NBK: బాలకృష్ణ పెద్దమనసు... అభిమానికి ఫోన్ లో పరామర్శ.. గతాన్ని గుర్తు చేసుకున్న బాలయ్య

అభిమానిని ఫోన్ లో పరామర్శించిన బాలయ్య

బాలయ్య మరోసారి పెద్ద మనసు చాటుకున్నారు. ప్రమాదంలో కాలు పోగుటుకున్న అభిమానిని ఫోన్ లో పరామర్శించి ధైర్యం చెప్పారు. ఆర్థిక సాయం అందిస్తానని భరోసా కల్పించారు. ఇప్పటికే కొంత ఆర్థిక సాయం అందేలా చేశారు.

 • Share this:
  నందమూరి బాలకృష్ణ  రూటే సపరేటు.. ఎంత ఆవేశం ఉందో అంతే మంచితనం ఉంది అంటారు ఆయనకు తెలిసినవాళ్లు.. సాధారణంగా సోషల్ మీడియాలో అభిమాని చెంప చెళ్లుమనింపించిన బాలయ్య అంటూ తరచూ వార్తలు వింటూంటాం.. అయినా అభిమానులు బాలయ్య చెయ్యి వేసినా హ్యాపీగానే ఫీలవుతారు. ఎందుకంటే ఆయన చూపించే ప్రేమ అలాంటింది అంటారు ఆయన ఫ్యాన్స్. బాలయ్యను తమ గుండెల్లో పెట్టుకుని పూజ చేస్తారు. బాలయ్య అభిమానులను చాలా ప్రేమగా చూసుకుంటారు. అందుకు తాజా ఘటనే నిదర్శనం. కొద్ది రోజుల కిందట చెట్టు మీద నుంచి కిందకు పడటంతో నడుముకు తీవ్ర గాయమై మంచానికే పరిమితమైన తన అభిమానికి నేరుగా ఫోన్‌ చేసి ధైర్యం చెప్పారు. అన్ని విధాలా ఆ కుటుంబానికి అండగా ఉంటామని ధైర్యం చెప్పారు. ఆయన ఫోన్ చేసిన ఆడియో కాల్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది..

  చిత్తూరు జిల్లా శాంతిపురం మండలం గొల్లపల్లికి చెందిన 23 ఏళ్ల మురుగేష్ తో బాలయ్య ఆప్యాయంగా మాట్లాడారు. అభిమాని బాగోగులు, ఆర్థిక పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. తాను మంచానికే పరిమితమవడంతో తల్లి కూలి పనులకు వెళ్లాల్సి వస్తుందంటూ అభిమాని బాలయ్యతో తన బాధ పంచుకున్నారు. వెంటనే స్పందించిన బాలకృష్ణ... తక్షణమే 40 వేల రూపాయల ఆర్థిక సాయాన్ని మురుగేష్‌కు అందేలా చేశారు.

  ఆయన ఫోన్ లో ఏం మాట్లాడారు అంటే... గతంలో తనకు జరిగిన ప్రమాదాలను బాలకృష్ణ అభిమానితో పంచుకున్నారు. ఆదిత్య 369 సినిమా షూటింగ్‌ సమయంలో ప్రమాదం జరగడంతో నడుముకు తీవ్ర గాయమైందని, ధైర్యంగా ఉండటంతో తిరిగి కోలుకున్నానని గతం గుర్తు చేస్తూ మురుగేష్‌కు ధైర్యం చెప్పారు. అలాగే తన వీరాభిమాని ఆరోగ్య పరిస్థితిపై పూర్తి ఆరా తీశారు.

  ఇదీ చదవండి: సార్ మీ కాళ్లు మొక్కుతా అలా చేయండి.. కమిషనర్ కు లేఖ వెంటనే బలవన్మరణం

  మురుగేష్ చిన్నప్పటి నుంచి నందమూరి కుటుంబానికి విరాభిమాని.. ఇక బాలయ్య బాబుకు ప్రాణ అభిమాని.. నిత్యం బాలయ్యాను దైవంగా భావిస్తూ.. ఆయన ఆలోచనల్లోనే ఉంటాడు. నెల రోజుల కిందట జీవనోపాధి కోసం శాంతిపురం మండలం గొల్లపల్లి గ్రామానికి చెందిన మురుగేష్ టెంకాయ చెట్టు మీద నుండి ప్రమాదవశాత్తు కాలుజారి పడిపోయాడు. ఆ ప్రమాదంలో అతడి కాళ్లు విరిగాయి. చికిత్స చేసుకోవడానికి శక్తికి మించిన బాధ కావడంతో అప్పులు చేసినా.. వైద్యానికి సరిపడంత దొరకలేదు. దీంతో మురుగేష్ ను ఇంట్లో పెట్టుకునే చూసుకుంటున్నారు అక్క, అమ్మ.

  ఇదీ చదవండి: జాతీయ రాజకీయాల్లో మోదీకి వ్యతిరేక కూటమి.. ప్రశాంత్ కిషోర్ ప్లాన్ వర్కౌట్ అయ్యేనా

  ప్రాణాపాయ స్థితిలో ఉన్న అతడికి సహాయంగా, ఆ కుటుంబానికి తోడుగా కుప్పం నందమూరి, బాలకృష్ణ తారక్ ఫ్యాన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అధ్యక్షుడు శివ రాయల్.. అభిమాని మురుగేష్ ఇంటికి వెళ్లి 20,000 రూపాయల ఆర్థిక సాయం చేశారు.  మళ్ళీ రెండో సారి NBK పుట్టినరోజు నాడు మరో 25,000 వేల రూపాయల ఆర్థిక సహాయం అందించారు. wheel ఛైర్ కూడా అందచేశారు.

  ఇదీ చదవండి: NDAలోకి వైసీపీ.. విజయసాయికి మంత్రి పదవి..! ఢిల్లీలో మారుతున్న రాజకీయం

  ఈ విషయం తెలుసుకున్న నందమూరి బాలకృష్ణ ఆదివారం ఫోన్ కాల్ ద్వారా బాలయ్య అభిమానికి ఆత్మ ధైర్యాన్ని ఇవ్వడమే కాక త్వరలో తాను కూడా ఆర్థిక సాయం చేస్తానని  చెప్పారు.  స్వయంగా బాలయ్యే ఫోన్ చేసి ఆరోగ్య, ఆర్థిక, స్థితిగతులను తెలుసుకోవడంతో బాలయ్య అభిమానులు ఆనందం వ్యక్తం చేశారు.
  Published by:Nagesh Paina
  First published: