హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Nani Vs Varma: తగ్గేదే లే అంటున్న డైరెక్టర్ వర్మ.. సంపూర్ణేష్ బాబు చిరంజీవి ఒక్కటేనా అంటూ మంత్రికి రివర్స్ కౌంటర్

Nani Vs Varma: తగ్గేదే లే అంటున్న డైరెక్టర్ వర్మ.. సంపూర్ణేష్ బాబు చిరంజీవి ఒక్కటేనా అంటూ మంత్రికి రివర్స్ కౌంటర్

రామ్ గోపాల్ వర్మ

రామ్ గోపాల్ వర్మ

Nani Vs Varma: ఏపీ ప్రభుత్వం-టాలీవుడ్ మధ్య యుద్దం మరింత ముదిరింది. ముఖ్యంగా రామ్ గోపాల్ వర్మ-మంత్రి పేర్ని నాని మధ్య ట్వీట్ల వారు తారాస్థాయికి చేరింది. మొదట వర్మ వేసిన ప్రశ్నలకు మంత్రి అదే స్థాయిలో కౌంటర్లు వేస్తే.. తగ్గేదేలే అంటూ వర్మ కూడా అదే స్థాయిలో మళ్లీ రివర్స్ కౌంటర్లు ఇచ్చారు..

ఇంకా చదవండి ...

Nani Vs Varma: ఏపీ ప్రభుత్వానికి -టాలీవుడ్ కి మధ్య మాటల యుద్ధం పీక్ కు చేరింది. గత కొద్ది రోజులుగా సినీ ప్రముఖులకు.. ప్రభుత్వ లీడర్లకు మధ్య తీవ్రస్థాయిలో రచ్చ జరుగుతోంది. గత రెండేళ్లుగా తీవ్రంగా నష్టపోయిన సినీ పరిశ్రమ ఇప్పుడిప్పుడే కోలుకుంటుంది. అదే సమయంలో ఏపీ ప్రభుత్వం టికెట్స్ రేట్స్ తగ్గిస్తూ జీవో జారీ చేయడంపై సినీ ప్రముఖులు అసహనం వ్యక్తం చేశారు. దీంతో ఈ వివాదం చిలికి చిలికి గాలివానగా మారింది. దీనిపై సీనీ ప్రభుత్వం పెద్దలు ఎన్ని ప్రయత్నాలు చేసినా ప్రభుత్వం వెనక్కు తగ్గేదేలే అని కూర్చుంది. తాజాగా ఈ వివాదం పై డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ తనదైన శైలీలో ఏపీ ప్రభుత్వాన్ని నిలదీశారు. ముఖ్యంగా మంత్రి పేర్ని నానికి ట్విట్టర్ వేదికగా విరామం లేకుండా ప్రశ్నల వర్షం కురిపించారు. అయితే దీనిపై ఆయన కూడా అదే రేంజ్ లో స్పందించారు.

వర్మ ప్రశ్నలకు ఈరోజు ఉదయం పేర్ని నాని స్పందించారు. ఆర్జీవి ట్వీట్లను జత చేస్తూ ఆయన అడిగిన ఒక్కో ప్రశ్నకు సమాధానమిచ్చారు. అదే సమయంలో ఆర్జీవీకి మరిన్ని ప్రశ్నలు వేశారు పేర్నినాని. 100 రూపాయల టికెట్ల ధరను 1000 రూపాయలకు, 2000 రూపాయలకు అమ్ముకోవచ్చని ఏ బేసిక్ ఎకనమిక్స్ చెప్పాయ్? ఏ చట్టం చెప్పింది? దీన్ని ఏ మార్కెట్ మెకానిజం అంటారు? డిమాండ్ & సప్లై అంటారా? లేక బ్లాక్ మార్కెటింగ్ అంటారా?..అంటూ రివర్స్ అటాక్ చేశారు నాని. బలవంతంగా ధరలు తగ్గిస్తే మోటివేషన్‌ పోతుందన్నది ఎకనామిక్స్‌లో ప్రాథమిక సూత్రం అని చెప్పారు. ఎవరికి వర్మగారూ? కొనేవారికా? అమ్మేవారికా? మీరు ఎంతవరకు ప్రొడ్యూసర్స్‌ శ్రేయస్సు గురించే మాట్లాడుతూ కన్స్యూమర్ యాంగిల్‌ను గాలికి వదిలారు. కాస్త ప్రేక్షకుల గురించి కూడా ఆలోచించండి వర్మ గారూ కౌంటరిచ్చారు నాని.

సాధారణంగానే వివాదాలు చేయేడంలో.. వాటిని వాడుకోవడంలో ముందు ఉండే వర్మ మరోసారి అదే స్థాయిలో విరుచుకుపడ్డారు. తాజాగా పేర్ని నాని ప్రశ్నలకు వర్మ స్పందించారు. తనకు ఎంతో డిగ్నిటీతో సమాధానం చెప్పినందకు సంతోషం వ్యక్తం చేశారు. ఈ మేరకు వర్మ తన ట్విట్టర్ ఖాతాలో.. థ్యాంక్యూ నాని గారు.. చాలా మంది లీడర్ల లా పరుష పదజాలం తో మాట్లాడకుండా డిగ్నిటీ తో సమాధానం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండీ అంటూ ప్రారంభించారు..


ఆయన వేసిన  ప్రతి కౌంటర్ కు వర్మ సమాధానం ఇస్తూ వచ్చారు.  నీళ్ళు లేని పరిస్థితి ఉన్నప్పుడు గ్లాస్ నీళ్ళు 5 లక్షలకి కొనచ్చు అది పరిస్థితిని ఎక్స్ప్లాయిట్ అనుకుంటే మార్కెట్ ఉన్నదే దానికి .. కార్ కావాలనే కోరికని ఎక్స్ప్లాయిట్ చెయ్యడానికే లగ్జరీ కార్లు చేసి ఆకర్షిస్తారు తప్పని అడ్డు కట్ట వేస్తే మనం ఇప్పటికీ కాలి నడకన తిరుగుతూ ఉండేవాళ్ళమన్నారు.


ముడి పదార్థం 500 కూడా ఖర్చవ్వని పెయింటింగ్ ని కొనేవాడుంటే 5 కోట్లకి అమ్ముతారు ముడి పదార్థానికి మాత్రమే వాల్యూ ఇస్తే బ్రాండ్ కి, ఐడియా కి ఎలా వెల కడతారు? క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది కంటిన్యువస్ గా అన్ని ఇంకా బెటర్ గా ఉండేలా ప్రయత్నించడం ..బెటరా కాదా అనేది కొనుగోలుదారుడు నిర్ణయిస్తాడు.

కొనేవాడికి అమ్మేవాడికి మధ్య ట్రాన్సాక్షన్ ఎంతకి జరిగిందనే ట్రాన్స్పరెన్సీ మాత్రమే ప్రభుత్వాలకి అవసరం.. ఎందుకంటే వాళ్ళకి రావాల్సిన టాక్స్ కోసం. బ్లాక్ మార్కెటింగ్ అనేది గవర్నమెంట్ కి తెలియకుండా చేసే క్రైమ్ ..ఓపెన్ గా ఎంతకి అమ్ముతున్నాడో చెప్పి అమ్మితే అది తప్పెలా అవుతుంది?


ఉదాహరణకి మీకు తెలుసో తెలియదో బాంబే ఢిల్లీ లలో వీక్ డే బట్టి, థియేటర్ బట్టి, ఏ సినిమా అనేదాన్ని బట్టి టికెట్ ప్రైజ్ లు 75 రూపాయల నుండి 2200 రూపాయల వరకూ వేరీ అవుతాయి వీటన్నింటినీ నియంత్రించేది కేవలం ఓల్డెస్ట్ ఎకనామిక్ థియరీ డిమాండ్ అండ్ సప్లై   అంటూ కౌంటర్ ఇచ్చారు.


గవర్నమెంట్ ఇంటర్వెన్షన్ అనేది కొన్ని విపరీత పరిస్థితుల్లో బియ్యం గోధుమ లాంటివి ఉత్పత్తి ఎక్కువయిపోయి ధర పడిపోయినప్పుడు ఉత్పత్తి తక్కువయిపోయి ధర విపరీతంగా పెరిగిపోయినప్పుడు కానీ ఉంటుంది. అలాంటి విపరీత పరిస్థితి ఇప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీ లో కానీ ప్రేక్షకుల లో కానీ ఎక్కడ వచ్చిందండీ?

గవర్నమెంట్ ఇంటర్వెన్షన్ అనేది కొన్ని విపరీత పరిస్థితుల్లో బియ్య0 గోధుమ లాంటివి ఉత్పత్తి ఎక్కువయిపోయి ధర పడిపోయినప్పుడు ఉత్పత్తి తక్కువయిపోయి ధర విపరీతంగా పెరిగిపోయినప్పుడు కానీ ఉంటుంది. అలాంటి విపరీత పరిస్థితి ఇప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీ లో కానీ ప్రేక్షకుల లో కానీ ఎక్కడ వచ్చిందండీ? https://t.co/vNmYLAXmty

సారీ నాని గారు లూటీ అనే పదం ఉపయోగించేది బలాన్ని ఉపయోగించి క్రిమినల్ గా లాక్కున్నప్పుడు ...అమ్మేవాడు కొనేవాడు పరస్పరం అంగీకరించుకుని చేసుకునే దాన్ని ట్రాన్సాక్షన్ అంటారు ...ఆ ట్రాన్సాక్షన్ లీగల్ గా జరిగినప్పుడు గవర్నమెంట్ వాటా టాక్స్ రూపంగా తానంతట తనే వస్తుంది అంటూ కౌంటర్ ఇచ్చారు.థియేటర్లనేవి ప్రజా కోణం లో వినోద సేవలందించే ప్రాంగణాలు అని చెప్పారు. అలా అని ఏ ప్రజలు చెప్పారో వాళ్ల పేర్లు చెప్పగలరా? లేకపోతే రాజ్యాంగం లో కానీ సినిమాటోగ్రఫీ యాక్ట్ లో ఈ డెఫినిషన్ ఉందా.మీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలని సమర్థించుకోవటానికి, ఆ డెఫినిషన్ మీకు మీరు ఇచ్చుకుంటున్నారు.

బలవంతంగా డబ్బులు వసూలు చేస్తారా అంటూ పేర్ని నేని ఇచ్చిన కౌంటర్ కు రిప్లై ఇచ్చారు. అలా కోరుకునేది అందరి కన్నా బెటర్ అవ్వాలనే ఒక మోటివేషన్ తో..ఆ బెటర్ గా ఉన్నప్పుడు వచ్చే అదనపు సౌఖ్యాలని కట్ చేసినప్పుడు మనిషికి మోటివేషన్ పోతుంది.. కమ్యూనిజం ఘోరంగా ఫెయిల్ అయ్యింది అక్కడే అన్నారు వర్మ.రేట్లు తగ్గిస్తున్నది పేదవాడి కోసమే అన్నరు.. అలాంటప్పుడు నిత్యావసర వస్తువుగా భావించినట్టే.. మీ ప్రభుత్వంలో కొందరే ఈ మాటలు చెప్పారు. అలా అంటే ఇంకా ఇష్యూ లేనట్టే అంటూ కామెంట్ చేశారు..

మొదట వర్మ చేసిన ప్రతి ప్రశ్నకు మత్రి పేర్నీ నాని అదే స్థాయిలో కౌంటర్లు ఇచ్చారు.. అయితే వివాదాలకు కేరాఫ్ గా చెప్పుకొనే వర్మ.. ఈ వివాదాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నట్టు కనిపిస్తోంది. అందుకే మంత్రి పేర్ని నాని ఇచ్చిన ప్రతి సమాధానానికి.. అనుబంధ ప్రశ్నలు వస్తూ వచ్చారు.. దీంతో ఈ వివాదం ఎంత వరకు వెళ్తుందో చూడాలి..

First published:

Tags: Andhra Pradesh, Ap minister perni nani, AP News, Ram Gopal Varma

ఉత్తమ కథలు