జగన్‌కు వ్యతిరేకంగా భారీ కుట్ర.. టాలీవుడ్ హీరో సంచలన ట్వీట్..

ఏపీ ముఖ్యమంత్రి వై.యస్.జగన్మోహన్ రెడ్డికి ఇస్మార్ట్ హీరో రామ్ ట్విట్టర్ వేదికగా సలహా ఇవ్వడం ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వివారల్లోకి వెళితే..

news18-telugu
Updated: August 15, 2020, 2:43 PM IST
జగన్‌కు వ్యతిరేకంగా భారీ కుట్ర.. టాలీవుడ్ హీరో సంచలన ట్వీట్..
సీఎం జగన్(ఫైల్ ఫోటో)
  • Share this:
ఏపీ ముఖ్యమంత్రి వై.యస్.జగన్మోహన్ రెడ్డికి ఇస్మార్ట్ హీరో రామ్ ట్విట్టర్ వేదికగా సలహా ఇవ్వడం ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వివరాల్లోకి వెళితే.. ఈ రోజు దేశ ప్రజలందరూ 74వ స్వాతంత్య్ర దినోత్సవం జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఏపీ సీఎం జగన్.. వరుసగా రెండోసారి ముఖ్యమంత్రి హోదాలో జాతీయ పతాకం ఎగరవేసారు. ఈ సందర్భంగా వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా హీరో రామ్ పోతినేని ట్విట్టర్ వేదికగా ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఒక విన్నపం చేసారు.


ఈ సందర్భంగా రామ్ తన ట్విట్టర్‌లో గౌరవనీయులైన ముఖ్యమంత్రి జగన్ గారు మీ వెనక పెద్ద కుట్ర జరుగుతున్నట్టుంది. మిమ్మల్ని తప్పుగా చూపించడానికి మీ కింద పనిచేసే కొంత మంది మీకు తెలియకుండా చేసే కొన్ని పనులు వల్ల మీ రెప్యుటేషన్ కీ, మీ మీద పెట్టుకున్న నమ్మకానికి డ్యామేజ్ కలుగుతోంది. వాళ్లపై మీరు ఓ లుక్కేస్తారని ఆశిస్తున్నాం అంటూ రామ్ ట్వీట్ చేసాడు. ఐతే.. హీరో రామ్ పోతినేని ఎవరిని ఉద్దేశించి ఈ ట్వీట్ చేసాడా అని రాజకీయ, సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.



విజయవాడ స్వర్ణప్యాలెస్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో  10 మంది చనిపోయిన విషయం తెలిసిందే. ఈ హోటల్‌ను అద్దెకు తీసుకుంది రమేష్ ఆస్పత్రి. ఆ రమేష్ ఆస్పత్రి యాజమాన్యం హీరో రామ్ పోతినేనికి బంధువులు. స్వర్ణ ప్యాలెస్‌లో ప్రమాదానికి రమేష్ ఆస్పత్రి యాజమాన్యాన్ని బాధ్యుల్ని చేస్తూ కృష్ణా జిల్లా జేసీ (2) 200 పేజీల నివేదికను కలెక్టర్ ఇంతియాజ్‌కు అందించారు. ఈ క్రమంలో రమేష్ ఆస్పత్రికి ఇచ్చి న కరోనా ట్రీట్మెంట్ లైసెన్స్‌ను ప్రభుత్వం విత్ డ్రా చేసింది. దీంతో ఇకపై రమేష్ ఆస్పత్రి కరోనా పేషెంట్లకు ట్రీట్మెంట్ చేసే వీలు లేదు.





అయితే, ఈ ఘటనకు సంబంధించి ఆస్పత్రి యజమాని రమేష్ ఓ ఆడియో టేప్‌ను కొన్ని టీవీ చానల్స్‌కు రిలీజ్ చేశారు. ప్రభుత్వం ఘటన జరిగిన స్వర్ణ ప్యాలెస్ మీద చర్యలు తీసుకోకుండా ఆస్పత్రి మీద కక్షసాధిస్తోందనే విధంగా వ్యాఖ్యలు చేశారు.అంతకు ముందు అక్కడ ప్రభుత్వం ఆధ్యర్యంలో క్వారంటైన్ సెంటర్ నడిపించారు. అపుడు జరిగి ఉంటే ఎవరి మీద చర్యలు తీసుకునేవాళ్లు అంటూ ప్రశ్నించాడు. అందరినీ ఫూల్స్ చేయడానికే విషయాన్ని ఫైర్ నుంచి రమేష్ హాస్పిటల్ ఎక్కువ ఫీజులు వసూలు చేస్తుందంటూ ఆ  వైపు దృష్టి మళ్లిస్తున్నారా అంటూ ట్వీట్ చేయడం హాట్ టాపిక్‌గా మారింది. ఈ క్రమంలో కొందరు జగన్ వద్ద పనిచేసే అధికారులే ముఖ్యమంత్రిని తప్పుదోవ పట్టిస్తున్నారని హీరో రామ్ భావిస్తున్నారు.
Published by: Kiran Kumar Thanjavur
First published: August 15, 2020, 2:34 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading