TOLLYWOOD NEWS DID YOU KNOW PUSHPAKA VIMANAM MOVIE DIRECTOR DHAMODHAR FAMILY BACKGROUND NGS VZM
Puspaka Vimanam: పుష్పక విమానం డైరెక్టర్ దామోదర గురించి ఆ విషయం తెలిస్తే షాక్ అవుతారు.. ఇది ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్
పుష్పక విమానం దామోదర గురించి తెలుసా..?
Pushpakavimanam Movie Director Damodara Life Story: ఫస్ట్ సినిమాతోనే అనుభవం డైరెక్టర్ అనిపించుకునేలా అందరితో మన్ననలు అందుకుంటున్నారు డైరెక్టర్ దామోదర్.. విజయ్ దేవరకొండ తమ్ముడితో చేసిన పుష్పపక విమానం ఆయనకు మంచి గుర్తింపు తెచ్చింది. అయితే ఆయన కుటుంబ నేపథ్యంలో ఏంటో తెలుసా..?
Pushpakavimanam Movie Director Damodara Life Story: పుష్పక విమానం (Pushpaka Vimanam) సినిమాకు తొలిరోజు పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. సినిమా హిట్టా.. ఫట్టా అని సంగతి పక్కన పెడితే.. డైరెక్టర్ గా చేసింది తొలి చిత్రమే అయినా దామోదర్ కు టాలీవుడ్ (Tollywood) ఇండస్ట్రీలో క్రేజీ పెరిగింది. ఈ సినిమాతో కచ్చితంగా మరికొన్ని ఆఫర్లు అందుకోవడం ఖాయమంటున్నారు సినీ విమర్శకులు.. అయితే అతడి బ్యాక్ గ్రౌండ్ ఏంటని నెటిజన్లు ఆసక్తిగా సెర్చ్ చేస్తున్నారు. ఆయన తండ్రి పేరున్న కథా రచయిత, తాత నక్సలైట్ నాయకుడు... దామోదర మాత్రం వెండితెరపై తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) సోదరుడు ఆనంద్ దేవరకొండ (Anand Devarakonda) హీరోగా తెరకెక్కిన ‘పుష్పక విమానం’ అనే సినిమా ద్వారా తన లక్కును పరీక్షించుకుని.. సినిమా ఫలితం ఎలా ఉన్నా డైరెక్టర్ గా మంచి మార్కులే వేసుకున్నారు. ఈ చిత్ర దర్శకుడు సృజన్ (దామోదర) శ్రీకాకుళం (Srikakulam) వాసే. దర్శకుడి తండ్రి ప్రముఖ కథా రచయిత అట్టాడ అప్పలనాయుడు. ఈయన ప్రస్తుతం శ్రీకాకుళంలోని విశాఖ ఎ కాలనీలో నివాసముంటున్నారు. సృజన్ తాత ప్రముఖ నక్సలైట్ నాయకులు మామిడి అప్పలసూరి. వీరి స్వగ్రామం కోమర్తి.
లఘు చిత్రాల నుంచి..
సృజన్ సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పనిచేసి సినిమాలపై ఇష్టంతో అటువైపు వెళ్లారు. తొలి తెలుగు కథగా చెప్పుకునే గురజాడ ‘దిద్దుబాటు’ ఆధారంగా సృజన్ ‘కమిలిని’ అనే షార్ట్‌ఫిల్మ్ తీశారు. సృజన్ అభిరుచికి ఈ లఘుచిత్రం ఓ మచ్చుతునక. ఈ షార్ట్ ఫిలింను అప్పట్లో దాసరి నారాయణరావు మెచ్చుకున్నారు. ఆయన జన్మదినం సందర్భంగా నిర్వహించిన పోటీల్లో ఈ లఘుచిత్రంతోనే సృజన్ మొదటి బహుమతి గెలుచుకున్నారు. అలాగే ఓ గిరిజన విద్యార్థిని స్కూల్ బాట పట్టించే కథాంశంతో తీసిన ‘సన్నాయి’ అనే షార్ట్‌ఫిలిం కూడా సృజన్‌కు మంచి పేరు తీసుకువచ్చింది. ఇప్పుడు పుష్పక విమానం ఫిలిం సర్కిళ్లలో మంచి బజ్ క్రియేట్ చేస్తోంది.
ఆయన ప్రోత్సాహం వల్లే..
ఈ సినిమాపై సృజన్ మాట్లాడుతూ విజయ దేవర కొండ తండ్రి గోవర్దనరావు ప్రోత్సాహంతోనే పుష్పక విమానం సినిమాను తెరకెక్కించానని తెలిపారు. నూతన దర్శకులు, నటులను ఆయన ఎంతో ప్రోత్సహిస్తున్నారని, అందులో భాగంగానే తనకూ అవకాశం ఇచ్చారని తెలిపారు. హీరో విజయ్ దేవరకొండ కూడా అండదండలు అందించారని తెలిపారు. కామెడీ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమా రోజూ వింటున్న సంఘటనల ఆధారంగా తీసినట్లు వివరించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.