Home /News /andhra-pradesh /

TOLLYWOOD LEGENDARY DIRECTOR K VISWANTH BIRTHDAY SPECIAL NGS

K Viswanath Birthday specal: ఓ సూటు కలిపింది ఆ ఇద్దరినీ.. విడదీయని బంధం

ఒకరు కథలతో మాయ చేసే దిగ్గజ దర్శకుడు.. మరొకరు వస్త్రాలనే అస్త్రాలుగా చేసుకునే సాధరణ టైలర్.. 25 ఏళ్ల క్రితం ఇద్దరూ ఎవరికి ఎవరూ ఏమీ కాదు.. కానీ శుభసంకల్పం సినిమా ఇద్దరినీ కలిసేలా చేసింది. ఇప్పుడు ఆత్మీయ బంధంగా మారింది. కళాతపస్వి కె.విశ్వనాథ్ పుట్టినరోజు సందర్భంగా మరోసారి ఇద్దరూ కలుస్తున్నారు.

ఒకరు కథలతో మాయ చేసే దిగ్గజ దర్శకుడు.. మరొకరు వస్త్రాలనే అస్త్రాలుగా చేసుకునే సాధరణ టైలర్.. 25 ఏళ్ల క్రితం ఇద్దరూ ఎవరికి ఎవరూ ఏమీ కాదు.. కానీ శుభసంకల్పం సినిమా ఇద్దరినీ కలిసేలా చేసింది. ఇప్పుడు ఆత్మీయ బంధంగా మారింది. కళాతపస్వి కె.విశ్వనాథ్ పుట్టినరోజు సందర్భంగా మరోసారి ఇద్దరూ కలుస్తున్నారు.

ఒకరు కథలతో మాయ చేసే దిగ్గజ దర్శకుడు.. మరొకరు వస్త్రాలనే అస్త్రాలుగా చేసుకునే సాధరణ టైలర్.. 25 ఏళ్ల క్రితం ఇద్దరూ ఎవరికి ఎవరూ ఏమీ కాదు.. కానీ శుభసంకల్పం సినిమా ఇద్దరినీ కలిసేలా చేసింది. ఇప్పుడు ఆత్మీయ బంధంగా మారింది. కళాతపస్వి కె.విశ్వనాథ్ పుట్టినరోజు సందర్భంగా మరోసారి ఇద్దరూ కలుస్తున్నారు.

ఇంకా చదవండి ...
    కొన్ని బంధాలు ఎలా ఏర్పడతాయో.. ఎందుకు ఏర్పడతాయో తెలీదు. కానీ అవి ఎప్పటికీ వీడదీయలేనంత బలపడతాయి. కళాతపస్వి కె.విశ్వనాథ్ తో ఓ సాధరణ వ్యక్తికి అలాంటి బంధమే ఏర్పాడి.. అపురూప స్నేహంగా మారింది. వారి మధ్య పరిచయం మొదలై 25 ఏళ్లు అవుతున్నా ఇప్పటికే ఇద్దరి మధ్యా అదే అప్యాయత కనిపిస్తుంది. ఒకరిది కథల ప్రపంచమైతే.. మరొకరిది వస్త్ర్ర ప్రపంచం. శుక్రవారం కె.విశ్వనాథ్ పుట్టిన రోజు సందర్భంగా మరో ప్రత్యేక కానుక ఇవ్వడానికి నారాయణ రావు స్వయంగా ఆయన ఇంటికి వెళ్తున్నారు.. ప్రతి ఏడాది ఇలా వెళ్లడం.. తన చేతులతో స్వయంగా కుట్టిన వస్త్రాలు కానుకగా ఇవ్వడం ఆనవాయితీగా చేసుకున్నారు.

    పరిచయం ఎలా ఏర్పడింది?
    1994వ సంవత్సరం.. శుభసంకల్పం షూటింగ్ కోసం కళాతపస్వి కె.విశ్వనాథ్ విశాఖపట్నం వచ్చారు.. అయితే షూటింగ్ లో భాగంగా ఆయనకు అర్జెంటుగా సూటు కావాల్సి వచ్చింది. హైదరాబాద్ లో అంటే ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండేవి.. కానీ కె.విశ్వనాథ్ లాంటి పెద్దాయనకు అప్పటికప్పుడు సూటు అంటే ఎక్కడ దొరుకుతుంది. కె.విశ్వనాథ్ తో పాటు చిత్ర యూనిట్ వైజాగ్ లో మెటీరియల్ తీసుకుని మంచి టైలర్ ఎవరైనా ఉన్నారా అని ఆరా తీసింది.. అప్పుడు అక్కడ వారు కచిన్స్ టైలర్స్ పేరుతో అప్పటికే సూట్ స్పెషలిస్టుగా ఫేమస్ అయిన నారాయణ రావు పేరు చెప్పారు.. వెంటనే ఆయనే స్వయంగా వెళ్లి నారాయణ రావును కలిసి.. అద్భుతంగా సూటు కుట్టగలవా అని అడిగారు.

    సూటూతో స్నేహబంధం
    తాను ఎప్పుడూ బొంబే కచిన్స్ లో బట్టలు కుట్టించుకుంటానని.. అదే పేరుతో ఉండడంతో ఇక్కడ కుట్టించుకుంటున్నా అని చెప్పారు. అంత పెద్దాయన గురించి సినిమాల ద్వారా వినడమే తప్ప ఎప్పుడూ ప్రత్యక్షంగా చూడని నారయణరావుకు.. ఒక్కసారిగా కళా తపస్విని చూసేసరికి చెప్పలేని ఆనందం కలిగింది. అప్పటికి ఎంత పని ఉన్నా ఏం ఆలోచించకుండా సరే అని తల ఊపారు. మంచిగా రావాలి అని చెప్పి వెళ్లిపోయిన ఆయన.. తరువాత సినిమా షూటింగ్ కు సంబంధించి అత్యవసరంగా కొన్ని కస్ట్యూమ్స్ అవసరమైతే.. మళ్లీ నారాయాణరావుతో మాట్లాడి తెల్లవారే సరికి అవి కుట్టి ఇవ్వగలవా.. అని రాత్రికి రాత్రి చెప్పారు. కానీ పెద్దాయన స్వయాన అడగడంతో కాదనలేక.. రాత్రంతా మేలుకొని ఆ కాస్ట్యూమ్స్ కుట్టి.. తెల్లవారుజామున షూటింగ్ జరుగుతున్న అప్పికొండ బీచ్ కు వెళ్లి డెలివరీ ఇచ్చారు.. దీంతో నారాయణరావు పని.. కమిట్ మెంట్ పై ఆయనకు ఓ నమ్మకం ఏర్పడింది. అలా ఆ సూటుతో మొదలైన వారి పరిచయడం విడదీయలేని స్నేహ బంధంగా మారింది.    

    ఫోన్ చేసి మరీ వస్తారు
    వారి పరిచయం ఇప్పుడు ఎన్నెన్నో జన్మల బంధంగా బలపడింది. ఎంతలా అంటే కె.విశ్వనాథ్ ఎప్పుడు విశాఖపట్నం వచ్చినా.. ఎవరిని కలిసినా కలవకపోయినా నారాయణ రావును మొదట కలుస్తారు.. అసలు విశాఖ రాకముందే ఆయనకు ఫోన్ చేసి.. మీరు వైజాగ్ లో ఉన్నారా? ఫలనా రోజు వస్తున్నాను అని చెప్పి మరీ విశాఖ వస్తారంట.  

    సినిమాల్లో అవకాశాలతో ఆదాయం
    అంతేకాదు తొలి సూటు కుట్టించుకున్న దగ్గర నుంచి ఎన్నో సార్లు నారాయణ రావుతో ప్రత్యేకంగా బట్టలు కుట్టించుకునే వారు. సినిమాలో ఏదైనా ప్రత్యేక వస్త్రాలు కావాలంటే మొదట నారాయణరావునే సంప్రదించేవారు. మొదటి సినిమాకు 25 వేల రూపాయాలు ఇప్పించిన కె.విశ్వనాథ్.. తరువాత చాలా సినిమాలకు పట్టుబట్టి మరి నారాయణ రావును కాస్ట్యూమ్ డిజైనర్ గా సెలక్ట్ చేయించుకునే వారు. ఇటీవల బుల్లితెరపై వచ్చిన విశ్వనాథ్ అమృత అనుభవాలు ఎపిసోడ్స్ కు కూడా నారాయణ రావును కస్ట్యూమ్ డిజైనర్ గా సెలెక్ట్ చేసి.. ఆయన పేరు కూడా వేయించారు. తరువాత కుచ్చికుచ్చి కూనమ్మ సినిమాకు కాస్ట్యూమ్ డిజైనర్ గా అవకాశం ఇచ్చారు. తాజాగా విశ్వనాథ్ లీడ్ రోల్ లో వస్తున్న ఓ తమిళ సినిమాకు కూడా నారాయణరావుతోనే డ్రెస్సులు కుట్టిస్తున్నారు.   

    ఇద్దరి పరిచయం కేవలం సినిమాలకే పరిమితం కాలేదు.. నారాయణ రావు ఇంట్లో ఏ పంక్షన్ ఉన్నా మొదటి శుభలేఖ అందేది ఆ పెద్దాయనకే. ఆ పిలిస్తే మాత్రం వస్తారా అని విమర్శించే వాళ్లు ఉండవచ్చు.. కానీ ఆయన మాత్రం.. నారాయణ రావు ఇంట్లో జరిగే ప్రతి కార్యాక్రమానికి హాజరయ్యే వారు. తిరుపతిలో జరిగిన పెద్ద కూతురి వివాహానికి హాజరయ్యారు. తరువాత విశాఖ గ్రీన్ పార్కులో జరిగిన రెండో కుమార్తె వివాహానికైతే చివరి వరకు ఉండి వధూవరులను ఆశీర్వదించారు. తరువాత అబ్బాయి పెళ్లికి కూడా వచ్చారు.

    నారాయణ రావు కుమారుడితోనూ ప్రత్యేక అనుభంధం ఉండేంది. తండ్రి తరువాత వారసత్వం నిలుపుకోవాలని ఆ షాపు కూడా చూసుకోవాలని కె.విశ్వనాథ్ చెప్పినా నారాయణ రావు కొడుకు మొదట పట్టించుకోలేదు.. కానీ కొన్నేళ్ల తరువాత మళ్లీ షాపు చూసుకోడానికి సిద్ధమయ్యాడన్న విషయం తెలుసుకుని ఆయన చాలా సంతోషించారు.. నారాయణ రావు కొడుకుతో మాట్లాడి ఇక ఎప్పటికీ ఆ షాపును విడిచిపెట్టొద్దని తండ్రి లాగే మంచి పేరు తెచ్చుకోవాలని బుద్ధులు చెప్పేవారట.

    విశాఖ ఎప్పుడు వచ్చినా ఆయన తప్పకుండా నారాయణరావు షాపుకు వస్తూ ఉంటారు. ఆయన వచ్చిన ప్రతిసారి సాక్షాత్తు పరమశివుడే తన షాపుకు వచ్చినట్టు అనిపిస్తుందని నారాయణ రావు అంటూ ఉంటారు. అలాగే ప్రతి పుట్టిన రోజుకూ తప్పకుండా ఆయనకు దగ్గరకు వెళ్తానని.. తన చేతులతో స్వయంగా వస్త్రాలు కుట్టి ఇస్తానని చెబుతున్నారు.. పెద్దాయన ఎంత చనువు ఇచ్చినా.. ఆయన  కాళ్ల దగ్గర కూర్చోడమే తనకు సంతోషాన్ని ఇస్తుంది అంటున్నారు. తమది స్నేహ బంధం అనే కంటే గురు శిష్యుల బందం అంటే హ్యాపీ అని నారాయణ తన అనుభూతులను నెమరవేసుకుంటున్నారు.
    Published by:Nagesh Paina
    First published:

    Tags: Andhra Pradesh, K viswanath, Vizag

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు