ఏపీ సముద్ర తీరంలో టోర్నడో.. సోషల్ మీడియాలో వైరల్

ఐ పోలవరం మండలం భైరవపాలెం దగ్గర సముద్రంలో ఈ అరుదైన దృశ్యం ఆవిష్కృతమైంది.

news18-telugu
Updated: July 2, 2020, 12:27 PM IST
ఏపీ సముద్ర తీరంలో టోర్నడో.. సోషల్ మీడియాలో వైరల్
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
టోర్నడోలు మనకు పెద్దగా తెలియవు. అమెరికాలో ఎక్కువగా అల్లకల్లోలం సృష్టించే ఈ టోర్నడోలు మన దగ్గర కనిపించవు. కానీ తూర్పు గోదావరి జిల్లాలో కనిపించిన ఓ టోర్నడో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. సముద్రం నుంచి నీరు ఆకాశంలోకి వెళుతున్నట్టు కనిపించిన ఈ టోర్నడోను కొందరు మత్స్యకారులు తమ సెల్‌ఫోన్‌లో చిత్రీకరించారు. అదే ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. ఐ పోలవరం మండలం భైరవపాలెం దగ్గర సముద్రంలో ఈ అరుదైన దృశ్యం ఆవిష్కృతమైంది.అప్పుడుప్పుడు గాలి దుమారం వంటివి చూస్తుంటాం కానీ... ఇలాంటి టోర్నడోలను తాము ఎప్పుడు చూడలేదని అక్కడి మత్స్యకారులు చెబుతున్నారు.
First published: July 2, 2020, 12:03 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading