హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

శ్రీవారి సేవలో ప్రముఖులు...స్వామివారిని దర్శించుకున్న టాలీవుడ్ హీరోలు..!

శ్రీవారి సేవలో ప్రముఖులు...స్వామివారిని దర్శించుకున్న టాలీవుడ్ హీరోలు..!

(ప్రతీకాత్మక చిత్రం)

(ప్రతీకాత్మక చిత్రం)

తిరుమల స్వామివారిని దర్శించుకున్నారు టాలీవుడ్ హీరోలు. దర్శనంతరం వీరికి ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా, ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామి వారి తీర్ధ‌ప్రసాదాలు అందజేసారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Tirumala, India

తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు.. సోమవారం ఉదయం స్వామి వారి నైవేద్య విరామ సమయంలో సినీనటులు మంచు విష్ణు, విశ్వక్సన్, ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిలు వేర్వేరుగా స్వామి వారి సేవలో పాల్గోని మొక్కులు చెల్లించుకున్నారు.. దర్శనంతరం వీరికి ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా, ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామి వారి తీర్ధ‌ప్రసాదాలు అందజేసారు.

దర్శనంతరం ఆలయ వెలుపలకు వచ్చిన సినీనటుడు విశ్వక్ సేన్ మీడియాతో మాట్లాడుతూ.. అర్జున్ తో తనకు ఉన్న వివాదంపై స్పందించారు. ఆ విషయాన్ని విశ్వక్ సేన్ తోసిపుచ్చారు.. ప్రతి సినిమా విడుదల ముందు నడకదారిన తిరుమలకు చేరుకొని శ్రీవారిని దర్శించుకోవడం తనకు ఆనవాయితీగా మారిందన్నారు. ఉగాది పర్వదినం పురస్కరించుకొని తాను దర్శకత్వం వహించి నటించిన ధమ్కీ సినిమా విడుదల కానుందన్నారు. ఎల్లుంది ఉగాది నాడు అందరిని సినిమా థియేటర్లలో కలుసుకుంటాంమని, గామి సినిమాతో పాటు మరో సినిమా చేస్తున్నట్లు ఆయన ఈ సందర్భంగా ప్రకటించారు.

మరోవైపు శని ఆదివారాలు.. వీకెండ్ కావడంతో తిరుమలకు  భక్తులు పోటెత్తారు.  వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో అన్ని  కంపార్ట్మెంట్లు నిండి టీబీసీ వరకు భక్తులు బయట క్యూలైన్లలో  ఉన్నారు.   దీంతో టికెట్ లేని శ్రీవారి సర్వదర్శనానికి సుమారు 36 గంటల సమయం పడుతోంది. ఇక టైమ్ స్లాట్ దర్శనానికి 5 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 4 గంటల సమయం పడుతోంది. మరోవైపు  మార్చి 18న  75, 452 మంది స్వామి వారిని దర్శించుకున్నారు. 39,262 మంది స్వామి వారికి తలనీలాలు సమర్పించారు.

First published:

Tags: Local News, Tirumala, Ttd

ఉత్తమ కథలు