ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ప్రభుత్వానికి, టాలీవుడ్ (Tollywood) కి మధ్య ప్రతిష్టంభన కొనసాగుతున్న సంగతి తెలిసిందే. సినిమా టికెట్ల వ్యవహారం మొదలైనప్పటి నుంచి టాలీవుడ్ వర్సెస్ వైసీపీ ప్రభుత్వంగా మారిపోయింది.
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ప్రభుత్వానికి, టాలీవుడ్ (Tollywood) కి మధ్య ప్రతిష్టంభన కొనసాగుతున్న సంగతి తెలిసిందే. సినిమా టికెట్ల వ్యవహారం మొదలైనప్పటి నుంచి టాలీవుడ్ వర్సెస్ వైసీపీ (YSRCP) ప్రభుత్వంగా మారిపోయింది. ఆ తర్వాత పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు టాలీవుడ్ హీరోల రెమ్యూనరేషన్ పై కామెంట్స్ చేయడంతో వాతావరణం హీటెక్కింది. ఇటీవల మంత్రి అనిల్ కుమార్ యాదవ్.. సినిమా హీరోల రెమ్యునరేషన్ బడ్జెట్ లో 80శాతం ఉంటోందని.. వాళ్లు రెమ్యూనరేషన్ తగ్గించుకోవాలంటూ హాట్ కామెంట్స్ చేశారు. తాజాగా సినిమా వాళ్లు బలిసి కొట్టుకుంటున్నారంటూ నెల్లూరు జిల్లా కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. ఆ తర్వాత ఓ వైసీపీ అధికార ప్రతినిథి రవిచంద్రారెడ్డి సినిమాల్లో రెడ్లను విలన్లుగా చూపిస్తున్నారంటూ మరో సంచలనానికి తెరతీశారు.
ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు ఫిలిం ఛాంబర్ మాజీ అధ్యక్షుడు, ప్రముఖ నిర్మాత ఎన్వీ ప్రసాద్.. నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ వ్యాఖ్యలు బాధాకరమన్నారు. కోవూరులో ప్రసన్న కూమార్ రెడ్డి కుటుంబం అంటే చాలా గౌరవం ఉందని... అనవసరపు వ్యాఖ్యలతో గౌరవాన్ని దిగజార్చు కోవద్దని ఎన్వీ ప్రసాద్ హితవు పలికారు. వంద అడుగులపై నుంచి రోప్ కట్టుకొని కిందకు దూకితే ఎవరు బలిసి కొట్టుకుంటున్నారో తెలుస్తుందంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. మీడియా ముందు మాట్లాడితే హీరో అయిపోరని, బలిసి కొట్టుకుంటోంది మీరేనంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ప్రసన్న కుమార్ రెడ్డి తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలన్న ఎన్వీ ప్రసాద్.., సినిమా వాళ్ళని అమర్యాదగా మాట్లాడటం మంచిది కాదన్నారు. సినిమా నిర్మాణం ఎంత కష్టమో వచ్చి ప్రత్యక్షంగా చూడాలని, తన సినిమా నిర్మాణం సమయంలో ప్రసన్నకుమార్ ను ఆహ్వానిస్తానని ఎన్వీ ప్రసాద్ ఎమ్మెల్యేకు సవాల్ విసిరారు.
ఇదిలా ఉంటే సినీ ఇండస్ట్రీకి కులాలను ఆపాదించడంపై ప్రముఖ దర్శక నిర్మాత తమ్మారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సినిమా వాళ్లను కొంతమంది నాయకులు చులకనగా చూస్తున్నారని మండిపడ్డారు. రాజకీయ నాయకులకు దమ్ముంటే నేతల ఆస్తులు, సినిమా వాళ్ల ఆస్తులపై లెక్కలు తీద్దాం రండంటూ సవాల్ విరిసారు. ఎలాంటి కుల, మతాల పట్టింపులు లేకుండా ఉపాధి కల్పిస్తున్నది సినిమా ఇండస్ట్రీ మాత్రమేనని ఆయన అన్నారు. సినిమా వాళ్లు చీప్ గా దొరికారని ఇష్టమొచ్చినట్లు మాట్లాడతారా అని ప్రశ్నించిన ఆయన.. సామాజిక వర్గాల పేరుతో ఎందుకు రాద్దాం చేస్తున్నారన్నారు. సినిమా వాళ్లు కోట్లు ఖర్చు పెట్టి పైసా పైసా ఏరుకుంటుంటే.. రాజకీయ నాయకులు మాత్రం రూపాయి పెట్టి కోట్లు దోచుకుంటున్నారని సంచలన ఆరోపణలు చేశారు.
(Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
Published by:Purna Chandra
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.