హోమ్ /వార్తలు /andhra-pradesh /

Mega Meet: సీఎం జగన్ తో టాలీవుడ్ పెద్దల సమావేశం.. ఎవరెవరు వచ్చారంటే..? 17 అంశాలపైన చర్చ..

Mega Meet: సీఎం జగన్ తో టాలీవుడ్ పెద్దల సమావేశం.. ఎవరెవరు వచ్చారంటే..? 17 అంశాలపైన చర్చ..

Mega Meet With CM Jagan: టాలీవుడ్ సమస్యలకు ఏపీ ప్రభుత్వం శుభం కార్డు వేస్తుందా..? సినిమా పెద్దలు 17 అంశాలను సీఎం జగన్ ముందు పెట్టినట్టు తెలుస్తోంది. మరి ఈ సమస్యలపై సీఎం జగన్ సానుకూలంగా స్పందిస్తారా..? చిరంజీవి మాత్రం ఈ రోజుతో శుభంకార్డు పడుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Mega Meet With CM Jagan: టాలీవుడ్ సమస్యలకు ఏపీ ప్రభుత్వం శుభం కార్డు వేస్తుందా..? సినిమా పెద్దలు 17 అంశాలను సీఎం జగన్ ముందు పెట్టినట్టు తెలుస్తోంది. మరి ఈ సమస్యలపై సీఎం జగన్ సానుకూలంగా స్పందిస్తారా..? చిరంజీవి మాత్రం ఈ రోజుతో శుభంకార్డు పడుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Mega Meet With CM Jagan: టాలీవుడ్ సమస్యలకు ఏపీ ప్రభుత్వం శుభం కార్డు వేస్తుందా..? సినిమా పెద్దలు 17 అంశాలను సీఎం జగన్ ముందు పెట్టినట్టు తెలుస్తోంది. మరి ఈ సమస్యలపై సీఎం జగన్ సానుకూలంగా స్పందిస్తారా..? చిరంజీవి మాత్రం ఈ రోజుతో శుభంకార్డు పడుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

ఇంకా చదవండి ...

  Mega Meet With CM Jagan:  ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ప్రభుత్వం- తెలుగు సినిమా పరిశ్రమ మధ్య ఉన్న గ్యాప్ తగ్గుతుందా? ఏపీలో టాలీవుడ్ (Tollywood) ఎదుర్కొంటున్న సమస్యలకు శుభం కార్డు పడుతుందా..? మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) మాత్రం ఈ సమావేశం తరువాత సమస్యలకు ఎండ్ కార్డు పడదని.. శుభం కార్డు వస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే సినిమా టికెట్ల రేట్లు, ఏపీలో పరిశ్రమ అభివృద్ధిపై  సీఎం జగన్  మోహన్ రెడ్డి (CM  Jagan Mohan Reddy) తో చర్చించేందుకు విజయవాడ (Vijayawada) చేరుకున్నారు టాలీవుడ్ పెద్దలు. ఇప్పటికే టికెట్ రేట్లపై పలు ప్రతిపాదనలు సిద్దం చేసింది. పరిశ్రమకు సంబంధించి 17 అంశాలను సినీపెద్దలు సీఎం జగన్‌ ముందు పెట్టనున్నట్లు తెలుస్తోంది. సినిమా పెద్దలు అంతా కలిసి టికెట్‌ ధరలు, పరిశ్రమ సమస్యలపై చర్చించనున్నారు. బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో విజయవాడకు చేరుకున్నారు టాలీవుడ్‌ బృందం.. అక్కడి నుంచి రోడ్డుమార్గంలో తాడేపల్లి సీఎం క్యాంప్ ఆఫీస్ కు చేరుకున్నారు. ఈ సమావేశం కోసం చిరంజీవితోపాటు మహేష్‌బాబు, ప్రభాస్, రాజమౌళి, పోసాని, కొరటాల శివ, నటుడు అలీ, నారాయణ మూర్తి జగన్ తో భేటీ అయ్యారు. అలాగే ఈ చర్చల్లో సీఎం జనగ్ తో పాటు, మంత్రి పేర్ని నాని..

  ఎక్కువమందికి అపాయింట్‌మెంట్‌ ఇవ్వాలని సినీ పెద్దలు కోరారని తెలుస్తోంది. కానీ కోవిడ్ ప్రొటోకాల్ ప్రకారం తక్కువ మందే రావాలని మంత్రి పేర్నినాని సూచించారు. దీంతో ముందుగానే టాలీవుడ్ పెద్దలు సమావేశమై.. సమస్యలపై చర్చించి.. మొత్తం 17 అంశాలను సీఎం జగన్ ముందు పెట్టాలని నిర్ణయించినట్టు సమాచారం. ముఖ్యంగా జీవో నెంబర్ 35 పూర్తిగా రద్దు చెయ్యాలన్నది సినిమా పెద్దల డిమాండ్.. ఈ ఉత్తర్వులో చెప్పిన ప్రకారం సినిమాలు ఆడించడం కష్టమన్నది థియేటర్ల వాదన. భారీ బడ్జెట్‌తో సినిమాలు, ప్యాన్ ఇండియా మూవీస్‌తో ఇండస్ట్రీనికి దేశానికే కేరాఫ్‌గా మార్చిన నిర్మాతలకూ ఈ రేట్లతో పెద్దగా లాభం లేదంటూ చెబుతున్నారు టాలీవుడ్ పెద్దలు.. ఓవైపు కొన్ని థియేటర్లు స్వచ్చందంగా మూస్తే, ఇంకొన్ని థియేటర్స్‌ రూల్స్ పాటించడంలేదని అధికారులు క్లోజ్ చేశారు.

  ఇదీ చదవండి: జగన్ అన్న పాలన అంటే ఇదే.. విశాఖలో పరిస్థితిపై వీడియో వైరల్

  ఈ వివాదాలు కొనసాగుతుండగానే.. పెద్ద సినిమాలైన అఖండ, పుష్ప, శ్యామ్‌సింగారాయ్‌, బంగార్రాజు లాంటి సినిమాలు విడుదలై కలెక్షన్ల వర్షం కురిపించాయి. అయితే టికెట్ల రేట్లు పెంచుకునే అవకాశం ఉన్నా.. మరో షో అదనంగా వేసినా.. కలెక్షన్ల లెక్క మరోలా ఉండేది అన్నది టాలీవుడ్ వాదన. ఏపీలో టికెట్ల ధర తగ్గుదల కారణంగా.. సంక్రాంతికి రిలీజ్ అవ్వాల్సిన పెద్ద సినిమాలు అన్నీ వాయిదా పడ్డాయి. ఆర్ఆర్ఆర్, రాధేశ్యామ్‌, ఆచార్య, భీమ్లానాయక్ కూడా పోస్ట్‌పోన్‌ లిస్ట్‌లో ఉన్నాయి. ఇప్పడు సీఎం జగన్‌తో మీటింగ్ తర్వాత సమస్యలు పరిష్కారం అయితే వరసబెట్టి ప్యాన్ ఇండియా మూవీస్‌ థియేటర్‌లోకి వచ్చేస్తాయి.  

  ఇదీ చదవండి: ఆ విషయంలో భర్తలను ప్రోత్సహించిన భార్యలు.. విషయం తెలిసి షాక్ తిన్న పోలీసులు

  బేగంపేటలో మీడియాతో మాట్లాడిన చిరు సంచలన వ్యాఖ్యలే చేశారు. టాలీవుడ్ సమస్యలకు ఎండ్ కార్డు కాదని.. ఇవాళ శుభం కార్డు పడుతుందని చిరు చెప్పుకొచ్చారు. అంతటితో ఆగని ఆయన.. సంచలన వ్యాఖ్యలే చేశారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ వ్యాఖ్యలు అటు సినీ ఇండస్ట్రీలో.. ఇటు తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో హాట్ టాపిక్ అవుతున్నాయి. తనతో పాటు ఎవరు వస్తున్నారో తెలియదని.. తనకు మాత్రం ఆహ్వానం అందింది అన్నారు చిరంజీవి..

  సీఎం జగన్ ఆశాభావం వ్యక్తం చేసినట్టు.. సినిమా సమస్యలకు శుభం కార్డు పడుతుందో లేదో చూడాలి.. కానీ సోషల్ మీడియాలో మాత్రం ఇప్పటికే టికెట్ల రేట్లను పెంచారంటూ కొన్ని పోస్టులు మాత్రం వైరల్ అవుతున్నాయి. అయితే ఈ చర్చల సారంశాన్ని నేరుగా సీఎం జగన్ లేదా మంత్రి పేర్ని నాని.. చరింజీవితో కలిసి సంయుక్తంగా మీడియాతో మాట్లాడే అవకాశం ఉందని సమాచారం..

  First published:

  ఉత్తమ కథలు