హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Sita Ramula Kalyanam: పున్నమి వెన్నెలల్లో సీతారాముల కళ్యాణం.. పట్టువస్త్రాలు సమర్పించనున్న సీఎం జగన్

Sita Ramula Kalyanam: పున్నమి వెన్నెలల్లో సీతారాముల కళ్యాణం.. పట్టువస్త్రాలు సమర్పించనున్న సీఎం జగన్

రేపే సీతారాముల కళ్యాణం

రేపే సీతారాముల కళ్యాణం

Sita Ramula Kalyanam: దేశ వ్యాప్తంగా ఎన్నో రామాలయాలు ఉన్నా.. ఒంటిమిట్ట చాలా ప్రత్యేకం.. ఎందుకు అంటారా..? సాధారణంగా దేశ వ్యాప్తంగా ఏ రామాలయంలో చూసుకున్నా.. సీతారాముల కళ్యాణం చైత్ర మాసం నవమి రోజు పగలు జరిగితే.. అక్కడ మాత్రం చైత్ర పౌర్ణమి రోజు.. పండు వెన్నెలలో జరుగుతుంది.

ఇంకా చదవండి ...

  Sita Ramula Kalyanam: భారత దేశంలో ఎన్నో రామాలయాలు (Sri Ram Temples) ఉన్నాయి.. కానీ అందులో ఒంటిమిట్ట (Vontimitta)  క్షేత్రం చాలా ప్రత్యేకమైంది. ముఖ్యంగా ‘శ్రీరామనవమి’  వేడుకలు (Sri Ram Navami) మరింత ప్రత్యేకం ఇక్కడ. రాష్ట్ర ప్రభుత్వం అక్కడ అధికారికంగా ఉత్సవాలను నిర్వహిస్తోంది. సర్వ లాంఛనాలతో ఈ దేవాలయం కళకళలాడుతోంది. ముఖ్యంగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్  (Andhra Pradesh)రెండుగా విడిపోయిన నాటి నుంచి ఈ క్షేత్రానికి గుర్తింపు పెరుగుతూ వస్తోంది. ఆధ్యాత్మిక, సాంస్కృతిక, చారిత్రక వికాసంలో ఇది మంచి పరిణామం. భద్రాచలం (Badrachalam) తెలంగాణ (Telangana) ప్రాంతంలోకి వెళ్లిపోయిన నేపథ్యంలో, ఒంటిమిట్టకు పూర్వవైభవం ప్రారంభమైంది.  ప్రకృతి వైపరీత్యాలు, దోపిడీలు, దొంగతనాలు, దాడులు, ఘాతకాలకు తట్టుకొని నిలబడింది. ఒంటిమిట్ట కోదండ రామాలయం ఇన్నేళ్లు నిలబడడానికి, పునరుద్ధరణకు, పురావైభవం పొందడానికి ఆధునిక కాలంలో కారణం ఏమంటే..? ఒంటిమిట్టకు ‘ఏకశిలా నగరం’ అనే పేరు కూడా ఉంది. సీత, రామ, లక్ష్మణుల ప్రతిరూపాలను ఒకే శిలలో విగ్రహాలుగా ఉంటాయి ఇక్కడ.. అందుకే ఈ క్షేత్రం ‘ఏకశిలా నగరం’గా ఖ్యాతికెక్కింది. అంతే కాదు రామలక్ష్మణుల పక్కన ఆంజనేయస్వామి లేకుండా ఇక్కడ విగ్రహాలను రూపొందించారు. భారతదేశంలో ఇలా నిర్మాణమైన ఏకైక దేవాలయం ఒంటిమిట్ట కోదండరామాలయం మాత్రమే. శ్రీరాముడిని ఆంజనేయుడు (Lord Hanuman) కలవక ముందుకాలంలో ఈ విగ్రహాలను ప్రతిష్ఠ చేసినట్లు ఒక కథనం ఉంది. అందుకే, అక్కడ ఆంజనేయుడు లేడని చెప్పుకుంటారు.

  ముఖ్యంగా శ్రీరామ నవవి వేడుకల సమయంలో ఈ ఆలయం ఎంతో ప్రత్యేకంగా నిలుస్తోంది. దేశంలో అన్ని దేవాలయాల్లో సీతారాముల కళ్యాణం (Sita Ramula Kalyanam) చైత్ర మాసం నవమి రోజున పగలు జరుగుతాయి. దాదా దేశంలో ఎక్కడ రామాలయం ఉన్నా ఇదే ఆనవాయితీ కొనసాగుతుంది. అయితే ఒంటిమిట్టలో మాత్రం చైత్ర మాస పౌర్ణమి (Chaitra Maas Purnima) రోజు రాత్రి జరుగుతుంది. ఈ నేపథ్యంలో కడప ఒంటిమిట్టలో రేపు జరగనున్న శ్రీకోదండ రాముని కల్యాణానికి ఏర్పాట్లను పూర్తి చేశారు. అలాగే రేపు సాయంత్రం కల్యాణానికి సీఎం జగన్ హాజరు కానున్నారు. శ్రీకోదండ రాముని కల్యాణానికి ప్రభుత్వం తరపున సీఎం జగన్ ముత్యాల తలంబ్రాలు సమర్పించనున్నారు. కోదండరామయ్య కల్యాణోత్సవంలో పాల్గొనడానికి సీఎం జగన్ రేపు సాయంత్రం ఆరుగంటలకు ఒంటిమిట్ట చేరుకుంటారు. దేవాలయంలో రాముల వారి దర్శనానంతరం కల్యాణ ప్రాంగణానికి చేరుకుంటారు.

  : ఆసక్తికరంగా నెల్లూరు వైసీపీ రాజకీయాలు.. కోటంరెడ్డిన కలిసిన మాజీ మంత్రి అనిల్.. మ్యాటర్ అదేనా..?

  ఆంధ్రప్రదేశ్ విభజన తరువాత నుంచి సీతారాముల కల్యాణాన్ని అధికారికంగా కడప జిల్లాలోని ఒంటిమిట్టలో ఘనంగా నిర్వహిస్తున్నారు. కోదండ రాముడి కళ్యాణం రాష్ట్ర ప్రభుత్వ అధికారిక వేడుక కావడం, రాష్ట్ర ప్రముఖులు విచ్చేయనుండడంతో జిల్లా యంత్రాంగం టీటీడీతో కలిసి కట్టుదిట్టమైన భద్రత, ఇతర ఏర్పాట్లను పూర్తి చేసింది.

  ఇదీ చదవండి: ఆ పదవులు రద్దు.. జిల్లా బాధ్యతల విషయంలో సీఎం జగన్ కీలక నిర్ణయం.. టార్గెట్ 2024 దిశగా అడుగులు

  కరోనా కారణంగా గత రెండేళ్లు భక్తులు ఈ కళ్యాణానికి దూరమయ్యారు. ఇప్పుడు రెండేళ్ల తరువాత ఒంటిమిట్ట రాములోరి కల్యాణాన్ని ఘనంగా నిర్వహించడానికి అధికారులు ఏర్పాట్లు చేశారు. పౌర్ణమిరోజు రాత్రి స్వామివారి కల్యాణం ఎంతో ఘనంగా నిర్వహిస్తారు. ఏపీ ప్రభుత్వం కోదండ రామస్వామి వారికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమమర్పిస్తుంది. రాత్రి వేళలో సీతారాముల కల్యాణోత్సవం చేస్తున్నందున ఆలయాన్ని అందంగా విద్యుత్ దీపాలతో అలంకరించారు. భక్తుల రక్షణ కోసం ఏర్పాట్లు చేశారు.

  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Andhra Pradesh, Ap cm jagan, Jai Sri Ram, Kadapa

  ఉత్తమ కథలు