Home /News /andhra-pradesh /

TOLLYWOOD DIRECTOR RAGHAVENDRA RAO SENSATIONAL TWEET TO CM JAGAN FOR ONLINE TICKETS NGS

AP Government Vs Tollywood: సీఎం జగన్ నిర్ణయాన్ని తప్పు పట్టిన దర్శకేంద్రుడు.. ఆలోచించండి అంటూ సంచలన ట్వీట్

రాఘవేంద్ర రావు సంచలన ట్వీట్

రాఘవేంద్ర రావు సంచలన ట్వీట్

Raghavenra Rao tweet: టాలీవుడ్ దర్శకేంద్రుడు సంచలన ట్వీట్ చేశారు. సీఎం జగన్ నిర్ణయాన్ని ఆయన తప్పు పట్టారు. ఆ విషయంలో మరోసారి ఆలోచించాలి అని కోరారు.. కానీ ఏపీ ప్రభుత్వం టాలీవుడ్ సూచనలను చాలా లైట్ తీసుకుంది..

    AP Government vs Tollywood:  ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) వర్సెస్ టాలీవుడ్ (Tollywood) వివాదం రోజు రోజుకూ ముదురుతూనే ఉంది. సినిమా టికెట్ల ధరలపై (AP Movie Tickets Issue) వివాదం చిలికి చిలికి గాలివానగా మారి.. చివరికి ఏపీ ప్రభుత్వం ఏకపక్షంగా తాను అనుకున్నట్టే రేట్లను నిర్ణయించింది.  ఏపీ ప్రభుత్వం (AP Government) తీసుకొచ్చిన చట్టసవరణతో అదనపు షోలు రద్దు కావడంతో పాటు టికెట్ ధరలు కూడా తగ్గించింది.  ఆ మధ్య  మెగాస్టార్ చిరంజీవి (Mega Star Chiranjeevi) సినిమా టికెట్ల ధరలపై పునరాలోచించుకోవాలని  ఏపీ ప్రభుత్వానికి, సీఎం జగన్ (CM YS Jagan) కు ట్విట్టర్ ద్వారా విజ్ఞప్తి చేశారు.  తరువాత  బడా ప్రొడ్యూసర్ సురేష్ బాబు కీలక వ్యాఖ్యలు చేశారు.  ఏపీ ప్రభుత్వం తీరును ఆయన తప్పు పట్టారు.  కానీ ఆవేవి పట్టించుకోకుండా ఏపీ ప్రభుత్వం ముందుకే వెళ్లింది కొత్త రేట్లను నిర్ణయించింది.

    ఏపీ ప్రభుత్వ నిర్ణయం.. టాలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. ఆన్‌లైన్ టికెటింగ్ సిస్టం వల్ల థియేటర్స్ యాజమాన్యం, డిస్ట్రిబ్యూటర్లు, నిర్మాతలు నష్టపోతారని పలువురు ఇండస్ట్రీ పెద్దలు కామెంట్స్ చేస్తున్నారు. ఈ తరుణంలో తాజాగా దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు ఏపీ ప్రభుత్వానికి ఓ సంచలన లేఖ రాశారు. టాలీవుడ్ ఇండస్ట్రీకి ఏపీ ప్రభుత్వం తగిన న్యాయం చేయాలంటూ పేర్కొన్నారు. ప్రేక్షకులు, థియేటర్ యాజమాన్యం, డిస్ట్రిబ్యూటర్లు, నిర్మాతలు.. ఇలా అందరూ బాగుంటేనే ఇండస్ట్రీ బాగుటుంది అని ట్వీట్ చేశారు.



    ఇదీ చదవండి : ఏపీని వెంటాడుతున్న ముప్పు.. దూసుకొస్తున్న జవాద్‌.. 3 నుంచి 5 వరకు భారీ వర్షాలు

    ప్రస్తుతం టికెట్లు, షోస్‌పై తీసుకున్న నిర్ణయం చాలామందికి నష్టం చేకూరుస్తుందన్నారు. ఆన్‌లైన్ సిస్టం వల్ల దోపిడీ ఆగిపోతుందని అనుకోవడం కరెక్ట్ కాదన్నారు. కామన్ మాన్‌కు సినిమా ఒకటే ఎంటర్టైన్మెంట్ ట్విట్టర్ లో పేర్కొన్నారు. ప్రేక్షకుడు ఒక మంచి సినిమా చూడాలనుకుంటే 300 లేదా 500 అయినా పెట్టి మరీ చూస్తారని గుర్తు చేశారు. టికెట్ రేటు ఎంత తక్కువ ఉన్నా అతడికి నచ్చని సినిమా చూడడన్నారు.  అదే రేట్లు పెంచి ఆన్‌లైన్‌లో అమ్మితే థియేటర్స్ వల్ల ప్రభుత్వానికి ట్యాక్స్ వస్తుందని గుర్తు చేశారు. ఈ అంశాలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం తగిన న్యాయం చేయాలని ట్విట్టర్ లో అని రాఘవేంద్రరావు లేఖలో పేర్కొన్నారు.

    ఇదీ చదవండి : ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోముకు చెక్ పెడుతున్నారా..? వైసీపీతో ఫ్రెండ్ షిప్పే కారణమా..?

    ఏపీలో టికెట్ల రేట్లు ఇవే..                                                                                         ఇలా ఎంతమంది ఎన్ని సూచనలు చేసినా.. ఏపీ ప్రభుత్వం ముందుకే వెళ్లింది.  ఏపీలో సినిమా టికెట్లకు సంబంధించిన కొత్త ధరలను ప్రభుత్వం ప్రకటించింది. సినిమా టికెట్ల ధరలను ఫిక్స్ చేసిన ప్రభుత్వం.., బెనిఫిట్ షోలకు మాత్రం అనుమతిచ్చేది లేదని స్పష్టం చేసింది. మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీలకు, గ్రామ పంచాయతీలకు ప్రాంతాల వారీగా సినిమా టికెట్ల ధరను నిర్ణయించింది. ఈ మేరకు ధరలను విడుదల చేసింది. కొత్త ధరల ప్రకారం టికెట్ ధర రూ.5 నుంచి రూ.250 వరకు నిర్ణయించింది. మున్సిపల్ కార్పొరేషన్లు: మల్టీప్లెక్సు- ప్రీమియం రూ.250, డీలక్స్ రూ.150, ఎకానమీ రూ.75, ఏసీ/ఎయిర్ కూల్- ప్రీమియం రూ.100, డీలక్స్ రూ.60, ఎకానమీ రూ.40, నాన్ ఏసీ- ప్రీమియం రూ.60, డీలక్స్ రూ.40, ఎకానమీ రూ.20 గ్రామ పంచాయతీలు: మల్టీప్లెక్స్- ప్రీమియం రూ.80, డీలక్స్ రూ.50, ఎకానమీ రూ.30, ఏసీ/ఎయిర్ కూల్- ప్రీమియం రూ.20, డీలక్స్ రూ.15, ఎకానమీ రూ.10, నాన్ ఏసీ- ప్రీమియం రూ.15, డీలక్స్ రూ.10, ఎకానమీ రూ.5గా నిర్ణయించారు.
    Published by:Nagabushan Paina
    First published:

    Tags: Andhra Pradesh, Ap cm jagan, AP News, Director Raghavendra Rao, Tollywood

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు