Home /News /andhra-pradesh /

TOLLYWOOD HERO BALAKRISHNA SENSATIONAL COMMENTS ON AP GOVERNMENT AND ONLINE TICKETS ISSUE NGS

Balakrishna: ప్రభుత్వం తీరుపై బాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే?

సినిమా ఇండస్ట్రీపై బాలయ్య సంచలన వ్యాఖ్యలు

సినిమా ఇండస్ట్రీపై బాలయ్య సంచలన వ్యాఖ్యలు

Balakrishna on AP Government: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీరుపై బాలయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. చాలారోజుల నుంచి టికెట్ల వ్యవహారం దుమారం రేపుతున్నా.. ఇంతకాలం సైలెంట్ గా ఉన్న ఆయన.. అఖండ సక్సెస్ మీట్ లో కీలక వ్యాఖ్యలు చేశారు.

    Balakrishna On Andhra Pradesh Government:  ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ప్రభుత్వం తీరుపై సినిమా హీరో బాలకృష్ణ (Hero Balakrishna) సంచలన వ్యాఖ్యలు చేశారు.  టాలీవుడ్ (Tollywood) సమస్యలపై పట్టించుకునే నాధుడే లేరని ఆవేదన వ్యక్తం చేశారు.. ఏపీలో సినిమా టికెట్ల వ్యవహారం (Tickets Issue) పై ఇండస్ట్రీ అంతా కలిసికట్టుగా పోరాడాలి అని పిలుపు ఇచ్చారు.. రెండు తెలుగు ప్రభుత్వాలు సినిమా రంగానికి సహకరించాలని కోరారు.. సినిమా టికెట్ల ధరపై ఏపీ ప్రభుత్వం (AP Government) ఎలాంటి నిర్ణయం తీసుకున్నా తాను కట్టుబడి ఉంటాను అన్నారు. అలాగే ఏపీ ప్రభుత్వం  చెబుతున్నట్టు చిన్న సినిమా, పెద్ద సినిమా అని తేడాలు ఉండవు అన్నారు.  పెద్ద సినిమా ప్లాప్ (Flop Movie) అయితే చిన్న సినిమా అంటారాని.. చిన్న సినిమా హిట్ (Super Hit Movie) అయితే పెద్ద సినిమా అంటారు అంటూ వ్యాఖ్యనించారు.

    ఆంధ్రప్రదేశ్ లో టికెట్ల వ్యవహారం త్వరలోనే కొలిక్కి వస్తుందని తాను ఆశాభావం వ్యక్తం చేశారు. ఎవరో ఒకరు ముందుకు వచ్చి పరిశ్రమ సమస్యలను ప్రభుత్వానికి చెప్పాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. తెలుగు సినిమా మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్ధిల్లాలి అని అభిప్రాయపడ్డారు. ఇండస్ట్రీపై లక్షలాది మంది ఆధారపడుతున్నారని.. వారి అందిరికీ ఉపాధి లభించాలి అన్నారు.. దానికి ఏపీ, తెలంగాణ రెండు ప్రభుత్వాలు సహకరించాలని ఆయన మరోసారి కోరారు.

    ఇదీ చదవండి : మత్య్సకారుల పంట పండిస్తున్న చేపలు.. ఈ కచ్చిలి చేప ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..?

    అయితే గత కొంతకాలంగా ఏపీలో సినిమా టికెట్ల వ్యవహారంపై దుమారం రేగుతోంది. సినిమా హీరోలు పవన్ కళ్యాణ్, నాని లాంటి వారు నేరుగా ప్రభుత్వంపై విమర్శలు చేశారు. మెగాస్టర్ చిరంజీవి ట్విట్టర్ వేదికగా ప్రభుత్వానికి వినతలు చేశారు. పునరాలోచన చేయాలని కోరారు. ఇక హీరో సిద్ధార్ధ్ సైతం ప్రభుత్వం తీరుప ట్విట్టర్  లో విమర్శలు చేశారు..

    ఇదీ చదవండి : పోలీసులకు దొరక్కుండా ఆన్ లైన్ జోరుగా వ్యవహరం.. ఎలా చేస్తున్నారంటే..?

    ఇక సినిమా ఇండస్ట్రీ నుంచి కొందరు దర్శకులు, నిర్మాతలు సైతం ఆసహనం వ్యక్తం చేశారు. ప్రభుత్వం తీరును తప్పు పట్టారు ఎవరూ నేరుగా మాట్లాడలేదు. అయితే వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అయితే సోషల్ మీడియా వేదిక రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శల వర్షం కురిపించారు. తరువాత మంత్రి పేర్ని నాని అపాయింట్ మెంట్ ఇవ్వడంతో నేరుగా సచివాలయానికి వెళ్లి.. ఆయనతో చర్చలు చేశారు.. ఓ ఫిల్మ్ మేకర్ గా తన అభిప్రాయాలు చెప్పాను అన్నారు.. అలాగే మంత్రి తో సమావేశం సంతోషం వ్యక్తం చేశారు..

    ఇదీ చదవండి : చిరంజీవి వల్లే సీఎం కాలేకపోయాను.. చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు

    అయితే అక్కడితోనే వర్మ ఆగలేదు.. తరువాత మళ్లీ వరుసగా ట్విట్టర్ల వర్షం కురిపించారు. జాతీయ స్థాయికి ఇష్యూను తీసుకెళ్తాను అంటూ పరోక్షంగా చెప్పారు. మరోవైపు సినిమా ధరలపై సమావేశమైన కమిటీ.. సుదీర్ఘంగా చర్చించింది.  అభిమానుల సంఘాలు, డిస్ట్రిబ్యూటర్లు, నిర్మాతలు, ఇతర నిపుణుల అభిప్రాయాలు సేకరించింది. త్వరలోనే టికెట్ల ధరలపై నివేదికను ప్రభుత్వానికి అందచేయనుంది.

    (Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
    Published by:Nagabushan Paina
    First published:

    Tags: Andhra Pradesh, AP News, Bala Krishna Nandamuri, Tollywood

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు