Home /News /andhra-pradesh /

TOLLYWOOD VS AP GOVERNMENT MINSTER PERNI NANI REPALY TO VARMA QUESTIONS NGS

Varma Vs Nani: ఏపీలో టికెట్ల ధరపై ట్వీట్ల యుద్ధం.. ప్రభుత్వానికి వర్మ ప్రశ్నలు.. పేర్ని నాని కౌంటర్..

గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో రామ్ గోపాల్ వర్మ, ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నాని మధ్య ఆసక్తికరమైన ప్రశ్న సమాధానాల పోరు జరుగుతుంది. వర్మ అడిగిన ప్రశ్నలకు పేర్ని నాని సమాధానం ఇస్తూనే.. కొన్ని ప్రశ్నలను సంధించారు. ఇప్పుడు వాటికి వర్మ తనదైన శైలిలో సమాధానాలు ఇచ్చారు. ఈ క్రమంలోనే ఆయన వాటిని సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకున్నారు. గౌరవనీయులైన సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నాని గారు ట్విట్టర్ ద్వారా నన్ను అడిగిన ప్రశ్నలకి నా సమాధానం అంటూ మొదలుపెట్టారు వర్మ.

గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో రామ్ గోపాల్ వర్మ, ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నాని మధ్య ఆసక్తికరమైన ప్రశ్న సమాధానాల పోరు జరుగుతుంది. వర్మ అడిగిన ప్రశ్నలకు పేర్ని నాని సమాధానం ఇస్తూనే.. కొన్ని ప్రశ్నలను సంధించారు. ఇప్పుడు వాటికి వర్మ తనదైన శైలిలో సమాధానాలు ఇచ్చారు. ఈ క్రమంలోనే ఆయన వాటిని సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకున్నారు. గౌరవనీయులైన సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నాని గారు ట్విట్టర్ ద్వారా నన్ను అడిగిన ప్రశ్నలకి నా సమాధానం అంటూ మొదలుపెట్టారు వర్మ.

Varma vs Nani: ఆంధ్రప్రదేశ్ లో టికెట్ల రేట్ల వ్యవహారం పీక్ కు చేరింది. ప్రభుత్ం వర్సెస్ టాలీవుడ్ వివాదంలో వివాదాస్పద దర్శకుడు వర్మ ఎంటర్ అవ్వడంతో్ పరిస్థితి మరింత ముదిరింది. ప్రభుత్వ నిర్ణయాన్ని నిలదీస్తూ.. వర్మ పది ప్రశ్నలు స్పందించారు. దానికి మంత్రి పేర్ని నాని అదే స్థాయిలో కౌంటర్లు ఇచ్చారు. మీరూ చూడండి.

ఇంకా చదవండి ...
    Varma vs Nani: ఆంధ్రప్రదేలో సినిమా టికెట్ల వ్యవహారం ముదిరి పాకాన పడింది. ఇప్పటి వరకు సినిమా హీరోల విషయానికి వస్తే పవన్ కళ్యాణ్, నాని తప్ప ఎవరు బహిరంగంగా మాట్లాడలేదు. ప్రభుత్వం నిర్ణయాన్ని తప్పు పట్టలేదు. ఇద్దరు ముగ్గురు ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు ట్వీట్లు చేసి.. ప్రభుత్వానికి వినతలు చేసి లైట్ తీసుకున్నారు. ఇక మెగాస్టార్ చిరంజీవి సైతం సీఎం జగన్ ను కలిసేందుకు ప్రయత్నాలు చేసినా ఫలించలేదు. అయితే ఈ వ్యవహారంపై ప్రొడ్యూసర్ దిల్ రాజ్ స్పందిస్తూ.. త్వరలోనే ప్రభుత్వ నిర్ణయం సానుకూలంగా వస్తుందని.. ఎవరూ కామెంట్లు చేయొద్దన్నారు.. కానీ అనుకోకుండా ఈ వివాదంలో వేలు పెట్టారు వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. సినిమా టికెట్స్ రేట్స్ తగ్గించడంపై డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ తనదైన శైలీలో ప్రభుత్వాన్ని విరామం లేకుండా వరుసగా ప్రశ్నిస్తూనే ఉన్నారు. సోమవారం నుంచి వరుసగా విమర్శలు చేస్తూనే వస్తున్నారు. ఇక మంగళవారం అయితే వరుసగా ఏపీ ప్రభుత్వంపై వరుస ప్రశ్నలు సంధించారు. దీనికి సమాధానం చెప్పాలి అంటూ ఛాలెంజ్ చేశారు.. అయితే ఆ కామెంట్లను ప్రభుత్వం లైట్ తీసుకుంటుంది అనుకుంటే.. మంత్రి పేర్ని నేని స్పందించారు.. అది కూడా ఆయన వేసిన అన్ని ప్రశ్నలను కోట్ చేస్తూ సమధానాలు చెప్పారు.. దీంతో సోషల్ మీడియాలో వీరిద్దరి మధ్య ట్వీట్ లు వైరల్ గా మారాయి.

    1. వర్మ ప్రశ్న
    గౌరవనీయులైన మంత్రిగారికి సూటిగా ఓ ప్రశ్న అంటూ తొలి ట్వీట్ చేశారు. సినిమాలతో సహా ఏదైనా ఉత్పత్తికి మార్కెట్ ధరను నిర్ణయించడంలో ప్రభుత్వ పాత్ర ఖచ్చితంగా ఏమిటి సార్ ? అంటూ వర్మ తనదైన స్టైల్లో నిలదీశారు..



    1. మంత్రి సమాధానం.
    “గౌరవనీయులైన @RGVzoomin గారూ… మీ ట్వీట్లు చూశాను. నాకు ఉన్న సందేహాన్ని తెలియపరుస్తున్నాను. 100 రూపాయల టికెట్ 1000 రూపాయలకు 2000కి అమ్ముకోవచ్చని ఏ బేసిక్ ఎకనమిక్స్ చెప్పాయ్? ఏ చట్టం చెప్పింది? దీన్ని ఏ మార్కెట్ మెకానిజం అంటారు? డిమాండ్ & సప్లై అంటారా? లేక బ్లాక్ మార్కెటింగ్ అంటారా? అంటూ నిలదీశారు..



    2. వర్మ ప్రశ్న
    సినిమా అనేది నిత్యావసర వస్తువు .. ప్రజలకు అవసరం అవుతుందని అనుకున్నప్పుడు.. దానిని ప్రభుత్వం అన్నిటికీ సబ్సిడీ ఇచ్చినట్లు .. ప్రొడ్యూసర్ కి సబ్సిడీ చేయమంటున్నారు.. ఇది నా ఫీలింగ్ కాదు మీ ఫీలింగ్ కదం అలాంటప్పుడు రేషన్ షాప్స్ లాగా థియేట్ర్స్ ఎప్పుడు పెడుతున్నారు అని ప్రశ్నించారు.



    2.మంత్రి సమాధానం
    ఉప్పూ పప్పూ లాంటి నిత్యావసర వస్తువుల ధరల్ని మాత్రమే ప్రభుత్వం నియంత్రించవచ్చుగానీ, సినిమా టికెట్ల ధరల్ని ప్రభుత్వం ఎలా నిర్ణయిస్తుందని అడిగారు. థియేటర్లు అనేవి ప్రజా కోణంలో వినోద సేవలు పొందే ప్రాంగణాలు అంటూ మంత్రి సమాధానం చెప్పారు.



    3. వర్మ ప్రశ్న

    రైతులు పండించిన ఆహార ధాన్యాలకు కూడా బలవంతంగా ధర తగ్గిస్తే రైతు నష్టపోతాడు. నష్టం వాటిళ్లితే ప్రభుత్వం ప్రోత్సాహకాలు ఇస్తుంది. మరి కానీ నాణ్యత లోపాన్ని సృష్టిస్తుంది.. మరి అదే సిద్ధాంతం సినిమా నిర్మాణానికి కూడా వర్తిస్తుంది అంటూ వర్మ ప్రశ్నించారు.



    3. మంత్రి సమాధానం
    3. సామాన్యుడి మోజుని,అభిమానాన్ని లూటీ చేసే పరిస్థితి లేకుండా చూసేందుకు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు 66 ఏళ్ళుగా చట్టాలకు లోబడే సినిమా టికెట్ ధరను నిర్ణయిస్తున్నాయి అంటూ మంత్రి సమాధానం చెప్పారు.



    4. వర్మ ప్రశ
    పేదలకు మేలు చేయడానికి బియ్యం, పంచదార మొదలైన వాటిని అందించడానికి రేషన్ షాపులు సృష్టించినట్లు, మీరు రేషన్ థియేటర్లను సృష్టించడం గురించి ఆలోచిస్తారా సార్? ఇది వర్మ సంధించిన నాలుగో ప్రశ్న..



    4. మంత్రి సమాధానం
    బలవంతంగా ధరలు తగ్గిస్తే మోటివేషన్‌ పోతుందన్నది ఎకనామిక్స్‌లో ప్రాథమిక సూత్రం అని చెప్పారు. ఎవరికి వర్మగారూ? కొనేవారికా? అమ్మేవారికా? మీరు ఎంతవరకు ప్రొడ్యూసర్స్‌ శ్రేయస్సు గురించే మాట్లాడుతూ కన్స్యూమర్ యాంగిల్‌ను గాలికి వదిలారు. కాస్త ప్రేక్షకుల గురించి కూడా ఆలోచించండి వర్మ గారూ అంటూ మంత్రి కౌంటర్ ఇచ్చారు.



    5. వర్మ ప్రశ్న
    పేదలకు సినిమా చాలా అవసరం అని మీకు అనిపిస్తే, మీరు ప్రభుత్వ జేబులో నుండి బ్యాలెన్స్ చెల్లించి వైద్య, విద్యా సేవలకు ఎలా సబ్సిడీ ఇస్తున్నారో.. సినిమాకు ఎందుకు సబ్సిడీ ఇవ్వదు సార్? అని ప్రశ్నించారు..



    5. మంత్రి సమాధానం
    సినిమాను అత్యవసర సర్వీసుగా ప్రభుత్వం భావిస్తుంటే.. మెడికల్, ఎడ్యుకేషన్‌ మాదిరిగానే సబ్సిడీని ప్రభుత్వం భరించాలని అడిగారు. సినిమాను మేం నిత్యావసరంగా గానీ, అత్యవసరంగా గానీ భావించటం లేదు @RGVzoomin గారూ అని మంత్రి సమాధానం ఇఛ్చారు.



    6. వర్మ ప్రశ్న
    పేదలకు మేలు చేయడానికి బియ్యం, పంచదార మొదలైన వాటిని అందించడానికి రేషన్ షాపులు సృష్టించినట్లు, మీరు రేషన్ థియేటర్లను సృష్టించడం గురించి ఆలోచిస్తారా సార్? అంటూ వర్మ ప్రశ్నించారు.



    6.ప్రభుత్వ సమాధానం
    హీరోలకు నిర్మాతలు ఇచ్చే రెమ్యూనరేషన్‌కు ఒక ఫార్ములా చెప్పారు. మీరు ఏ హీరోకు ఎంత ఇస్తారు? ఎంత ఖర్చుతో సినిమా తీస్తారు అన్నది పరిగణనలోకి తీసుకుని ఏనాడూ థియేటర్లలో టికెట్ల ధరను ఏ రాష్ట్ర ప్రభుత్వమూ నిర్ణయించదు @RGVzoomin గారూ అంటూ సమాధానం చెప్పారు.



    7.వర్మ ప్రశ్న
    నిర్ధిష్ట పరిస్థితుల్లో సమతౌల్యత కంటే దిగువన లేదా అంతకంటే ఎక్కువ ధరను ప్రభుత్వం నిర్ణయిస్తుంది. ప్రస్తుత సినిమా పరిశ్రమలో మీరు ఏ ప్రత్యేక పరిస్థితిని గుర్తించారు సార్? అంటూ వర్మ నిలదీశారు..



    7.మత్రి సమాధానం
    థియేటర్‌లో సినిమా టికెట్ల ధరల్ని ప్రేక్షకులకు కల్పించే సౌకర్యాల ఆధారంగా నిర్ణయించాలని మాత్రమే 1970 సినిమాటోగ్రఫీ చట్టం ద్వారా వచ్చిన నిబంధనలు చెపుతున్నాయి అని మంత్రి సమాధానం చెప్పారు.



    8. వర్మ ప్రశ్న
    ద్వంద్వ ధరల వ్యవస్థ సిద్ధాంతంలో పరిష్కారం ఉంటుంది, ఇక్కడ నిర్మాతలు వారి ధరకు టిక్కెట్‌లను విక్రయించవచ్చు, ప్రభుత్వం కొన్ని టిక్కెట్‌లను కొనుగోలు చేసి పేదలకు తక్కువ ధరలకు అమ్మవచ్చు, దీంతో మేం డబ్బులు అందుకుంటున్నాం.. మీరు ఓట్లు పొందండి అన్నారు.

    8. మంత్రి సమాధానం
    ఒక వస్తువుకు సంబంధించిన మార్కెట్‌ ధర నిర్ణయంలో అసలు ప్రభుత్వానికి ఉన్న పాత్ర ఏమిటో సమాధానమివ్వండని అడిగారు. సినిమా ఒక వస్తువు కాదు.అది వినోద సేవ మాత్రమే.ప్రజల్ని దృష్టిలో ఉంచుకుని మేం చేస్తున్నది థియేటర్లలో టికెట్‌ ధరల నియంత్రణ మాత్రమే తప్ప,సినిమా నిర్మాణ నియంత్రణ ముమ్మాటికీ కాదు.



    9. వర్మ ప్రశ్న
    ప్రభుత్వ ధరల నియంత్రణ ఉద్దేశం స్థోమత, స్థిరత్వం కోసం ఉద్దేశించబడినప్పటికీ, ఇది ఎప్పుడూ కొరతను సృష్టించడం, ఉత్పత్తి నాణ్యత క్షీణించడం వంటి వ్యతిరేక ప్రభావాన్ని చూపుతుందా అని వర్మ ప్రశ్నించారు.



    9. ప్రభుత్వం సమాధానం
    మీకు కింది నుంచి మద్దతు ఇవ్వటానికి ప్రజలు మాకు అధికారాన్ని ఇచ్చారని, మీ నెత్తిన ఎక్కి తొక్కటానికి కాదన్నారు.సినిమా టికెట్‌ను ఎంతకైనా అమ్ముకోనిస్తే పరిశ్రమకు కింది నుంచి బలాన్ని ఇచ్చినట్టు.సామాన్యుడిని దోచుకోకుండా ఆపితే మీ నెత్తిన ఎక్కి తొక్కినట్టు మీరు ప్రవచించటం సబబేనా వర్మ గారూ? అంటూ కౌంటర్ ఇచ్చారు.



    అయితే మంత్రి వేసిన కౌంటర్లకు రివర్స్ కౌంటర్ కూడా ఇచ్చారు వర్మ. సంపూర్ణేష్ బాబు సినిమాకు.. చిరంజీవి సినిమాకు ఒకే ధర అంటే ఎలా అని వర్మ ప్రశ్నించారు. మరి ఈ ట్వీట్ల యుద్దం ఎంత వరకు వెళ్తుందో చూడాలి..
    Published by:Nagabushan Paina
    First published:

    Tags: Andhra Pradesh, Ap minister perni nani, Ram Gopal Varma

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు