Good News to Tollywood: గత కొన్ని నెలలుగా ముదిరిన సినిమా టికెట్ల వివాదానికి శుభం కార్డు పడింది. సీఎం జగన్ మోహన్ రెడ్డి (CM Jagan Mohan Reddy) తో టాలీవుడ్ (Tollywood)పెద్దలు సుమారు గంటన్నరపాటు చర్చించారు. ఈ సమావేశంలో మొత్తం 17 అంశాలను సీఎం ముందు పెట్టారు టాలీవుడ్ పెద్దలు.. ప్రస్తుతం పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలు.. అలాగే టికెట్ల రేట్లు తగ్గించడంతో పెద్ద సినిమాలు ఎదుర్కొంటున్న సమస్యలపైనా సుదీర్ఘంగా సీఎంకు వివరించారు. త్వరలోనే అధికారికంగా టికెట్ల రేట్ల పెరుగుదలపై జీవో విడుదల అవుతుందని సినిమా హీరోలు, దర్శకులు ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే సినిమా పెద్దల నుంచి కూడా సీఎం జగన్ మోహన్ రెడ్డి.. ఓ కోరిక కోరారు.. దానికి సినిమా పెద్దలు సంతోషంగా ఓకే చెప్పారు..
సీఎం జగన్ తో భేటీ తరువాత మీడియాతో మాట్లాడిన మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi).. ఈ చర్చలపై సంతోషం వ్యక్తం చేశారు.. సినిమా టికెట్ల రేట్ల వ్యవహారానికి శుభం కార్డు పడింది అన్నారు. సీఎం జగన్ పెద్ద మనసుకు ధన్యవాదాలు తెలిపారు.. సామాన్యుడికి ఇబ్బంది లేకుండా.. అలాగే సినిమా పరిశ్రమకు ఆర్థిక ఇబ్బందులు లేకుండా.. ఆయన నిర్ణయం తీసుకున్నారని ఆనందం వ్యక్తం చేశారు. అలాగే చిన్న సినిమాలను బతికించడానికి.. మరో అదనుపు షోకు సీఎం జగన్ అనుమతి ఇచ్చారు అన్నారు. అయితే సీఎం జగన్ కూడా తమను ఓ కోరిక కోరారు అన్నారు..
ఇదీ చదవండి : ఏపీలో ఇంటర్, టెన్త్ పరీక్షల షెడ్యూల్ విడుదల.. ఏ ఎగ్జామ్ ఎప్పుడంటే..?
ప్రస్తుతం తెలుగు సినిమా గురించి ప్రపంచం మొత్తం మాట్లాడుకుంటోందని సీఎం జగన్ అన్నారని చిరంజీవి వెల్లడించారు. అయితే ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోనూ తెలుగు పరిశ్రమను డవలప్ చేయాలని కోరారు అన్నారు. ముఖ్యంగా సినిమా షూటింగ్ లో ఏపీలో జరిగేలా చూడాలి.. అలాగే విశాఖలో సినిమా షూటింగ్ లు తరచూ జరపాలని.. అలా అయితే విశాఖ కూడా హైదరాబాద్ లా గుర్తింపు వస్తుంవదని సీఎం కోరారు అని.. అవసరమైతే సినిమా షూటింగ్ లకు సంబంధించి ఎలాంటి సమస్యలు ఉన్నా ప్రభుత్వం చూసుకుంటుందని హామీ ఇచ్చారని చిరంజీవి అన్నారు.. సీఎం కోరికపై ఇకపై ఏపీలో ఎక్కువగా షూటింగ్ లు జరిగేలా చేస్తామని.. దీంతో రెండు రాష్ట్రాల్లో ఎంతో మంది కార్మికులకు ఉపాది లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి : మరోసారి గొప్పమనసు చాటుకున్న మెగాస్టార్.. టీ షాపు నడిపే వ్యక్తి కూతురు పెళ్లికి సాయం
ఈ సమావేశం ముగిసిన అనంతరం మీడియాతో హీరో మహేష్‌బాబు (Mahesh Babu) మాట్లాడాడు. ఆరు నెలలుగా సినిమా ఇండస్ట్రీ పూర్తిగా కన్ఫ్యూజన్లో ఉందని.. ఈ సమస్యను పరిష్కరించడానికి ముందుకు వచ్చిన చిరంజీవికి తొలుత కృతజ్ఞతలు చెప్పుకోవాలన్నాడు. నిజానికి ఈరోజు సీఎం జగన్‌తో సమావేశమయ్యాక చాలా పెద్ద రిలీఫ్‌గా ఉందన్నాడు. ఆయన మొదటి నుంచీ చొరవ చూపి సమస్య పరిష్కారానికి కృషి చేశారని వివరించారు. త్వరలోనే ఓ గుడ్ న్యూస్ వింటారని.. వారం లేదా పది రోజుల్లోనే ఆ శుభవార్త వస్తుందని మహేష్ చెప్పాడు.
ఇదీ చదవండి : అవును నేను దత్తపుత్రుడ్నే.. సీఎం జగన్ కౌంటర్ కు పవన్ రియాక్షన్.. ఏమన్నారంటే..?
రెబల్ స్టార్ ప్రభాస్, దర్శకుడు రాజమౌళి, ఆర్ నారాయణ మూర్తిలు సీఎం జగన్ కు ధన్యవాదాలు తెలిపారు. ముఖ్యంగా ఈ రోజు సమస్య పరిష్కారం అయ్యింది అంటే దానికి ప్రధాన కారణం చిరంజీవే అని కొనియాడారు. ఆయన అవునన్నా.. కాదాన్నా సినిమా పెద్ద మాత్రం చిరంజీవే అని హీరోలు, దర్శకులు కొనియాడారు. అలాగే సినిమా సమస్య పరిష్కారం అయ్యే విధంగా చొరవ చూపించిన మంత్రి పేర్ని నానికి కూడా ధన్యవాదాలు తెలిపారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Ap cm jagan, Mahesh Babu, Megastar Chiranjeevi, Prabhas, SS Rajamouli