్ తీసుకొని పున్నమి హోటల్ వరకు వచ్చి అక్కడ కుడి వైపు తిరిగి పున్నమి ఘాట్లో పార్క్ చేయాలి.

భక్తులు తిరిగి వెళ్ళు సమయంలో పున్నమి ఘాట్ వద్దనే వారి బస్సు ఎక్కాలి. వచ్చిన మార్గంలోనే తిరిగి వెళ్లాలి.
Published by: Ashok Kumar Bonepalli
First published: October 14, 2020, 7:27 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading