Home /News /andhra-pradesh /

TOMORROW FULL CLARITY ON PRC BECAUSE GOVERNMENT EMPLOYEES UNION LEADER WILL MEET CM JAGAN MOHAN REDDY NGS GNT

PRC Fight: రేపు సీఎం జగన్ తో ఉద్యోగ సంఘాల భేటీ.. వెనక్కు తగ్గేదేలే అంటున్న సంఘాల నేతలు

వైఎస్ జగన్

వైఎస్ జగన్

PRC Fight: ఆంధ్ర్రప్రదేశ్ లో పీఆర్సీ లెక్క రేపు తేలిపోనుంది. ప్రభుత్వం ఇంతకన్నా కుదరదంటోంది.. ఉద్యోగ సంఘాలు వెనక్కు తగ్గేదే లే అంటున్నాయి.. దీంతో ఇక ఫైనల్ నిర్ణయం తీసుకోవాల్సింది సీఎం జగన్ మోహన్ రెడ్డి మాత్రమే.. ఉద్యోగ సంఘాలు సీఎం తమకు న్యాయం చేస్తారని ఆశిస్తున్నాయి. అయితే సీఎంతో చర్చల తరువాతే ఏం చేయాలన్నదానిపై మాట్లాడుతాం అంటున్నాయి ఉద్యోగ సంఘాలు.

ఇంకా చదవండి ...
    PRC Fight: పీఆర్సీ (PRC) విషయంలో బుధవారం ఉదయం సీఎం జగన్‌ మోహన్ రెడ్డి (CM Jagan Mohan Reddy)తో ఉద్యోగ సంఘాల (Government Employees Unions) నేతలు భేటీ కానున్నారు. పీఆర్సీ నివేదికపై ఉద్యోగులతో జగన్‌ చర్చించనున్నారు. అంతకుముందు ఉద్యోగ సంఘాల మనసులో ఏముందు.. వారు డిమాండ్ లు ఏమంటన్న అంశాలు తెలుసుకునేందుకు సచివాలయ ఉద్యోగుల సంఘం నేతలతో సజ్జల చర్చలు ముగిసాయి. కానీ సజ్జల చెప్పిన అంశాలపై ఉద్యోగ సంఘాలు తీవ్ర అసహనం వ్యక్తం చేశాయి. ప్రభుత్వం చెబుతున్న విషయాలకు ఎట్టిపరిస్థితుల్లో ఒప్పుకునేది లేదన్నారు. కచ్చితంగా తమ న్యాయపరమైన డిమాండ్లు నెరవేర్చాల్సిందే అంటున్నారు. సీఎం జగన్ తప్పకుండా తమకు అనుకూలంగా వ్యవహరిస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అయితే సజ్జల మాత్రం.. పీఆర్సీ నేపథ్యంలో ఉద్యోగ సంఘాలతో అంతర్గత భేటీ నిర్వహించామన్నారు. అధికారుల కమిటీ రికమెండ్‌ చేసిన మొత్తాన్ని మించి ప్రభుత్వం భరించే స్థితిలో లేదని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణలో ఐఆర్‌ ఇవ్వడం లేదన్నారు. అక్కడ రికమెండెషన్స్‌ అమలు చేయకుండా వాయిదా వేస్తున్నారని గుర్తు చేస్తున్నారు. ఉద్యోగ సంఘాలకు ఎపి ఆర్థిక పరిస్థితిని వివరిస్తామన్నారు. ఉద్యోగులు సీఎంని కలిసే ముందే మార్గాన్ని సుగమం చేయడానికి ఈ సమావేశం అన్నారు.

    ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు 27 శాతం ఫిట్‌మెంట్ ఇవ్వాలని సీఎస్ సమీర్ శర్మ నేతృత్వంలోని కమిటీ సిఫార్సు చేసింది. పీఆర్సీపై నివేదికను సీఎం జగన్‌కు సోమవారం అందించారు. 27 శాతం పీఆర్సీ ఇవ్వడం వల్ల ప్రభుత్వంపై 10 వేల కోట్ల రూపాయల భారం పడే అవకాశం ఉందని సీఎస్ సమీర్ శర్మ చెప్పారు. పీఆర్సీపై ఇచ్చిన రిపోర్టును ఫైనాన్స్ వెబ్‌సైట్‌లో అప్ లోడ్ చేస్తామని, ఉద్యోగ సంఘాలకు కూడా ఇస్తామని సమీర్ శర్మ తెలిపారు. పీఆర్సీ అమలుపై 11 ప్రతిపాదనలు ఇచ్చామన్నారు. 2018 నుంచి పీఆర్సీ అమలు ఉంటుందని తెలిపారు. దీనిపై ఉద్యోగ సంఘాలు ఆందోళన వ్యక్తం చేయడంతో ఆయన వారితో విడివిడిగా సమావేశం అయ్యి.. ప్రభుత్వ ఉద్దేశాన్ని క్లిస్టర్ క్లియర్ గా చెప్పేశారు..

    వాట్ నెక్స్ట్
    ప్రభుత్వ ఉద్యోగులకు 27 శాతం మధ్యంతర భృతికి ఓకే చెప్పింది ప్రభుత్వం. ఒకవేళ సీఎం జగన్ పీఆర్సీ కమిటీ ఇచ్చిన నివేదికను యథాతథంగా ఆమోదిస్తే ఉద్యోగులకు ఎలాంటి జీతభత్యాలు పెరిగే అవకాశం ఉండదు. ఇదే ఉద్యోగుల్లో అసంతృప్తికి కారణమయ్యే ప్రమాదం ఉంది. దీంతో 30 శాతం దాకా ఫిట్‌మెంట్ ప్రకటించే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఉద్యోగ సంఘాలు మాత్రం పీఆర్సీ ప్రకటన ఒకటే సరిపోదని, ముఖ్యంగా సీపీఎస్ రద్దు సహా మరో 77 సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నాయి. లేదంటే ఉద్యమాన్ని మరింత ఉద్దృతం చేస్తామని హెచ్చరిస్తున్నాయి.

    సీఎస్ కమిటీ సిఫార్సులను వ్యతిరేకిస్తున్నామని సజ్జలకు చెప్పామని ఉద్యోగ సంఘం నేత బొప్పరాజు అన్నారు. కనీసం నివేదిక అంశాలపై మాతో కమిటీ చర్చించలేదని చెప్పారు. 14.29 శాతం ఫిట్‌మెంట్‌ను ఇరు జేఏసీలు వ్యతిరేకించాయని తెలిపారు. 55 శాతం ఫిట్‌మెంట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఫిట్‌మెంట్‌, మానిటరీ బెన్‌ఫిట్ అమలు, లబ్ధిపై తేడాలున్నాయన్నారు. హామీల అమలుపై అగ్రిమెంట్ రూపంలో రాసిస్తే తప్పకుండా ఉద్యమంపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. సీఎంతో చర్చల్లో దీనిపై స్పష్టత తీసుకుంటామని స్పష్టం చేశారు.

    (Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
    Published by:Nagabushan Paina
    First published:

    Tags: Andhra Pradesh, Ap cm jagan, AP Governor, AP News

    తదుపరి వార్తలు