TOLLYWOOD ACTOR NATURAL STAR NANI SENSATIONAL COMMENT ON ANDHRA PRADESH GOVERNMENT NGS
Hero Nani: సినిమా కంటే కిరాణా షాపు నయం.. ప్రభుత్వంపై నాని సంచలన వ్యాఖ్యలు..
Nani Photo: Twitter
Hero Nani: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీరుపై హీరో నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం విధానం కారణంగా.. కిరణా షాపు వచ్చిన ఆదాయం కూడా సినిమాకు రావడం లేదని మండిపడ్డారు.
Hero Nani on Andhra Pradesh Government: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (Andhra Pradesh Government) తీరుపై హీరో నాని (Hero Nani) మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు.. రేపు ప్రపంచ వ్యాప్తంగా నాని నటించిన సినిమా శ్యామ్ సింగ రాయ్ (Shyam Singh Roy) రిలీజ్ అవుతోంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో పాల్గన్న ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో సినిమా టికెట్ల (Cinema Tickets) ధరలు తగ్గించడపై ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తీరు సరిగ్గా లేదన్నారు. తాను ఇప్పుడు ఏది మాట్లాడినా వివాదమే అవుతుందని.. కానీ తప్పని సరి పరిస్థితుల్లో మాట్లాడాల్సి వస్తోంది అన్నారు. ఎవరూ కోరకపోయిన టికెట్ ధరలు తగ్గించి ప్రేక్షకులను ప్రభుత్వం అవమానించింది అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో సినిమా థియేటర్ కంటే.. పక్కనే ఉండే కిరాణా షాపు అత్యధిక ఆదాయం సంపాదిస్తోంది అన్నారు. ఏపీలో సినిమా టికెట్ల కలెక్షన్ల కంటే కిరాణా షాపు కలెక్షన్లే బాగున్నాయి అన్నారు. టికెట్ ధరలు పెంచినా కొనగలిగే సామర్థ్యం ప్రేక్షకులకు ఉందని నాని అభిప్రాయపడ్డారు.
గత కొంతకాలంగా ఏపీ ప్రభుత్వం వర్సెస్ తెలుగు సినిమా ఇండస్ట్రీగా పరిస్థితి మారింది. ముఖ్యంగా కొన్ని రోజులుగా టిక్కెట్ ధరలకు సంబంధించి ప్రభుత్వ జారీ చేసిన జీవోపై తెలుగు పరిశ్రమలో వివాదం కొనసాగుతూనే ఉంది. స్టార్ హీరోలు.. బడా ప్రొడ్యూసర్లు అంతా ఏపీ ప్రభుత్వం తీరును బహిరంగంగానే తప్పు పడుతున్నారు. కొందరు లోలోనే తిట్టుకుంటున్నారు. కానీ బయటకు చెప్పడం లేదు.
నాని మాత్రం నేరుగా వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు సంచలనంగా మారింది. ఇప్పటికే పలుమార్లు టాలీవుడ్ పెద్దలు, కొంతమంది నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు కలిసి టికెట్ ధరలపై ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవోను రద్దు చేయాలని కోరారు. ఏపీ టికెట్ రేట్లపై ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 35పై కొందరు హైకోర్టుకు వెళ్లగా అక్కడ కొంత ఊరట లభించింది. అయినా ప్రభుత్వం సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ డివిజనల్ బెంచిలో అప్పీల్ వెళ్లింది.
హీరో నాని వ్యాఖ్యలకు నిర్మాత నట్టి కుమార్ కౌంటర్ ఇచ్చారు. నాని ఏదైనా ఆలోచించుకుని మాట్లాడాలి అన్నారు. టికెట్ల ధరలు కలెక్షన్ల గురించి అసలు నానికి ఏమి తెలుసు అని నట్టి కుమార్ ప్రశ్నించారు.
ఈ వివాదం కొనసాగుతుండగానే ఏపీలో థియేటర్ల సీజ్ వ్యవహారం మరింత దుమారం రేపుతోంది. కృష్ణా జిల్లాలో లైసెన్స్ లేకుండా నడుస్తున్న 15 థియేటర్ల మూసివేతకు ఆదేశాలిచ్చినట్లు తెలుస్తోంది. జిల్లా వ్యాప్తంగా అన్ని థియేటర్లలో టికెట్ రేట్లు, ఫైర్ సేఫ్టీ, కోవిడ్ ప్రోటోకాల్‌పై తనిఖీలు నిర్వహించారు. ప్రేక్షకుల భద్రత కోసం నిబంధనలు సరిగా ఉన్నాయో లేదో చెక్ చేశారు. టికెట్ రేట్ల కన్నా తినుబండారాల రేట్లు చాలా ఎక్కువగా ఉన్నాయని అధికారులు గుర్తించారు. ఇకపై మల్టీఫ్లెక్స్‌లతో పాటు అన్ని థియేటర్లకు ఫిక్స్డ్ రేట్లను ఫిక్స్ చేశారు. జీవో 35ను కోర్టులో కొట్టేయడంతో అంతకు ముందు రేట్ల అమలుపై అధికారులు దృష్టి సారించారు.
(Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
Published by:Nagabushan Paina
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.