Home /News /andhra-pradesh /

TOLLYWOOD VS AP GOVERNMENT ISSUE SENSATIONAL DIRECTOR RAM GOPAL VARMA HOT COMMENTS ON MINSTERS NGS

Ram Gopal Varma: ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు నోరు తెరుస్తారు..? వైరల్ గా వర్మ ట్వీట్లు

రామ్ గోపాల్ వర్మ సంచలన వ్యాఖ్యలు

రామ్ గోపాల్ వర్మ సంచలన వ్యాఖ్యలు

Ram Gopal Varma: మొన్నటి వరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంటే ఇష్టం అన్నారు. టీడీపీ అధినేత, ఆయన కుమారుడ్ని టార్గెట్ చేస్తూ సినిమా కూడా తీశారు... ఇప్పుడు జగన్ సర్కార్ కు కౌంటర్లు ఇస్తున్నారు. మంత్రులపై వరుస ట్వీట్లతో సెటైర్లు వేస్తున్నారు.. వర్మలో ఈ మార్పు కారణం అదేనా..?

ఇంకా చదవండి ...
  Ram Gopal Varma: ప్రభుత్వం వర్సస్ టాలీవుడ్ వివాదం మరింత ముదిరింది. ఈ విషయంలో ఇప్పటికే సినీ పెద్దలకు క్లారిటీ వచ్చేసింది. తాము చెప్పింది వినడానికి ప్రభుత్వం సిద్దంగా లేదని తెలియడంతో.. ఇక తాడో పేడో తేల్చుకోవడమే బెటర్ అని అనుకుంటున్నట్టు సమాచారం. ఇప్పటికే కొందరు స్టార్ హీరోలు బహిరంగంగానే తమ నిరసన తెలిపారు. ప్రొడ్యూసర్లు, దర్శకులు కూడా ఏపీ ప్రభుత్వం తీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రభుత్వం కమిటీ వేసిందని అందులో తమకు అనుకూల నిర్ణయం వస్తుందని ఇటీవల బడా ప్రొడ్యూసర్ దిల్ రాజ్ వివరణ ఇచ్చారు. ఏపీలో టికెట్ల రేట్ల వ్యవహారంపై సినిమా పెద్దలు ఎవరూ ఏమీ మాట్లాడొదన్ని సూచించారు. అయినా వివాదం ఆగడం లేదు. తాజాగా ఈ వివాదంపై వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తనదైన స్టైల్లో కౌంటర్లు ఇస్తునే ఉన్నారు. సాధారణంగా ఏపీలో సీఎం జగన్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి వర్మ.. ఆయనకు మద్దతుగానే కామెంట్లు చేస్తూ వచ్చారు. జగన్ అంటే తనకు ఇష్టమని బహిరంగ వేదికల్లోనే చెప్పుకొచ్చారు. అక్కడితోనే ఆగలేదు.. నేరుగా టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్ లపై సెటైర్లు వేస్తూ సినిమా కూడా తీశారు.. అలాంటి వర్మ ఇప్పుడు ప్రభుత్వంపై ఓ రేంజ్ లో సెటైర్లు వేస్తుండడం ఆసక్తికరంగా మారింది..

  సాధారణంగా ఆర్జీవీ అంటేనే ఓ సంచలనం...అతను ఏం మాట్లాడినా వివాదమే అవుతుంది. ఇటీవల ఆయన వ్యాఖ్యలు కూడా దుమారం రేపాయి. ఏపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ ఎవరికైనా ఒక లిమిటేషన్ ఉంటుంది.. ఏమి చెయ్యగలం.. ఏమి చేయలేము అనేది ఒక లిమిట్ ఉంటుంది అన్నారు. అంతేకాదు ఏపీ సర్కార్ ను ఏకంగా కరోనా వైరస్ తో పోల్చుస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కరోనా లాంటిది అన్నారు. ఆ కోవిడ్ ను మనం ఏమి చెయ్యలేం.. అలాగే ఏపీ ప్రభుతాన్ని కూడా ఏమీ చెయ్యలేం అన్నారు. కరోనాను భరిస్తున్నట్టే.. ప్రభుత్వాన్ని భరించాలని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.

  RGV Hot Comments on Andhra Pradesh Government || ఆ ఇద్దరి కోసమే ఇదంతా చే... https://t.co/GqM3lBDB0U via @YouTube #RGVJ #ramgopalvarma #AndhraPolitics #Tollywood @CMJagan5 @RGVVipers  — nagesh paina (@PainaNagesh) January 2, 2022

  ఇప్పుడు విమర్శల దాడిని మరికాస్త పెంచారు. ఏపీలో ఆన్ లైన్ టికెట్ల వ్యవహారంపై డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ప్రభుత్వాన్ని వరుసగా వెంటాడుతున్నారు. తాజాగా ఏపీ సినిమాటోగ్రఫర్ మంత్రి పేర్ని నానిపై వరుసగా ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. వర్మ తన ట్విట్టర్ ఖాతాలో వరుస ట్వీట్స్ చేస్తూ పేర్ని నానికి సవాలు విసురుతున్నారు. తన ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలంటూ కోరుతున్నారు. సినిమాలతో సహా ఏదైనా ఉత్పత్తికి మార్కెట్ ధరను నిర్ణయించడంలో ప్రభుత్వ పాత్ర ఖచ్చితంగా ఏమిటి సార్ ? అంటూ వర్మ తనదైన స్టైల్లో నిలదీశారు..  ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అట్టడుగు స్థాయి నుండి మద్దతు ఇచ్చే అధికారం ఇచ్చారని.. అంతేకాని తమ తలపై కూర్చోవడానికి కాదని మంత్రులు అర్థం చేసుకోవాలని సూచించారు. ఇప్పటికైనా విషయాన్ని అర్థం చేసుకుంటారని భావిస్తూ ధన్యవాదాలు తెలిపారు.  అక్కడితో ఆయన ట్వీట్ల వర్షం ఆగలేదు.. సినిమా పెద్దలు,  హీరోలు అంతా టికెట్ల రేట్ల వ్యవహారంపై నోరు మెదపాల్సిన అవసరరం ఉందన్నారు. ఇది తన రిక్వెస్ట్ కాదు డిమాండ్ అన్నారు.. ఇప్పుడు నోర్లు తెరవకపోతే ఇంకెప్పటికీ మాట్లాడలేరన్నారు.. ఇక మీ ఖర్మ అంటూ సంచలన ట్వీట్ చేశారు..,

  సాధారణంగా సినిమా హీరోలు కాని.. నిర్మాతలు కాని, ఇండస్ట్రీ నుంచి ఎవరు మాట్లాడినా వెంటనే మంత్రులు వారికి కౌంటర్లు ఇస్తూ వస్తున్నారు. ప్రెస్ మీట్ పెట్టి మరీ వారి కామెంట్లకు కౌంటర్లు ఇస్తూ వస్తున్నారు. కానీ ఇప్పడు వరసుగా రామ్ గోపాల్ వర్మ విమర్శలు చేస్తున్నారు. ఏకం ఏపీ ప్రభుత్వాన్ని కరోనా వైరస్ తో పోల్చారు. అయినా కానీ వైసీపీ నేతలు, మంత్రులు సమాధానం ఇవ్వడం లేదు. ఆర్జీవితో మనకు ఎందుకు అని భయపడుతున్నారో.. లేక ఆయన కామెంట్లు వారి వరకు చేరడం లేదో.. కారణం ఏదైనా ఏపీ ప్రభుత్వం నుంచి ఎలాంటి సమాధానం రావడం లేదు..
  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Andhra Pradesh, Ap cm jagan, Ap minister perni nani, AP News, Ram Gopal Varma, Tollywood

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు