కేసీఆర్, జగన్‌కు టాలీవుడ్ ప్రముఖుల విజ్ఞప్తి...

రెండు రాష్ట్రాల్లోనూ ఇద్దరు ముఖ్యమంత్రులు తమ తమ పథకాలను, తాము ఎన్నికల్లో ఇచ్చిన హామీలు, ఇవ్వని వాటిని కూడా అమలు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

news18-telugu
Updated: October 17, 2019, 4:28 PM IST
కేసీఆర్, జగన్‌కు టాలీవుడ్ ప్రముఖుల విజ్ఞప్తి...
జగన్, కేసీఆర్ (File)
news18-telugu
Updated: October 17, 2019, 4:28 PM IST
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో నంది అవార్డులను మళ్లీ కొనసాగించాలని టాలీవుడ్ ప్రముఖులు డిమాండ్ చేస్తున్నారు. ఆంధ్ర, తెలంగాణ విభజన తర్వాత ఏపీలో నంది అవార్డులు కొన్నాళ్లు ఇచ్చారు. ఆ తర్వాత అవార్డులను ప్రకటించి వాటిని సినీ ప్రముఖులకు అందివ్వలేదు. ఇక తెలంగాణలో నంది అవార్డులు ప్రస్తావనే లేదు. ఈ క్రమంలో రెండు రాష్ట్రాల్లోనూ నంది అవార్డులను మళ్లీ కొనసాగించాలని టాలీవుడ్ ప్రముఖులు కోరుతున్నారు. ప్రతి సంవత్సరం ఉత్తమ సినిమాలు, నటులను ఎంపిక చేసి నంది అవార్డులు ఇవ్వడం, అలాగే టీవీ సీరియల్స్‌ను ప్రోత్సహించేందుకు కూడా నంది అవార్డులు ఇస్తుంటారు. గత 30 సంవత్సరాలుగా ఈ సంప్రదాయం కొనసాగుతోంది. దీంతోపాటు ఉత్తమ ప్రతిభ చూపిన వారికి ఎన్టీఆర్ నేషనల్ అవార్డులు కూడా ఇస్తుంటారు. రెండు రాష్ట్రాల్లోనూ ఇద్దరు ముఖ్యమంత్రులు తమ తమ పథకాలను, తాము ఎన్నికల్లో ఇచ్చిన హామీలు, ఇవ్వని వాటిని కూడా అమలు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ, మూడు దశాబ్దాలుగా కొనసాగుతున్న సంప్రదాయాన్ని కొనసాగించడానికి మాత్రం వారు ఆసక్తి చూపడం లేదని టాలీవుడ్ ప్రముఖులు పెదవి విరుస్తున్నారు. జగన్ మోహన్ రెడ్డి, కేసీఆర్ ఇద్దరూ నందులను పనఃప్రారంభించాలని కోరుతున్నారు.

Video: పులి పిల్లను పట్టుకుని ఎలా హింసిస్తున్నారో చూడండిFirst published: October 17, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...