జగన్‌తో టాలీవుడ్ పెద్దల భేటీకి బ్రేక్...

ఏపీ సీఎం జగన్‌తో జరగాల్సిన టాలీవుడ్ పెద్దల సమావేశం వాయిదా పడినట్టు తెలుస్తోంది.

news18-telugu
Updated: June 2, 2020, 9:46 PM IST
జగన్‌తో టాలీవుడ్ పెద్దల భేటీకి బ్రేక్...
చిరంజీవి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి (ఫైల్ ఫోటో)
  • Share this:
తెలంగాణ సీఎం కేసీఆర్‌తో సమావేశమైన టాలీవుడ్ ప్రముఖులు ఇండస్ట్రీ సమస్యలపై ఆయనతో చర్చించారు. షూటింగ్స్‌కు అనుమతి, ధియేటర్లు తెరిపించడం సహా పలు అంశాలపై కేసీఆర్‌తో చర్చించారు. వారి సమస్యలు పరిష్కరించేందుకు తెలంగాణ సీఎం కూడా సానుకూలంగానే స్పందించారు. తెలంగాణ సీఎం కేసీఆర్‌తో సమావేశం తరువాత ఏపీ సీఎం జగన్‌తోనూ భేటీ కావాలని టాలీవుడ్ ప్రముఖులు భావించారు. ఇందుకోసం ప్రయత్నాలు కూడా మొదలుపెట్టారు. సీఎం జగన్‌ కూడా ఇందుకు సానుకూలంగానే స్పందించారని వార్తలు వచ్చాయి. అన్నీ అనుకున్నట్టు జరిగితే జూన్ మొదటి వారంలోనే ఈ సమావేశం ఉంటుందని ప్రచారం జరిగింది.

అయితే తాజాగా ఏపీ సీఎం జగన్‌తో జరగాల్సిన టాలీవుడ్ పెద్దల సమావేశం వాయిదా పడినట్టు తెలుస్తోంది. తెలంగాణ తరహాలోనే ఏపీ సీఎం జగన్‌ను కలవాలని భావించిన తెలుగు సినీ పెద్దలకు కేంద్రం తీసుకున్న నిర్ణయం నిరాశ కలిగించింది. కేంద్రం ధియేటర్లను తెరవడానికి అనుమతించకపోవడంతో ఇండస్ట్రీ మరింత కష్టాల్లోకి కూరుకుపోయే అవకాశం ఉందని సినీ పెద్దలు ఆందోళన చెందుతున్నారు. దీనిపై నిర్ణయం తీసుకోవాల్సింది కేంద్రమే కావడంతో... ఇక రాష్ట్ర ప్రభుత్వాలను కలిసినా పెద్దగా ప్రయోజనం ఉండదనేది సినీ పెద్దల అభిప్రాయంగా కనిపిస్తోంది.

ఇక ఏపీ ప్రభుత్వం ఇప్పటికే షూటింగ్స్‌కు అనుమతి కూడా ఇచ్చింది. దీంతో కొత్తగా ఏపీ ప్రభుత్వాన్ని కలిసి చర్చించాల్సిన అంశాలు కూడా ఏమీ లేవని పలువురు చర్చించుకుంటున్నారు. దీనికితోడు తెలంగాణ సర్కార్‌తో సినీ ప్రముఖులు జరిపిన సమావేశంపై టాలీవుడ్ అగ్ర హీరో బాలకృష్ణ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో... ఇప్పట్లో మళ్లీ అలాంటి సమావేశం ఉండకపోవచ్చనే టాక్ కూడా వినిపిస్తోంది.
First published: June 2, 2020, 7:38 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading