Home /News /andhra-pradesh /

Mohanbabu: టాలీవుడ్ కు మోహన్ బాబు పెదరాయుడు అవుతారా..? సీఎం జగన్ తో ఏం మాట్లాడనున్నారు..?

Mohanbabu: టాలీవుడ్ కు మోహన్ బాబు పెదరాయుడు అవుతారా..? సీఎం జగన్ తో ఏం మాట్లాడనున్నారు..?

విజయవాడలో మోహన్ బాబు

విజయవాడలో మోహన్ బాబు

Mohan Babu will meet AP CM: మంచు మోహన్ బాబు విజయవాడ రావడంపై పలు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. టాలీవుడ్ వర్సెస్ ఏపీ ప్రభుత్వం వివాదం ముదిరిన సమయంలో ఆయన ఇక్కడకు వచ్చారు. దానికి తోడు సీఎం జగన్ ను కలుస్తారనే ప్రచారం ఉంది. ఈ నేపథ్యంలో ఈ భేటీకి అత్యంత ప్రాధాన్యం ఏర్పడింది.

ఇంకా చదవండి ...
    Mohan Babu will meet AP CM:  ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) వర్సెస్ టాలీవుడ్ (Tollywood) వివాదానికి ఎండ్ కార్డ్ వేసేది ఎవరు..  సినిమా ఇండస్ట్రీ తరుపున సీఎం జగన్ (CM YS Jagan) తో మాట్లాడేది ఎవరు..?  సినిమా టికెట్ల ధరలపై (AP Movie Tickets Issue) వివాదంలో మోహన్ బాబు (Mohan babu) జోక్యం చేసుకుంటారు. టాలీవుడ్ తరపున  ఏపీ ప్రభుత్వం (AP Government)తో మాట్లాడి సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేస్తారా..? ఏపీ సర్కార్  తీసుకొచ్చిన చట్టసవరణతో అదనపు షోలు రద్దు కావడంతో పాటు టికెట్ ధరలు కూడా తగ్గించనున్నారు. ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి (Mega Star Chiranjeevi) సినిమా టికెట్ల ధరలపై పునరాలోచించుకోవాలని శుక్రవారం ఏపీ ప్రభుత్వానికి, సీఎం జగన్ (CM YS Jagan) ను కోరారు. తాజాగా సురేష్ బాబు సైతం ఈ ఇష్యూపై ఏపీ ప్రభుత్వాన్ని తప్పు పట్టారు. ఈ నేపథ్యంలో మంచు మోహన్ బాబు.. సీఎం జగన్  కలుస్తుండడం హాట్ టాపిక్ గా మారింది..

    తాజాగా సీనియర్ నటుడు మంచు మోహన్ బాబు విజయవాడకు చేరుకున్నారు. నా విజయవాడ వచ్చినందుకు చాలా ఆనందంగా ఉందని చెప్పిన ఆయన.. వ్యక్తిగత పనులతో పాటు.. ఆప్తులను కలుస్తాను అంటూ.. సీఎం జగన్ తో భేటీపై హింటు ఇచ్చారు. మొదట విజయవాడకు చేరుకున్న మోహన్‌బాబుకు  గన్నవరం ఎయిర్‌పోర్టులో ఘనస్వాగతం పలికారు అభిమానులు.  ఏపీ అధికా భాషా సంఘం అధ్యక్షుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌ తల్లి రంగనాయకమ్మ ఇటీవల మృతి చెందడంతో ఆ కుటుంబాన్ని పరామర్శించనున్నారు మోహన్‌బాబు. ఆ తర్వాత సీఎం జగన్‌ను కూడా కలిసే అవకాశమున్నట్టు తెలుస్తోంది.



    గత ఎన్నికల సమయంలోనే మోహన్ బాబుకు సీఎం జగన్ కీలక పదవి ఇస్తారని ప్రచారం జరిగింది. తరువాత గ్యాప్ పెరిగినట్టు ప్రచారం జరిగింది. అలాగే మోహన్ బాబు బీజేపీలో చేరుతారని ప్రచారం కూడా జరిగింది. గతంలో మోహన్ బాబు నేరుగా ప్రధాని మోదీని కలవడంతో ఈ వార్తలకు ఊతమిచ్చింది. ఆ వార్తలన్నింటికీ మా ఎన్నికలతో ఎండ్ కార్డు పడింది. మా అధ్యక్షుడిగా ఎన్నికైన మంచు విష్ణుకు ఏపీ ప్రభుత్వం మద్దతు ఉంది అన్నది బహిరంగ రహస్యమే.. ప్రత్యర్థి ప్యానెల్ పదే పదే అదే విమర్శలు చేసింది. దీంతో మంచు ఫ్యామిలీకి జగన్ కు మధ్య గ్యాప్ లేదన్నది తేలిపోయింది.

    ఇదీ చదవండి : ఏపీ ప్రభుత్వం పై సురేష్ బాబు సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..?

    ఇప్పుడు సీఎం ను కలిసేందుకు మోహన్ బాబు విజయవాడ రావడం చర్చనీయాంశమైంది. ఇటీవల సినిమాల విషయంలో కూడా ఏపీ సర్కార్ కీలక నిర్ణయాలు తీసుకుంది. ఆన్‌లైన్‌లో టికెట్ల విక్రయం చేయాలని నిర్ణయించారు. బెనిఫిట్ షోలను రద్దు చేశారు. కేవలం 4 షోలకు మాత్రమే అనుమతి ఉంటుందని స్పష్టం చేశారు. టికెట్ల రేట్లు విషయంలో కూడా కఠిన నిర్ణయాలు తీసుకున్నారు. దీనిపై సినిమా పరిశ్రమ నుంచి తీవ్ర విమర్శలు ఎదురవుతున్నాయి. స్టార్ హీరోలు, బడా నిర్మాతలు ఏపీ ప్రభుత్వం తీరును తప్పుపడుతున్నారు. మరి దీనిపై మోహన్ బాబు సీఎం జగన్ తో చర్చింది. టాలీవుడ్ సమస్యను ఆయన కు చేరవేస్తారా లేదా అన్నది చూడాలి. లేక టాలీవుడ్ లో జరుగుతున్న పరిణామాలపై ఆరా తీసేందుకే సీఎం జగన్ ఒకవేళ మోహన్ బాబును కలవాలి అనుకుంటున్నారా అన్నది కూడా ప్రచారంలో ఉంది.. ఈ ఊహాగానాలకు మోహన్ బాబే చెక్ పెట్టాల్సి ఉంది.
    Published by:Nagabushan Paina
    First published:

    Tags: Andhrapradesh, Ap cm jagan, AP News, Manchu Family, Manchu mohan babu, Tollywood

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు