రూ. 210 కోట్లు ఇప్పించండి.. జగన్ సర్కార్‌పై హైకోర్టుకు వెళ్లిన టాలీవుడ్ నిర్మాత

Ashwini Dutt: గతంలో గన్నవరం విమానాశ్రయ విస్తరణ కోసం 40 ఎకరాల భూమిని అశ్వినీదత్ ప్రభుత్వానికి ఇచ్చారు. ప్రభుత్వ ఒప్పందం ప్రకారం భూసేకరణ కాకుండా.. భూ సమీకరణ కింద అశ్వినీదత్ భూమిని ఇచ్చారు.

news18-telugu
Updated: September 28, 2020, 10:59 PM IST
రూ. 210 కోట్లు ఇప్పించండి.. జగన్ సర్కార్‌పై హైకోర్టుకు వెళ్లిన టాలీవుడ్ నిర్మాత
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ఏపీ ప్రభుత్వంపై టాలీవుడ్ ప్రముఖ నిర్మాత అశ్వినీదత్ హైకోర్టుకు వెళ్లారు. గన్నవరంలోని తన భూమికి సంబంధించి నష్టపరిహారం ఇప్పించాలని కోరుతూ ఆయన హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. గతంలో గన్నవరం విమానాశ్రయ విస్తరణ కోసం 40 ఎకరాల భూమిని అశ్వినీదత్ ప్రభుత్వానికి ఇచ్చారు. ప్రభుత్వ ఒప్పందం ప్రకారం భూసేకరణ కాకుండా.. భూ సమీకరణ కింద అశ్వినీదత్ భూమిని ఇచ్చారు. అశ్వినీదత్ భూసమీకరణ కింద ఇచ్చిన భూమికి బదులుగా సీఆర్డీయే పరిధిలో ఆయనకు గత ప్రభుత్వం భూమిని కేటాయించింది. అయితే సీఆర్డీఏ పరిధి నుంచి రాజధాని ఏపీ ప్రభుత్వం తప్పించడంతో.. ఒప్పందాన్ని ఉల్లంఘించారంటూ అశ్వినీదత్ హైకోర్టును ఆశ్రయించారు. గన్నవరం విమానాశ్రయ విస్తరణను ఆపేయాలని ఆయన తన పిటిషన్‌లో పేర్కొన్నారు.

గన్నవరంలో తాను ఇచ్చిన భూమిని తనకు ఇవ్వాలని.. లేని పక్షంలో భూసేకరణ కింద నాలుగు రెట్ల నష్టపరిహారం ఇప్పించాలని కోరారు. తాను ఇచ్చిన 39 ఎకరాలకు రూ.210 కోట్లు చెల్లించి తీసుకోవాలని ప్రభుత్వాన్ని, ఎయిర్‌పోర్టు అథారిటీని పార్టీలుగా చేరుస్తూ అశ్వినీదత్‌ పిటిషన్‌ వేశారు. ప్రస్తుతం తాను ఇచ్చిన 39 ఎకరాల రిజిస్ట్రేషన్‌ వాల్యూ ఎకరం రూ.కోటి 84 లక్షలకు చేరుకుందన్నారు. ల్యాండ్‌ సేకరణ కింద ఈ భూమికి 4 రెట్లు చెల్లించి ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్‌ ఇండియా లేదా ఏపీ ప్రభుత్వం నిర్మాణాలు చేపట్టుకోవచ్చని పిటిషన్‌లో అశ్వినీదత్‌ పేర్కొన్నారు. అశ్వినీదత్‌ తరపున హైకోర్టులో న్యాయవాది జంధ్యాల రవిశంకర్‌ పిటిషన్‌ వేశారు.

Happy Birthday AshwiniDutt producer vyjayanathi movies producer chalasani aswani dutt birthday Special,Happy Birthday AshwiniDutt,Vyjayanthi Movies c Aswani Dutt,chalasani aswani dutt,aswani dutt ntr,aswani dutt anr krishna kiishnam raju shobhan babu,c aswani dutt chiranjeevi balakrishana venkatesh nagarjuna,c aswani dutt jr ntr ram charan prabhas mahesh babu pawan kalyan raviteja, Vyjayanthi Movies c Aswani Dutt donates 5 lakh rupees to corona crisis charity,Vyjayanthi Movies c Aswani Dutt donates ap government to 10 lakh rupees,Vyjayanthi Movies c Aswani Dutt donates 10 lakh rupees to telangana government,Vyjayanthi Movies c Aswani Dutt kcr,Vyjayanthi Movies c Aswani Dutt ys jagan mohan reddy,Vyjayanthi Movies c Aswani Dutt chiranjeevi,Vyjayanthi Movies c Aswani Dutt prabhas,tollywood,telugu cinema,కరోనా క్రైసిస్ ఛారిటీ కోసం సి అశ్వనీదత్ విరాళం,ఏపీ ప్రభుత్వానికి 10 లక్షల విరాళం అందజేసిన వైజయంతి మూవీస్ అధినేత సి అశ్వనీదత్,తెలంగాణ ప్రభుత్వానికి వైజయంతి మూవీస్ అధినేత సి అశ్వనీదత్ విరాళం,సి అశ్వనీదత్,సి అశ్వనీదత్ చిరంజీవి,సి అశ్వనీదత్ ఎన్టీఆర్,ఎదురులేని మనిషి,అశ్వినీదత్ బాలకృష్ణ నాగార్జున వెంకటేష్,సి అశ్వనీదత్ మహానటి,సి అశ్వనీదత్ జూనియర్ ఎన్టీఆర్ ప్రభాస్ మహేష్ బాబు రామ్ చరణ్ పవన్ కళ్యాణ్
అశ్వినీదత్ (Twitter/Photo)


అమరావతి ఉద్యమానికి గతంలో అశ్వినీదత్ మద్దతు తెలిపారు. మూడు రాజధానులకు మెగాస్టార్ చిరంజీవి మద్దతు తెలపడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. మూడు రాజధానులపై చిరంజీవి చేసిన వ్యాఖ్యలను ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నానని అన్నారు. చిరంజీవికి ఏం తెలుసని మూడు రాజధానులు బాగుంటుందని చెప్పారని వ్యాఖ్యానించారు. ప్రపంచంలో బహుళ రాజధాని వ్యవస్థ ఫెయిలైన విషయం చిరంజీవికి ఆయనకు తెలియదా ? అని ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ సినిమాల్లో నటిస్తే కోట్లు సంపాదిస్తారని... ఆయన సినిమాలు వదిలేసి రైతుల కోసం ఎందుకు పోరాడుతున్నారో చిరంజీవికి తెలియదా ? అని అన్నారు. మద్దతు కోసం సినీ హీరోలను రైతులు అడ్డుకోవాల్సిన అవసరం లేదని... వాళ్ల సినిమాలు చూడటం మానేస్తే... వారే దిగివస్తారని అన్నారు. ఈ ప్రాంతంలో పుట్టిన వాళ్లు సూపర్ స్టార్లుగా ఉన్నారన్న అశ్వినీదత్... నటుడిగా కాకున్నా... సగటు మనిషిగా స్పందించాల్సిన అవసరం లేదా ? అని వ్యాఖ్యానించారు. రాజధాని రైతులను చూస్తే ఆవేదన కలుగుతోందని అశ్వినీదత్ అన్నారు. తాజాగా తన భూముల విషయంలో అశ్వినీదత్ కోర్టుకు వెళ్లడంతో.. దీనిపై ప్రభుత్వం ఏ రకంగా స్పందిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.
Published by: Kishore Akkaladevi
First published: September 28, 2020, 10:51 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading