బీజేపీ ఆఫీసుకు అలీ... ఎందుకో తెలుసా...

టాలీవుడ్ స్టార్ కమెడియన్, వైసీపీ నేత అలీ ఉన్నట్టుండి బీజేపీ ఆఫీసుకు వెళ్లారు.

news18-telugu
Updated: January 24, 2020, 1:03 PM IST
బీజేపీ ఆఫీసుకు అలీ... ఎందుకో తెలుసా...
అలీ (File/Photo)
  • Share this:
టాలీవుడ్ స్టార్ కమెడియన్, వైసీపీ నేత అలీ ఉన్నట్టుండి బీజేపీ ఆఫీసుకు వెళ్లారు. అది కూడా ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయం. దీంతో అలీ పార్టీ మారతారేమో అనే ఊహాగానాలు జోరందుకున్నాయి. అయితే అసలు తాను బీజేపీ ఆఫీసుకు ఎందుకు వచ్చాననే అంశంపై అలీ స్పందించారు. ఓ హాలీవుడ్ డైరెక్టర్ త్వరలోనే ఇండియా రాబోతున్నారని తెలిపిన అలీ... ఆయన ప్రధాని మోదీని కలిసేందుకు ఉత్సాహం చూపిస్తున్నారని వివరించారు. ఇందుకోసం ప్రధాని మోదీ అపాయింట్‌మెంట్ ఇప్పించాలని కేంద్రమంత్రి ప్రకాష్ జవదేకర్‌ను అలీ కోరారు. ఇందుకు కేంద్రమంత్రి సానుకూలంగా స్పందించినట్టు తెలుస్తోంది.




First published: January 24, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు