• HOME
  • »
  • NEWS
  • »
  • ANDHRA-PRADESH
  • »
  • TOMORROW ON WARDS RATION STOPPED IN TOTAL ANDHRA PRADESH SOME OPERATES RETURN THEIR VEHICLES NGS

Andhra Pradesh: రేపటి నుంచి ఏపీలో రేషన్ బంద్.. వాహనాలను వెనక్కిచ్చిన అపరేటర్లు

Andhra Pradesh: రేపటి నుంచి ఏపీలో రేషన్ బంద్.. వాహనాలను వెనక్కిచ్చిన అపరేటర్లు

రేపటి నుంచి ఇంటింటికీ రేషన్ బంద్

అసలే కరోనాతో ఏపీలో సామాన్య ప్రజలు, పేదలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. రోడ్డు మీదకు వెళ్లాలంటే భయపడాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ సమయంలో వారికి మరో షాక్ తగిలింది. రాష్ట్ర వ్యాప్తంగా రేపటి నుంచి రేషన్ నిలిచిపోనుంది మరోవైపు ఇంటింటికీ రేషన్ వాహనాలను కొందరు ఆపరేటర్లు తిరిగి అధికారులకు అప్ప చెప్పేస్తున్నారు.

  • Share this:
    ఏపీ సీఎం  జగన్ చేతులు మీదుగా ఎంతో ఘనంగా ప్రారంభమైన ఇంటింటికీ రేషన్ కార్యక్రమం మూనాళ్ల ముచ్చటే అయ్యింది. రేపటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా రేషన్ షాపులు బంద్ కానున్నాయి. ఈ నెల 10 నుంచి రేషన్ షాపుల బంద్కు గతంలోనే అపరేటర్లు పిలుపు ఇచ్చారు. ముఖ్యంగా రేషన్ డీలర్లపై అధికారుల ఒత్తడి ఎక్కువగా ఉందని.. ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సమయానికి సరిపడ సరుకులు మాత్రం అందివ్వడం లేదని.. అటు వినియోగారుల నుంచి ఆగ్రహావేశాలు ఎదుర్కోవాలసి వస్తోంది అంటున్నారు. వెంటనే రేషన్‌ డీలర్ల సమస్యలను పరిష్కారించాలని డిమాండ్‌ చేస్తూ సోమవారం ఉదయం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా రేషన్‌ షాపులను బంద్‌ చేస్తున్నట్లు రేషన్‌ డీలర్స్‌ అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షులు మండాది వెంకట్రావు ప్రకటించారు.

    ప్రస్తుతం రాష్ట్రంలో సగం మంది బియ్యం పంపిణీ వాహనదారులు పనిచేయడంలేదని పేర్కొన్నారు. డోర్‌ డెలివరీ రేషన్‌ పంపిణీపై విజిలెన్స్‌ విచారణ నిర్వహించాలని, దీనిలో ఉన్న లోపాలను గుర్తించాలని డిమాండ్ చేశారు. ఎండియు లు చేయాల్సిన రేషన్‌ పంపిణీని డీలర్లు చేయాలని అధికారులు ఒత్తిడి చేస్తున్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలో పలువురు డీలర్లు కరోనాతో మృతి చెందారని.. అయినా ప్రభుత్వం తమను పట్టించుకోవడం లేదనన్నారు. వెంటనే డీలర్లకు వ్యాక్సిన్ వేయించడంతో పాటు బీమా సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. డీలర్లను ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌గా గుర్తించాలని వారు కోరారు.

    తాజాగా ఇంటి దగ్గరకు నిత్యావసరాలు పంపిణీ చేయలేమంటూ వాహనాల ఆపరేటర్లు తప్పుకుంటున్నారు. అనంతపురం జిల్లా గుంతకల్లులో 20 మంది వాహన ఆపరేటర్లలో 10 మంది తమ వాహనాలను తహసీల్దారు కార్యాలయంలో అప్పగించారు. తమకు వస్తున్న 21 వేల రూపాయలు పెట్రోల్, వాహన ఈఎంఐ, హమాలీకే సరిపోతోందని చెబుతున్నారు. ప్రభుత్వం నుంచి వచ్చే రాయితీ కూడా అసలు అందడం లేదన్నారు. తమకొచ్చే జీతంలో ఏమీ మిగలట్లేదని.. వెట్టి చాకిరీ చేయడం తప్ప ప్రయోజనం లేదని ఆవేదన వ్యక్తం చేస్తన్నారు.

    ప్రస్తుతం రాష్ట్రంలో నెలకన్న పరిస్థితులు.. కరోనా భయపెడుతున్న తరుణంలో.. చాలీ చాలని జీతాలతో ప్రాణాలను పణంగా పెట్టి ఇంటింటికీ తిరిగి రేషన్ పంపిణీ చేయలేమని స్పష్టం చేశారు. వాహనం తీసుకునే సమయంలో తాము 70 వేల రూపాయల వరకు ఖర్చు పెట్టామని.. దాన్నిఇచ్చేస్తే వేరే ఉపాధి చూసుకుంటమంటున్నారు. మరిదీనిపై అధికారులు ఎలా స్పందిస్తారో చూడాలి..

    అసలే ఓ వైపు రాష్ట్ర వ్యాప్తంగా కరోనా మహమ్మారి వెంటాడుతోంది. రోజు రోజకూ కేసుల సంఖ్య పెరుగుతున్నాయి. దీంతో ఏపీ వ్యాప్తంగా పగటి పూటా కఠిన కర్ఫ్యూ అమలవుతోంది. ఇలాంటి సమయంలో ఇంటింటికీ రేషన్ కూడా నిలిచిపోతే పేదలకు కష్టాలు తప్పవంటున్నారు. ప్రస్తుతం ఏపీలో చూస్తే ఇంటింటికీ రేషన్ అనే పేరు పెట్టినా.. చాలాచోట్ల సమయానికి రేషన్ అందడం లేదు. అందుకే డీలర్లు సాంకేతిక కారణాలను సాకుగా చూపిస్తున్నారు. అంతేకాదు వీధి చివరి ఎక్కడో రేషన్ వాహనాన్ని నిలిపి అందర్నీ అక్కడికే పిలిచి సరుకులు ఇస్తున్నారు. దీంతో భారీగా అక్కడ లైన్లు తప్పడం లేదు. అయినా సరే సర్దుకుపోతుంటే.. ఇప్పుడు ఇంటింకీ రేషన్ పూర్తిగా నిలిచిపోయవడంపై సామాన్యులు సైతం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
    Published by:Nagesh Paina
    First published: