Bala Krishna On New Districts: టాలీవుడ్ హీరో.. హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) తాజాగా సీఎం జగన్ మోహన్ రెడ్డి (CM Jagan Mohan Reddy) నిర్ణయానికి జై కొట్టారు. సాధారణంగా జనగ్ ఏ నిర్ణయం తీసుకున్నా టీడీపీ నేతలు (TDP Leaders) విమర్శలు చేయడం ఇటీవల చూస్తూ ఉంటాం. ఏపీలో కొత్త జిల్లాల (AP News Districts) ఏర్పాటు ప్రక్రియపై ఇప్పటికే ఒక్క టీడీపీ నేత కూడా స్పందించలేదు.. కానీ బాలయ్య మాత్రం కొత్త జిల్లాల ఏర్పాటుపై మనసులో మాట బయటపెట్టారు.. ఒక్కో పార్లమెంట్ సెంగ్మెంట్ ను జిల్లాలుగా మార్చాలని జగన్ తీసుకున్న నిర్ణయం సరైందే అని అభిప్రాయపడ్డారు.. కొత్త జిల్లాల ఏర్పాటు విషయంలో ఎవరూ రాజకీయాలు చేయొద్దని.. సొంత పార్టీ నేతలకు ఆయన పరోక్షంగా సూచనలు చేశారు.. అలాగే మరో కొత్త డిమాండ్ వినిపించారు.
అనంతపురం జిల్లాలో హిందూపురం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని బాలకృష్ణ అన్నారు. వాణిజ్య పరంగా, పారిశ్రామిక పరంగా కూడా హిందూపురం అభివృద్ధి చెందిన విషయం అందరికీ తెలిసిందేనని చెప్పారు. అందుకే హిందూపురం పార్లమెంట్‌ను జిల్లా కేంద్రాన్ని ప్రకటిస్తూ.. శ్రీ సత్యసాయి జిల్లాగా నామకరణం చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. హిందూపురం పట్టణ పరిసరాల్లో ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటు కోసం ప్రభుత్వ భూమి పుష్కలంగా ఉందని చెప్పారు బాలయ్య సూచించారు.
ఇదీ చదవండి : ఉద్యోగులను సమ్మెకు వెళ్లనీయం.. నాలుగు మెట్లుదిగేందుకు సిద్ధం
అయితే బాలయ్య ముఖ్యంగా ఎన్టీఆర్ జిల్లాపై ఎలా స్పందిస్తారో అని నందమూరి అభిమానులు అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటి వరకు ఎన్టీఆర్ కుటుంబం నుంచి ఆయన కూరుతు పురందేశ్వరి మాత్రమే ఎన్టీఆర్ పేరును జిల్లాకు పెట్టడానికి స్వాగతించారు. నందమూరి కుటుంబం నుంచి ఒక్కరు కూడా మాట్లడలేదు. ఈ నేపథ్యంలో బాలయ్య ఏం చెబుతారని అంతా ఎదురు చూశారు. కానీ బాలయ్య మాత్రం ఎక్కడా తన తండ్రి ఎన్టీఆర్ ప్రస్తావన.. ఆయన పేరుతో జిల్లా ఏర్పాటు గురించి మాట్లాడలేదు.. దీంతో నందమూరి అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు..
Balayya on New Districts|| జగన్ కు జై కొట్టిన బాలయ్య.. తండ్రి పేరు ప్రస్... https://t.co/xvszYImlG5 via @YouTube #Balayya #AkhandaMassJathara #Jagan #JaganShouldApologizeToNTR @NANDAMURIKALYAN @Mokshagna_Offl @NTarakarathna
— nagesh paina (@PainaNagesh) January 27, 2022
ఎన్నికల ప్రచారం సమయంలో సీఎం జగన్ ఇచ్చిన హామీ ప్రకారం విజయవాడకు ఎన్టీఆర్ జిల్లా పేరు పెట్టారు. అయితే ఈ నిర్ణయంపై ఇప్పటి వరకు టీడీపీ నేతలు స్పందించలేదు. ఇటు నందమూరి కుటుంబ సభ్యులు కూడా మాట్లాడలేదు. ఇప్పటి వరకు కేవలం పురందేశ్వరి ఒక్కరే సోషల్ మీడియా ద్వారా తన అభిప్రాయం చెప్పారు..
ఆ మహనీయుడు నందమూరి తారక రామారావు గారు పుట్టిన జిల్లాకి ఎన్టీఆర్ జిల్లా అని పేరు పెట్టడం, ఆయన బిడ్డగా నేను స్వాగతిస్తున్నాను.
ప్రజాభీష్టం ఈ నాటికీ నెరవేరింది.
జై ఎన్టీఆర్!!! pic.twitter.com/r4pbKKrled
— Daggubati Purandeswari ?? (@PurandeswariBJP) January 26, 2022
మహనీయుడు నందమూరి తారక రామారావు పుట్టిన జిల్లాకు ఎన్టీఆర్ జిల్లా అని పేరు పెట్టడాన్ని ఆయన బిడ్డగా తాను స్వాగతిస్తున్నట్టు ఆమె చెప్పారు. ప్రజాభీష్టం ఈ నాటికి నెరవేరిందని ఆమె ట్వీట్ చేశారు.
(Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP new districts, AP News, Hindupuram, Nandamuri balakrishna