టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ (vishwak sen) తిరుమల (Tirumala) శ్రీవారిని దర్శించుకున్నారు. నిన్న రాత్రి రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న విశ్వక్‌సేన్.. అక్కడి నుంచి కారులో అలిపిరి వరకు చేరుకున్నారు. ఆ తర్వాత మెట్ల మార్గంలో కాలినడకన తిరుమల చేరుకున్నారు. సోమవారం ఉదయం వీఐపీ బ్రేక్ దర్శనాల సమయంలో స్వామి వారిని దర్శించుకున్నారు. విశ్వక్‌సేన్‌తో పాటు మంచు విష్ణు, మరికొందరు కూడా తిరుమల వెంకటేశ్వరుడిని దర్శించుకున్నారు. దర్శనంతరం వీరికి ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించారు. ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామి వారి తీర్ధప్రసాదాలు అందజేసారు.
దర్శనంతరం ఆలయ వెలుపల మీడియాతో మాట్లాడిన విశ్వక్ సేన్.. అర్జున్‌తో తనకు ఉన్న వివాదాన్ని తోసిపుచ్చారు. తన ప్రతి సినిమా విడుదల ముందు తిరుమల శ్రీవారిని దర్శించుకుంటానని.. అది కూడా నడకమార్గంలోనే తిరుమలకు వెళ్తానని చెప్పారు. ఉగాది పర్వదినం పురస్కరించుకొని తాను దర్శకత్వం వహించి నటించిన ధాస్ కా ధమ్కీ సినిమా విడుదల కానుందనని తెలిపారు. ఉగాది నాడు అందరిని సినిమా థియేటర్లలో కలుసుకుందామని అన్నారు. త్వరలోనే ఇంకా సినిమాను చేయనున్నట్లు ప్రకటించారు.
కాలినడకన తిరుమలకు వెళుతున్న హీరో విశ్వక్ సేన్ Actor VishwakSen is on his way to Tirumala by walk | news18telugu#vishwaksen #DasKaDhamki #tirumalatemple #news18telugu pic.twitter.com/BSarp7Otu5
— News18 Telugu (@News18Telugu) March 20, 2023
Tirupati: తిరుపతి కోదండరామస్వామివారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం.. నేటి కార్యక్రమాలు ఇవే
విశ్వక్‌సేన్ కథానాయకుడిగా స్వీయ దర్శకత్వంలో దాస్ కా దమ్కీ (Das Ka Dhamki) చిత్రాన్ని పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కించారు. ఈ మూవీలో విశ్వక్ సేన్ సరసన నివేదా పేతురాజ్ కథానాయిక (Nivetha Pethuraj)గా నటించింది. ఇతర పాత్రల్లో రావు రమేశ్, పృథ్వీరాజ్, హైపర్ ఆది నటించారు. ప్రసన్నకుమార్ బెజవాడ కథ అందించగా... లియోన్ జేమ్స్ మ్యూజిక్ అందించారు. ఈ చిత్రాన్ని వన్మయి క్రియేషన్స్, విశ్వక్ సేన్ సినిమాస్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మించాయి. ఉగాది పర్వదినం సందర్భంగా... మార్చి 22న ప్రేక్షకుల ముందు రానుంది. ఈ నేపథ్యంలో చిత్ర ప్రీ రిలీజ్ వేడుక ఘనంగా జరుగుతోంది. రెండు రోజుల క్రితం జరిగిన ఈ మూవీ ప్రిరిలీజ్ ఈవెంట్‌కు యంగ్ టైగర్ ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా హాజరైన విషయం తెలిసిందే.
కాగా, మార్చి 19న తిరుమల శ్రీవారిని 81,700 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 27,982 మంది తలనీలాలు సమర్పించారు. భక్తుల కానుకల రూపంలో తిరుమల శ్రీవారి హుండీకి 4.20 కోట్ల ఆదాయం వచ్చింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Local News, Tirupati, Tollywood, Vishwak Sen