Ballayya Politics: తెలుగు దేశం పార్టీ (Telugu Desam Party)లో ప్రస్తుతం నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu)కు అండగా ఉన్నది నందమూరి కుటుంబ (Nandamuri Family) అనడం ఎలాంటి సందేహం లేదు.. నారా కుటుంబాన్ని చూసి ఓట్లు వేసే వారికన్నా.. నందమూరి బ్రాండ్ తో ఓట్లు వేసేవారే ఎక్కువ ఉంటారన్నది ఏపీ రాజకీయాల్లో ఎప్పటి నుంచో బలంగా వినిపిస్తున్న వాదన. ఇప్పుడు నారా, నందమూరి కుటుంబానికి దగ్గుబాటి ఫ్యామిలీ కూడా తోడైతో ఆ బలం ఎంతో కొంత రెట్టింపు అవ్వడం ఖాయం.. అసలే ప్రస్తుతం టీడీపీ (TDP) పరిస్థితి అంతంత మాత్రమే ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమి తరువాత పరిస్థితి మరింత దిగజారుతూ వస్తోంది. అన్ని ఎన్నికల్లో ఓటమి తప్పడం లేదు. స్వయంగా చంద్రబాబుకు కంచుకోటగా చెప్పుకునే కుప్పం (Kuppam) లోనూ మున్సిపాలిటీని ప్రత్యర్థి పార్టీకి కోల్పోవలసి వచ్చింది. అక్కడితోనే అధికార వైసీపీ (YCP) ఆగడం లేదు. చంద్రబాబు వచ్చే ఎన్నికల్లో కుప్పం నుంచి పోటీ చేయాలి అంటే భయపడతారాని.. ఆయన గుమస్తాను కూడా ఎన్నికల్లో నిలబెట్టి.. గెలిపించ గలిగే సత్తా వైసీకి ఉందని మంత్రి పెద్ది రెడ్డి రామ చంద్రా రెడ్డి (Minster peddireddy Rama chandra Reddy) సవాల్ విసురుతున్నారు. అంటే చంద్రబాబును ఎంత ఒత్తిడిలోకి నెడుతున్నారో ఊహించవచ్చు. వైసీపీ విమర్శలు ఎలా ఉన్నా.. పార్టీకి మళ్లీ పునర్వైభవం తెచ్చేందుకు చంద్రబాబు మళ్లీ తన వ్యూహాలకు పదును పెడుతున్నారు. ఎన్నికలకు రేండేళ్లకు ముందే పావులు కదుపుతున్నారు. అందులో భాగంగానే వియ్యంకుడు బాలయ్య.. దగ్గుబాటి ఇంట సంక్రాంతి వేడుకలు జరుపుకున్నారనే ప్రచారం ఉంది.
ఎందుకంటే మొన్నటి వరకు అసలు బాలయ్య- అక్క పురందేశ్వరి ఎదురు పడినా నవ్వుకుని పలకరించుకున్న సందర్భం లేదు. అంతేకాదు ఎన్నికల సమయంలో ఒకరిపై ఒకరు విమర్శలు కూడా చేసుకున్నారు. బాలయ్య స్వయంగా అక్కపై తొడకొట్టిన సందర్భంగా కూడా ఉంది. ఇలా రాజకీయంగా ఇద్దరు దూరం దూరంగా ఉంటు వస్తున్నారు. అలాంటింది ఇప్పుడు అందరికీ షాక్ ఇస్తూ.. బాలయ్య సంక్రాంతి వేడుకలను తన రెండో బావ దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఇంట ప్రకాశం జిల్లా కారంచెడులో జరుపుకున్నారు. మూడు రోజుల పాటు కుటుంబ సమేతంగా అక్కడే ఉండి సందడి చేశారు. ఒకవేళ పండుగను జరుపుకున్నా చాలా సీక్రెట్ గా బంధువుల మధ్యలోనే జరుకునేవారు. కానీ తొలిసారి తెలుగు ప్రజలు అందరికీ తెలిసే విధంగా బాలయ్య సందడి చేశారు. వాటికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కూడా అయ్యాయి.
ఇదీ చదవండి : ఎన్టీఆర్ మళ్లీ జన్మిస్తారా..? ఆయన ఆత్మ ఏం చెప్పింది..? 26 ఏళ్ల తరువాత బయటపడ్డ రహస్యం..!
సాధారణంగా ఎప్పుడూ చంద్రబాషాబు సొంతూరు నారావారి పల్లెలో సంక్రాంతి సంబరాల్లో బాలయ్య పాల్గొంటారు. కానీ ఈసారి కారంచెడుకు రూటు మార్చారు. తొలిసారి పండుగకు అక్క పురందేశ్వరి ఇంటికి వచ్చారు. తనయుడు తో కలిసి బాలయ్య గుర్రపు స్వారీ చేయడం.. ఎండబండి తోలడం లాంటి ఫీట్లతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. అయితే బాలయ్య సందడి ఇప్పుడు రాజకీయంగా ఆసక్తి రేపుతోంది. ముఖ్యంగా బాబ నారా చంద్రబాబు నాయుడు సూచనల మేరకే ఆయన దగ్గుబాటి ఇంటికి వెళ్లారనే ప్రచారం ఉంది..
ఇదీ చదవండి : ఏపీలో మళ్లీ పీఆర్సీపై రచ్చ.. సమ్మెకు సై అంటున్నఉద్యోగ సంఘాలు
ప్రస్తుతం రాజకీయంగా చంద్రబాబు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. ఇలాంటి సమయంలో టీడీపీకి దూరమైనవారందరినీ దగ్గర చేర్చుకుంటే మంచిందని చంద్రబాబు భావిస్తున్నారు. ఇందులో భాగంగా దగ్గుబాటి కుటుంబం కూడా టీడీపీ లో చేరితే.. కచ్చితంగా రాజకీయంగా ప్లస్ అవుతుందని చంద్రబాబు భావిస్తున్నట్టు టాక్.. మరోవైపు దగ్దుబాటి దంపతులు కూడా తమ తనయకుడి రాజకీయ భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నారు. దీనిపై గతంలో నందమూరి ఇంట జరిగిన వివాహ వేడుకలో చంద్రబాబు, దగ్గుబాటు వెంకటేశ్వర్రావు కలిశారు. ఈ సందర్భంగా ఇద్దరి మధ్య మాటా మాటా కలిసింది. అప్పుడు తనయుడి రాజకీయ భవిష్యత్తుపై చంద్రబాబుతో మాట్లాడినట్టు కూడా సమాచారం..
తాజాగా అదే విషయంలోపై పూర్తి క్లారిటి ఇచ్చేందుకే బాలయ్య అక్క ఇంటికి వెళ్లారని ప్రచారం జరుగుతోంది. ఒక వేళ దగ్గుబాటి పురందేశ్వరి బీజేపీలో కొనసాగినా.. తనయుడ్ని మాత్రం టీడీపీలోకి పంపించే అవకాశాలు లేకపోలేదు. అలా అయితే.. బీజేపీతో టీడీపీ పొత్తు కుదిరేలా చేసే బాధ్యత కూడా పురందేశ్వరిపైనే ఉంటుంది. ఇలా అన్ని లెక్కలు వేసుకున్న తరువాత బాలయ్యను దగ్గుబాటి ఇంటికి పంపించారు అని రాజకీయ విశ్లేషకుల మాట.. ఇలా ఇద్దరి బావలను ఒకటి చేసేందుకు బాలయ్య సంక్రాంతి సంబరాలును ప్రకాశం జిల్లాల్లో జరుపుకున్నారన్నది పొలిటికల్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.
(Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.