టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రజెంట్ పుష్ప షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఆంధ్రప్రదేశ్, తూర్పుగోదావరి జిల్లాలోని మారేడుమిల్లి అడవుల్లో పుష్ప చిత్రీకరణ జరుగుతోంది. ప్రస్తుతం బన్నీ అక్కడే ఉన్నాడు. కొన్నిరోజులుగా పుష్ప యూనిట్ అక్కడే షూటింగ్ జరుపుతున్నా బన్నీ మాత్రం ఉదయం వచ్చి సాయంత్రం సైలెంట్ గా వెళ్లిపోతున్నారు.ఐతే రంపచోడవరం ప్రాంతంలో షూటింగ్ ముగించుకొని వస్తున్న అల్లు అర్జున్ కు తాళ్లపాలెం గిరిజనులు ఊహించని విధంగా స్వాగతం పలికారు. స్టైలిష్ స్టార్ పై పూలవర్షం కురిపించిన స్థానికులు.., ఆయనకు హారతులిచ్చి, దిష్టికూడా తీశారు. వారి అభిమానానికి ఫిదా అయిన అల్లు అర్జున్.. వారికి అభివాదం చేస్తూ వెళ్లాడు
వీలైనంత త్వరగా పుష్ప షూటింగ్ కంప్లీట్ చేయాలని బన్నీతో పాటు డైరెక్టర్ సుకుమార్ భావిస్తున్నారు. అందుకే సంక్రాంతి సెలవులు కూడా తీసుకోకుండా మారేడుమిల్లి ఫారెస్ట్ లోనే చిత్రీకరణ జరుపుతున్నారు. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అయిన వెంటనే ఫారెస్ట్ లో అడుగుపెట్టిన బన్నీ అప్పటి నుంచి షూటింగ్ లో బిజీగానే ఉన్నారు. ఇటీవలే హీరోని హైలెట్ చేస్తూ సాంగ్ ను షూట్ చేసినట్లు తెలుస్తోంది.
ప్రజెంట్ హీరో హీరోయిన్లకు సంబంధించిన సీన్స్ మాత్రమే తెరకెక్కిస్తున్నారు దర్శకుడు సుకుమార్… ఫిబ్రవరి మొదటి వారం వరకు ఈ కాంబినేషన్‌లోనే మేజర్ షూటింగ్ ఉంటింది. ఈ షెడ్యూల్ పూర్తైన తర్వాత హీరో విలన్ మధ్య సీన్లు తెరకెక్కించనున్నారు. ఈలోగా విలన్ ను ఎంపిక చేయనున్నారు.
ఇందులో విలన్ గా ఇప్పటికే చాలా మంది పేర్లు వినిపించాయి. తమిళ నటుడు విజయ్ సేతుపతి సినిమా నుంచి తప్పుకోవడంతో ఆ తర్వాత బాబీ సింహా, విక్రమ్, ఆర్య విలన్ గా నటిస్తున్నట్లు వార్తలొచ్చాయి. బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టిని కూడా చిత్రబృందం ట్రై చేస్తున్నట్లు తెలుస్తోంది. కాగా ఈ సినిమాలో బన్నీ సరసన రష్మిక హీరోయిన్ గా నటిస్తోంది. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Allu Arjun, Andhra Pradesh, Andhra pradesh news, Pushpa Movie, Rashmika mandanna, Sukumar, Sunil Shetty, Tollywood, Tollywood Cinema, Vijay Sethupathi