Home /News /andhra-pradesh /

TOMORROW ON WARDS FACE RECOGNITION ATTENDANCE SYSTEM START ALL OVER SCHOOLS IN ANDHRA PRADESH NGS

Government Teachers: ఉపాధ్యాయులకు మరో టెన్షన్.. ఇక ఫేషియల్ రికగ్నిషన్.. నిమిషం ఆలస్యమైతే అంతే?

ఇక నిమిషం ఆలస్యమైతే అంతే?

ఇక నిమిషం ఆలస్యమైతే అంతే?

Government Teachers: విద్యారంగంలో సమూల మార్పులకు శ్రీకారం చుట్టేదే అయినా.. ఉపాధ్యాయులకు మాత్రం ఇది షాకింగ్ లాంటిదే. ఇకపై స్కూల్ కు పది నిమిషాలు అటు ఇటుగా వెళ్తామంటే కుదరదు.. అంటెండెన్స్ మేనేజ్ చేసుకునే ఆప్షనే ఉండదు.. తాజాగా ఫేషియల్ రికగ్నిషన్ కు ప్రభుత్వం శ్రీకారం చుడుతోంది.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Visakhapatnam, India
    Government Teachers: సాధారణంగా పోటీ పరీక్షలకు.. పబ్లిక్ పరీక్షలకు ఒక్క నిమిషం నిబంధన అమలు చేస్తుంటారు.. ఒక్క నిమిషం నిబంధనను కఠినంగా అమలు చేస్తుంటారు. అయితే విద్యార్థుల్లో కొందరు సరైన కారణాలతోనే కొన్ని నిమిషాల వ్యవధిలో పరీక్ష హాలుకు (Exam Hall) చేరుకుంటారు. అయినా వారిని లోనికి అనుమతించరు. కాళ్ల వేళ్ల ప్రాధేయ పడి వేడుకున్నా కనికరించరు. దీంతో ఒక్క నిమిషం నిబంధనపై ఇప్పటికీ సర్వత్రా విమర్శలు ఉన్నాయి. ఇప్పుడు ఉపాధ్యాయులకు ప్రభుత్వం (Government Teachers) పిడుగులాంటి వార్త చెబుతోంది. ఎందుకంటే ఇప్పటి వరకు ఒక లెక్క.. ఇకపై ఒక లెక్క కానుంది. స్కూల్ ఉదయం 9 గంటలు అయితే ఓ పది నిమిషాలు అటూఇటూగా వెళ్దాంలే అనుకుంటే ఇక నుంచి ఆ పప్పులు ఉడకవ్. ఖచ్చితంగా ఉదయం 9గంటలకు పాఠశాల (School) ప్రాంగణంలో ఉండాల్సిందే. లేదంటే ఆ రోజుకు ఇక సెలవే.. దీని కోసం టీచర్లకు ఫేషియల్ రికగ్నిషన్ (Facial recognition) విధానాన్ని ఏపీ విద్యాశాఖ అమల్లోకి తేనుంది. ‘సిమ్స్ – ఏపీ’ (Sims AP) అనే మొబైల్ యాప్ ను రూపొందించింది. ఉపాధ్యాయులు సహా పాఠశాలలో పనిచేసే అందరూ ఈ యాప్  ను డౌన్‌లోడ్ (Download App) చేసుకోవాల్సి ఉంటుంది.

    అయితే ఈ యాప్ ద్వారా ఉదయం 9గంటల‌లోపు స్కూల్‌కు వచ్చి ఫోటో తీసుకుని అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. ఆ ఫోటోనే కదా ఎక్కడి నుంచైనా తీసుకోవచ్చు.. ఆ ఫోటోను అప్ లోడ్ చేస్తే సరిపోతుంది అనుకుంటే పొరపాటే.. ఖచ్చితంగా పాఠశాలకు వచ్చిన తరువాతనే అప్ లోడ్ చేయాల్సి ఉంటుంది. ఉదయం 9గంటలకు ఒక్క నిమిషం ఆలస్యమైనా ఆ యాప్ ఫోటోను తీసుకోదు. ఫలితంగా ఆబ్సెంట్ పడుతుంది. లీవ్ పెట్టుకోవాలని సూచిస్తుంది. ఎందుకంటే జీపీఎస్ ఆధారంగా ప్రతి పాఠశాలను ఆ యాప్ గుర్తిస్తుంది. ఫోటో ఎక్కడ నుంచి తీసుకున్నారో ఇట్టే చెప్పేస్తుంది. దీంతో ఎలాగైనా 9గంటల లోపు పాఠశాలకు వచ్చి పాఠశాల ఆవరణలోనే ఫొటో తీసుకోవాల్సి ఉంటుంది.



    ఉపాధ్యాయులు సహా పాఠశాలల్లో పనిచేసే అందరూ ఈ యాప్‌ను డౌన్ లోడ్ చేసుకోవాలని విద్యాశాఖ సూచించింది. తొలుత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు తన లాగిన్‌లో పాఠశాలలో పనిచేస్తున్న సిబ్బంది వివరాలు నమోదుచేయాల్సి ఉంటుంది. తరువాత వారి ఫొటోలను మూడు యాంగిల్స్ తీసి యాప్‌లో అప్‌లోడ్ చేయాలి. ఆ తరువాత ఉపాధ్యాయులు యాప్ లోకి వెళ్లి పాఠశాలకు వచ్చిన వెంటనే ఫొటో దిగి అందులో అప్ లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇలా చేయాలంటే నెట్ సక్రమంగా అందుబాటులో ఉండాలి.

    ఇదీ చదవండి : ఉపాధ్యాయులకు మరో టెన్షన్.. ఇక ఫేషియల్ రికగ్నిషన్.. నిమిషం ఆలస్యమైతే అంతే?

    ప్రస్తుతం పట్టణ ప్రాంతాలు, పట్టణాలకు సరిహద్దు ప్రాంతాల్లో అయితే ఇబ్బంది ఉండదు. కానీ మారుమూల ప్రాంతాలు, ఏజెన్సీ ప్రాంతాల్లో ఉపాధ్యాయులకు ఈ యాప్ ద్వారా ఇబ్బందులు తప్పవన్న వాదన వినిపిస్తోంది. మరోవైపు సిమ్స్- ఏపీ యాప్ ను ఇన్ స్టాల్ చేసుకోవద్దని ఏపీ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య (ప్యాప్టో) ఉపాధ్యాయులకు సూచించింది. ఏపీ విద్యాశాఖ మాత్రం రేపటి నుంచే దీనిని అమల్లోకి తెస్తామని చెబుతోంది. మొత్తానికి ఏపీ విద్యాశాఖ తీసుకున్న నిర్ణయంతో పాఠశాలలకు ఆలస్యంగా వచ్చే ఉపాధ్యాయులకు ఇక నుంచి తిప్పలు తప్పనట్లే.
    Published by:Nagabushan Paina
    First published:

    Tags: Andhra Pradesh, Ap government, AP News, AP Schools

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు