Home /News /andhra-pradesh /

TOLLYWOOD VS ANDHRA PRADESH GOVERNMENT DIRECTOR RAM GOPAL VARMA SENSATIONAL COMMENTS NGS

RGV Comments: ఆ ఇద్దరి హీరోల కోసమే ఇదంతా..? ఏపీ ప్రభుత్వం కరోనా లాంటింది..? ఆర్జీవి సంచలన వ్యాఖ్యలు

ఆర్జీవీ సంచలన వ్యాఖ్యలు

ఆర్జీవీ సంచలన వ్యాఖ్యలు

RGV Comments: ఆంధ్రప్రదేశ్ లో సినిమా ఆన్ లైన్ టికెట్ల వివాదం ముదిరి పాకన పడింది. స్వయంగా సీఎం జగనే టికెట్ల రేట్లు పెంచేది లేదనే సంకేతాలు ఇచ్చారు.. సీఎంను కలవాలని సినిమా పెద్దలు చేసిన ప్రయత్నాలన్నీ ఫెయిలైనట్టు సమాచారం. దీంతో ఒక్కొక్కరిగా సినిమా హీరోలు, దర్శకులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళం విప్పుతున్నారు. ఇక సంచలనాలకు కేరాఫ్ అయిన రామ్ గోపాల్ వర్మ అయితే ప్రభుత్వాన్ని కరోనాతో పోల్చారు.. కేవలం ఇద్దరు హీరోల కోసమే ప్రభుత్వం ఇలా చేస్తోందని ఆరోపించారు.

ఇంకా చదవండి ...
  RGV Comments: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం  (Andhra Pradesh Government)వర్సెస్ టాలీవుడ్ (Tollywood) వివాదం పూర్తిగా ముదిరిపోయింది. ఇటు ఏపీ ప్రభుత్వం స్పష్టమైన సంకేతాలు ఇచ్చేసింది. టికెట్ల రేట్లు పెంచే విషయంలో తగ్గేదేలే అని క్లారిటీ ఇచ్చేసింది. స్వయంగా సీఎం జగన్ (CM Jagan) కూడా టికెట్ల వ్యవహారంపై నేరుగా మాట్లాడారు. ఇక అధినేత మదిలో ఆ ఆలోచన ఉన్నప్పుడు సినిమా పెద్దలు ఎన్ని ప్రయత్నాలు చేసినా అది అవ్వని పనే అని తేలిపోయింది. ఓ వైపు ఏపీలో సినిమా టికెట్ల ధరలు తక్కువగా ఉన్నాయి. చాలావరకు థియేటర్లు మూతపడ్డాయి.. దీనికి తోడు ఒమిక్రాన్ (Omicron) విరుచుకుపడుతోంది. చాలా రాష్ట్రాల్లో మళ్లీ కఠిన ఆంక్షలు అమలు అవుతున్నాయి. ఈ నేపథ్యంలో పెద్ద సినిమాలు అన్నీ రిలీజ్ ను వాయిదా వేసుకుంటున్నాయి. అయితే దీనికి ప్రధాన కారణం ఏపీ ప్రభుత్వం తీరే అన్నది తెలుగు సినిమా పరిశ్రమ టాక్. అందుకే ఇప్పుడు నేరుగా స్టార్ హీరోలు, దర్శకులు అంతా ప్రభుత్వానికి వ్యతిరేకంగ నేరుగా గళం విప్పుతున్నారు. చాలాకాలంగా ప్రభుత్వానికి మద్దతుగా మాట్లాడుతూ వస్తున్నా సంచలనాలకు కేరాఫ్ అయిన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ  (Ragm gopal varam) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏకం ఏపీ ప్రభుత్వాన్ని కరోనాతో పోల్చారు..

  సాధారణంగా ఆర్జీవీ అంటేనే ఓ సంచలనం...అతను ఏం మాట్లాడినా వివాదమే అవుతోంది. ఇప్పుడు ఆయన వ్యాఖ్యలు ఎలాంటి దుమారం రేపుతాయో చూడాలి. తాజాగా ఆయన ఏమన్నారంటే..? ఎవరికైనా ఒక లిమిటేషన్ ఉంటుంది.. ఏమి చెయ్యగలం.. ఏమి చేయలేము అనేది ఒక లిమిట్ ఉంటుంది అన్నారు. అంతేకాదు ఏపీ సర్కార్ ను ఏకంగా కరోనా వైరస్ తో పోల్చుస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంప కరోనా లాంటిది అన్నారు. ఆ కోవిడ్ ను మనం ఏమి చెయ్యలేం.. అలాగే ఏపీ ప్రభుతాన్ని కూడా ఏమీ చెయ్యలేం అన్నారు. కరోనాను భరిస్తున్నట్టే.. ప్రభుత్వాన్ని భరించాలని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.  ప్రస్తుతం సినిమా మేకింగ్‌లో 70 శాతం హీరోలకు రెమ్యునరేషన్‌ పోతుందన్న మంత్రుల వ్యాఖ్యలను ఆయన తప్పు పట్టారు. మంత్రులు పేర్నినాని, అనిల్‌కుమార్‌ యాదవ్‌ వ్యాఖ్యలను ఆయన గుర్తు చేశారు. ఇక సినిమాకు అయ్యే ఖర్చులో సినిమా హీరోల రెమ్యునరేషన్ కూడా ఉంటుంది అన్నారు. నిర్మాత ఎవరైనా నష్టాలు వస్తాయనే ఉద్దేశంతో భారీ బడ్జెట్‌తో సినిమాలు తీయరని ఆర్జీవీ గుర్తు చేశారు. హీరోకి అంత డబ్బులు ఇస్తున్నారంటే.. అతడిని చూసిని అభిమానులు వస్తారనే నమ్మకంతోనే అన్నారు.

  ఇదీ చదవండి : రేపు ఢిల్లీకి సీఎం జగన్.. ముందస్తు ఎన్నికలపై క్లారిటీ వచ్చేనా..?

  అక్కడితోనే రామ్ గోపాల్ వర్మ కామెంట్లు ఆగలేదు. కేవలం ఇద్దరు హీరోలను టార్గెట్ చేయడానికి సినిమా ఇండస్ట్రీని మొత్తం దూరం పెడుతున్నారా.. లేకా వేరే కారణం ఏమైనా ఉందా అన్నది తనకు తెలీదు అన్నారు. అయినా రేకుల షెడ్డుకు మల్టీప్లెక్స్‌లకు ఒకటే టికెట్‌ అంటే ఏలా సెటైర్ వేశారు. అసలు ఏపీ ప్రభుతం తీసుకున్న ఈ సినిమ టికెట్ల ధరలు తగ్గింపు వెనుక ఏమైనా కారణం ఉంటే క్లియర్‌ కట్‌గా సినిమా పెద్దలకు చెబితే సరిపోతుందని.. వారితో మాట్లాడడం ఇష్టం లేకపోతే నేరుగా బహిరంగంగా చెప్పాలి అని డిమాండ్ చేశారు.


  ఇదీ చదవండి : ఏపీలో అధికారుల స్వామి భక్తిపై విమర్శలు.. మంత్రి కాళ్లు మొక్కిన జేసీ

  సినిమా టికెట్ ధరను నియంత్రించినట్లు ఫైవ్‌స్టార్‌ హోటల్ పుడ్‌ ధరలను కూడా నియంత్రిస్తారా? అంటూ కౌంటర్ వేశారు. చిన్నా షాపులో దొరికే బట్టలు తక్కువ ధరకు.. బ్రాండెడ్ బట్టలు ఎక్కువ ధరలు ఉంటాయి అన్న విషయం కూడా ప్రభుత్వానికి తెలియదా అన్నారు.

  (Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Andhra Pradesh, Ap cm jagan, AP News, RGV, Tollywood

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు