జగన్ నుంచి టాలీవుడ్‌కు పిలుపు... సమావేశం ఎప్పుడంటే...

ఇప్పటికే ఏపీ ప్రభుత్వం రాష్ట్రంలో షూటింగ్స్‌కు షరతులతో కూడిన అనుమతులు ఇచ్చింది. అయితే సీఎం జగన్‌ను కలిసి సినీ పరిశ్రమకు మరింత అండగా ఉండాలని కోరేందుకు సినీ పెద్దలు భావిస్తున్నారు.

news18-telugu
Updated: May 29, 2020, 6:10 PM IST
జగన్ నుంచి టాలీవుడ్‌కు పిలుపు... సమావేశం ఎప్పుడంటే...
ప్రతీకాత్మక చిత్రం (jagan tollywood)
  • Share this:
కరోనా సంక్షోభం, లాక్‌డౌన్ కారణంగా తెలుగు సినీ పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలు తీర్చేందుకు ఆ రంగానికి చెందిన ప్రముఖలు ప్రయత్నాలు చేస్తున్నారు. షూటింగ్స్‌కు అనుమతి సహా పలు అంశాలపై ఇప్పటికే తెలంగాణ సీఎం కేసీఆర్‌ను కలిసి చర్చించిన టాలీవుడ్ పెద్దలు... త్వరలోనే ఏపీ సీఎం జగన్‌ను కలిసి ఈ మేరకు చర్చలు జరపనున్నారని తెలుస్తోంది. ఇప్పటికే ఏపీ ప్రభుత్వం రాష్ట్రంలో షూటింగ్స్‌కు షరతులతో కూడిన అనుమతులు ఇచ్చింది. అయితే సీఎం జగన్‌ను కలిసి సినీ పరిశ్రమకు మరింత అండగా ఉండాలని కోరేందుకు సినీ పెద్దలు భావిస్తున్నారు.

ఇందుకోసం ఇప్పటికే సీఎం జగన్ అపాయింట్‌మెంట్‌ను వారు కోరినట్టు సమాచారం. మరోవైపు సినిమా ఇండస్ట్రీ సమస్యల విషయం చర్చించేందుకు ఎప్పుడైనా తన దగ్గరకు రావొచ్చని సీఎం జగన్ వారికి సూచించినట్టు తెలుస్తోంది. అయితే ఇందుకోసం వచ్చే ముందు టాలీవుడ్ తన నుంచి ఏం ఆశిస్తోందో, అలాగే ఆంధ్రలో సినిమా రంగ పరిశ్రమ అభివృద్దికి ప్రభుత్వం ఏం చేయాలనుకుంటున్నారో డిటైల్డ్ ప్లాన్ తో రావాలని ఆయన వారికి స్పష్టం చేసినట్టు తెలుస్తోంది.

సినిమా పరిశ్రమను విశాఖలో డెవలప్ చేయాలన్న ఆలోచనలో ఏపీ ప్రభుత్వం ఉందని... అది దృష్టిలో పెట్టుకుని సరైన ప్లాన్ తో రావాలని జగన్ చెప్పినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అన్నీ అనుకున్నట్టు జరిగితే... బహుశా జూన్ తొలివారంలో సినీ పెద్దలు సీఎం జగన్ కలిసేందుకు అమరావతికి పయనం అవుతారని తెలుస్తోంది. సీఎం జగన్‌ను కలవడానికి వెళ్లే సినీ బృందంలో ఎవరెవరు ఉండాలనే దానిపై సినీ పెద్దలు కసరత్తు చేస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.
Published by: Kishore Akkaladevi
First published: May 29, 2020, 6:10 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading