AP Municipal Elections: ఓటర్ల జాబితాలో హీరో వెంకటేష్... కలెక్టర్ రియాక్షన్ ఇదే..

కర్నూలు ఓటర్ లిస్టులో హీరో వెంకటేష్ ఫోటో

Andha Pradesh: మున్సిపల్ ఎన్నికల (Municipal Elections) సందర్భంగా అధికారుల తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఓటర్ కార్డుపై (Voter ID) హీరోల ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి.

  • Share this:
    ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం స్థానిక సంస్థల ఎన్నికల సందడి నెలకొంది. ఈ నేపథ్యంలో కొన్ని ప్రాంతాల్లో వెరైటీ ఓటర్ కార్డులు బయటపడుతున్నాయి. సినిమా హీరోహీరోయిన్ల పేర్లతో ఓటర్ కార్డులు వెలుగు చూసిన ఘటనలు గతంలో చాలా చోటు చేసుకున్నాయి. మున్సిప్ల ఎన్నికల సందర్భంగా కర్నూలు జిల్లాలో అలాంటి ఘటనో వెలుగులోకి వచ్చింది. ఐతే ఏడాది క్రితమే ఈ విషయంపై అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. వివరాల్లోకి వెళ్తే కర్నూలు పట్టణంలోని 31వ వార్డుకు ఓటర్ జాబితాలో చెందిన రాణి కొమరూలు అనే మహిళకు చెందిన వివరాల్లో హీరో వెంకటేష్ ఫోటో దర్శనమిచ్చింది. ఐతే గత ఏడాది మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన సందర్భంలో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. కానీ అప్పటి నుంచి సమస్య పరిష్కారం కాకుండానే ఉంది.

    తాజాగా ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కావడంతో ఓటర్ లిస్టులో వెంకటేష్ ఫోటో చర్చనీయాంశమవుతోంది. ఏడాదిగా అధికారులు తప్పును సరిదిద్దకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. ఐతే ఈ ఘటనపై జిల్లా కలెక్టర్ వీరపాండియన్ స్పందించారు. ఘటనపై వెంటనే విచారణ జరిపి నివేదిక అందించాలని కర్నూలు ఆర్డీవో వెంకటేశులును ఆదేశించారు. అలాగే సంబంధిత వార్డు ఓటర్ లిస్టు లిస్ట్ ఇన్ ఛార్జ్, బీఎల్ఏపై చర్యలు తీసుకోవాలని ఆర్డీవో, తహసీల్దార్ ను ఆదేశించారు.

    ఇది చదవండి: అంతర్వేదిలో నూతన రథాన్ని ప్రారంభించిన సీఎం జగన్..


    గతేడాది ఫిబ్రవరిలో జగనన్న విద్యాదీవెన కార్డుపై విద్యార్థిని ఫోటో బదులు టాలీవుడ్ హీరో మహేష్ బాబు ఫోటో ఉండటం కలకలం రేపింది. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో లక్ష్మీ అనే విద్యార్థికి అధికారులు ఇష్యూ చేసిన విద్యా దీవెన కార్డులో మహేష్ బాబు ఫోటో చూసి కుటుంబసభ్యులు అవాక్కయ్యారు

    ఇది చదవండి: కౌంటింగ్ వీడియో తీయాల్సిందే... ఎస్ఈసీ నిమ్మగడ్డ కీలక ఆదేశాలు



    ఇక గత ఏడాది డిసెంబర్ లో బీహార్ రాష్ట్రంలోని బీఆర్ అంబేడ్కర్ బీహార్ యూనివర్సిటీకి అనుబంధంగా మీనాపూర్‌లో ఉన్న ధన్‌రాజ్ మహతో డిగ్రీ కాలేజీలో ఓ విద్యార్థి హాల్ టికెట్ పై తల్లిపేరు సన్ని లియోన్ గా ప్రింట్ అయింది. కాలేజీలో డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్న కుందన్ కుమార్ అనే విద్యార్థి తల్లి సన్ని లియోన్ అని రాసి ఉంది. అప్పట్లో ఈ విషయం వైరల్ గా మారడంతో అధికారులు విచారణ జరిపారు. కుందన్ కుమారే కావాలని తండ్రి పేరు రాయాల్సిన చోట బాలీవుడ్ హీరో ఇమ్రాన్ హష్మీ పేరు రాయగా.. తల్లి పేరును సన్నీలియోన్ గా రాశాడు.
    Published by:Purna Chandra
    First published: